Salaar: ప్రభాస్ ఫ్యాన్స్‌పై పోలీసుల లాఠీ ఛార్జ్ - 'సలార్' టికెట్స్ కోసం ప్రేక్షకుల తిప్పలు
Salaar Advance booking: 'సలార్' టికెట్స్ కోసం హైదరాబాద్ సిటీలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లకు వెళ్లిన అభిమానులు కొందరు పోలీసుల చేతిలో తన్నులు తిన్నారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Salaar tickets craze in Hyderabad: 'సలార్' అడ్వాన్స్ బుకింగ్స్, టికెట్ సేల్స్ జోరుగా సాగుతున్నాయి. ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం రాత్రి టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అయితే... అంతకు ముందు కొన్ని థియేటర్లలో కౌంటర్ దగ్గర టికెట్స్ అమ్మారు. వీలైనంత ఎర్లీగా ఫస్ట్ డే సినిమా చూడాలని రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులు థియేటర్ కౌంటర్ల దగ్గర క్యూ కట్టారు.
'బాహుబలి'కి ఏ స్థాయిలో క్రేజ్ ఉందో...
ఇప్పుడీ 'సలార్'కూ అదే స్థాయిలో క్రేజ్!
ఐదేళ్ళ క్రితం... ఏప్రిల్ 28, 2017లో 'బాహుబలి 2' విడుదల అయ్యింది. అప్పుడు ఆ సినిమా టికెట్స్ కోసం ప్రేక్షకులు థియేటర్ల దగ్గర ఎలా అయితే బారులు తీరారో... ఇప్పుడీ 'సలార్' కోసం కూడా అదే విధంగా క్యూ లైనుల్లో నిలబడ్డారు. ఈ సినిమాకు ముందు ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్', 'రాధే శ్యామ్' ఆశించిన విజయాలు సాధించలేదు. అయితే... ఆ ఎఫెక్ట్ 'సలార్' మీద పడలేదు. ఈ సీఎంగా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ కావడం, రెండో ట్రైలర్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చడంతో అడ్వాన్స్ బుకింగ్ ట్రెండ్ బావుంది.
Also Read: ఉపాసన రూటులో లావణ్య... కొణిదెల వారి కొత్త కోడలు ఇంటి పేరు మార్చిందండోయ్!
"Bringing Back The Glory of Indian Cinema" 🔥🔥🔥
— Ayyo (@AyyAyy0) December 19, 2023
Its been 8 years, still the craze is the same 🤩#SalaarNizamBookings 💥💥💥#Prabhas #Salaar #SalaarCeaseFire #SalaarCeaseFireOnDec22 pic.twitter.com/lR6D3CexRG
#Salaar #rtcxroads #sandhya70mm pic.twitter.com/CuelDmLI4l
— Dheeraj.18 (@whyraat18) December 19, 2023
ప్రభాస్ అభిమానులపై పోలీసుల లాఠీ ఛార్జ్!
థియేటర్ల దగ్గర కౌంటర్లలో టికెట్స్ అమ్మడంపై ప్రేక్షకులలో కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. మరికొందరి నుంచి మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. ఒక వైపు ప్రభాస్, ఆయన సినిమాకు క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుంటే... మరో వైపు అభిమానులు ఎగబడటంతో వాళ్ళను కంట్రోల్ చేయడానికి పోలీసులకు లాఠీ ఛార్జ్ చేయక తప్పలేదు. దాంతో కొందరు ఫ్యాన్స్ తన్నులు తిన్నారు.
Also Read: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల మీటింగ్‌కు అంతా రెడీ - ఎప్పుడు కలుస్తారంటే?
Bring back the glory with #Salaar 💥💥💥💥💥 https://t.co/Hs2NMVvdF2 pic.twitter.com/slBll1bNpf
— Radoo🌶️ (@Chandan_radoo) December 19, 2023
ఏపీ, తెలంగాణలో టికెట్ రేట్లు పెరిగాయ్!
Salaar advance bookings: 'సలార్' అడ్వాన్స్ బుకింగ్స్ ఆలస్యంగా ప్రారంభం కావడం వెనుక కారణం ఏమిటి? అంటే... భారీ బడ్జెట్ సినిమా కనుక ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ - రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతి కోరారు. ఏపీలో పది రోజుల పాటు ప్రస్తుతం ఉన్న టికెట్ రేటు మీద రూ. 40 పెంచుకోవడానికి అనుమతి ఇవ్వగా... తెలంగాణలో వారం పాటు ప్రస్తుత టికెట్ రేటు మీద మల్టీప్లెక్స్ స్క్రీన్లలో రూ. 100, సింగిల్ స్క్రీన్లలో రూ. 55 పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు.