Salaar: 'సలార్' దెబ్బకు బుక్ మై షో క్రాష్ - ఇదీ ప్రభాస్ రేంజ్
Salaar tickets booking hyderabad Bookmyshow: ప్రభాస్ ఫ్యాన్స్ దెబ్బకు టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షో చేతులు ఎత్తేసిందని, యాప్ క్రాష్ అయ్యిందని పలువురు నెటిజనులు ట్వీట్ చేస్తున్నారు.
Salaar tickets booking Telangana, Andhra Pradesh: 'సలార్' టికెట్స్ కోసం రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారనేది చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో 'సలార్' అడ్వాన్స్ బుకింగ్స్ మంగళవారం రాత్రి ఓపెన్ చేశారు. ఆ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్, సినిమాను నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేశాయి. దాంతో మంగళవారం రాత్రి 8.24 గంటలకు ఫ్యాన్స్ అందరూ బుక్ మై షో యాప్ ఓపెన్ చేశారు.
కాసేపు పని చేయడం మానేసిన బుక్ మై షో!
bookmyshow application crashed: తెలంగాణ, ఏపీ... థియేటర్లలో టికెట్స్ ఓపెన్ చేయడమే ఆలస్యం, జనాలు బుక్ మై షో యాప్ మీద పడ్డారు. ఒక్కసారిగా వేలాది, లక్షలాది మంది యాప్ ఓపెన్ చేయడంతో కాసేపు పని చేయలేదు. క్రాష్ అయ్యింది. చెప్పడానికి ఇంకేముంది? బుక్ మై షో క్రాష్ అయిన ఫోటోలు స్క్రీన్ షాట్స్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడం స్టార్ట్ చేశారు నెటిజనులు. ఆ లిస్టులో 'బాహుబలి' చిత్ర నిర్మాతలలో ఒకరైన శోభు యార్లగడ్డ సైతం ఉన్నారు.
Also Read: ప్రభాస్ ఫ్యాన్స్‌పై పోలీసుల లాఠీ ఛార్జ్ - థియేటర్ల దగ్గర గందరగోళం
#Salaar effect ! #Prabhas !!👍 pic.twitter.com/v3WyFTuThH
— Shobu Yarlagadda (@Shobu_) December 19, 2023
యాప్ క్రాష్ కావడంతో కాసేపు బ్రేక్ ఇచ్చిన బుక్ మై షో, ఆ తర్వాత అన్ని థియేటర్ల టికెట్స్ ఒకేసారి అప్ లోడ్ చేయకుండా నెమ్మదిగా ఒక్కో థియేటర్ బుకింగ్స్ ఓపెన్ చేయడం మొదలు పెట్టింది. గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేసిన 'అన్‌స్టాపబుల్' టాక్ షోకి ప్రభాస్ అతిథిగా వచ్చారు. ఆ ఎపిసోడ్ స్ట్రీమింగ్ రోజున సైతం కాసేపు యాప్ పని చేయలేదు. ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువ మంది ఓపెన్ చేయడంతో ఆహా క్రాష్ అయ్యింది. ఇప్పుడు 'బుక్ మై షో' వంతు! 'సలార్' నైజాం టికెట్ బుకింగ్స్ ఓపెన్ కానున్న సందర్భంగా నటి శ్రియా రెడ్డి ట్వీట్ చేశారు. 'థియేటర్లు అన్నీ హౌస్‌ఫుల్స్‌తో ఎరుపెక్కాలి' అని ఆ ట్వీట్ కోట్ చేసింది హోంబలే ఫిలిమ్స్. ప్రజెంట్ ట్రెండ్ చూస్తుంటే అలా ఎరుపెక్కడం ఖాయం అని అర్థం అవుతోంది.
Also Read: ఉపాసన రూటులో లావణ్య... కొణిదెల వారి కొత్త కోడలు ఇంటి పేరు మార్చిందండోయ్!
Theatres anni housefulls tho erupekkala ❤️🔥💥#SalaarCeaseFire Nizam bookings open now! https://t.co/S2ibSsouj0 pic.twitter.com/aOWLBjupQe
— Hombale Films (@hombalefilms) December 19, 2023
యాక్షన్ ట్రైలర్ తర్వాత ఆకాశాన్ని అంటిన అంచనాలు
'సలార్' థియేట్రికల్ ట్రైలర్ విడుదలైన తర్వాత ప్రేక్షకులు కొందరు పెదవి విరిచారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ నుంచి ఆశించిన కంటెంట్ లేదని, తమకు ట్రైలర్ నచ్చలేదని చెప్పుకొచ్చారు. అసంతృప్తులకు రెండో ట్రైలర్ ఫుల్ మీల్స్ పెట్టిందని చెప్పవచ్చు. ప్రభాస్ నుంచి ఫ్యాన్స్ ఏం అయితే ఆశించారో... ఆ యాక్షన్ మెటీరియల్ అందులో ఉంది. దాంతో సామాన్య ప్రేక్షకులలో సైతం సినిమాపై అంచనాలు పెరిగాయి. అదీ సంగతి!
Also Read: ‘సలార్’ వర్సెస్ ‘డంకీ’ - ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో ఎవరిది పైచేయి?