(Source: Poll of Polls)
Salaar Vs Dunki: ‘సలార్’ వర్సెస్ ‘డంకీ’ - ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో ఎవరిది పైచేయి?
ప్రభాస్ ప్యాన్ ఇండియా చిత్రం ‘సలార్’, షారుఖ్ ఖాన్ ప్యాన్ ఇండియా చిత్రం ‘డంకీ’.. బాక్సాఫీస్ దగ్గర పోటీ పడనున్నాయి. దీంతో వీటి ప్రీ రిలీజ్ బిజినెస్‌పై సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.
రెండు ప్యాన్ ఇండియా చిత్రాలు ఒకేసారి బాక్సాఫీస్‌పై దండయాత్ర చేస్తే.. ఒక్కొక్కసారి రెండిటికీ సరిపడా కలెక్షన్స్ రాలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ప్యాన్ ఇండియా చిత్రాలకు కనీసం రెండు వారాల గ్యాప్ ఉండేలా చూసుకుంటున్నారు. కానీ ‘డంకీ’, ‘సలార్’ విషయంలో అలా జరగడం లేదు. కేవలం ఒకే రోజు గ్యాప్‌లో ఈ రెండు సినిమాలు థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. దీంతో ‘సలార్ వర్సెస్ డంకీ’ పోటీ మొదలయ్యింది. అందుకే వీటి ప్రీ రిలీజ్ బిజినెస్‌పై ఫ్యాన్స్ దృష్టిపెట్టారు. ఏ సినిమా గొప్ప? ఏ హీరో గొప్ప? అని చర్చలు మొదలుపెట్టారు.
ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు..
ఇండియాలో మాత్రమే కాదు.. ఓవర్సీస్‌లో కూడా ‘సలార్ వర్సెస్ డంకీ’ పోటీ నడుస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ‘సలార్’, రాజ్‌కుమారీ హిరానీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ నటించిన ‘డంకీ’.. ఈ రెండిటిపై మూవీ లవర్స్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. ‘సలార్’కంటే ఒకరోజు ముందే ‘డంకీ’ విడుదల అవుతుంది. అంటే ‘సలార్’కంటే ‘డంకీ’నే ఎక్కువ రిస్క్ తీసుకోనుంది. ఒకవేళ ముందు విడుదలయిన సినిమా కాస్త నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా.. ప్రేక్షకులు వెంటనే ‘సలార్’కు షిఫ్ట్ అయిపోతారు. ప్రస్తుతం ఇండియాలోని ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో ఏ సినిమా లెక్కలు ఎంత అనే వివరాలు బయటికొచ్చాయి. ఇండియాలో ఫేమస్ స్క్రీన్స్ అయిన పీవీఆర్, ఐనాక్స్, సినీపొలీస్‌లలో ఎన్ని టికెట్స్ బుక్ అయ్యాయి. వాటి వల్ల ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి అనే వివరాలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి.
‘డంకీ’ ప్రీ రిలీజ్ బిజినెస్..
ముందుగా ‘డంకీ’ విషయానికొస్తే.. ఇప్పటివరకు ఇండియాలోని పీవీఆర్‌లలో 54770 టికెట్స్ బుక్ అయ్యాయి అంటే రూ.2.22 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఐనాక్స్‌లలో 37161 టికెట్లు అమ్ముడు అవ్వడంతో రూ.1.38 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సినీపొలీస్‌లలో 19705 టికెట్లు ప్రీ బుక్ అవ్వడంతో.. దీని వల్ల రూ.72 లక్షల బిజినెస్ జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఇండియాలో మొత్తంగా ‘డంకీ’ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.4.32 కోట్లకు చేరుకుంది. ప్రముఖ థియేటర్ స్క్రీన్‌ను పక్కన పెడితే.. ప్యాన్ ఇండియా మొత్తంలో ‘డంకీ’కి 246900 టికెట్లు ప్రీ బుకింగ్ జరిగాయి. దాంతో దేశవ్యాప్తంగా ఈ సినిమాకు రూ.7.51 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. ఇక ‘డంకీ’ అమెరికా బాక్సాఫీస్ విషయానికొస్తే.. మొదటిరోజే 267,100 డాలర్లు అంటే దాదాపు రూ.2.24 కోట్లు కలెక్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికాలోనే 447 లొకేషన్స్‌లో 1272 షోలు ఏర్పాటు కాగా.. ఇప్పటికీ 19439 టికెట్లు బుక్ అయ్యాయి.
USA🇺🇸 Box Office
— Manobala Vijayabalan (@ManobalaV) December 19, 2023
Advance Sales:
#Salaar
Marching towards $1.5 million
Premiere
Gross - $1,201,511 [₹9.99 cr]
Locs - 472
Shows - 1530
Tickets - 45423
#Dunki
Crosses… pic.twitter.com/hOS8a8v90N
‘సలార్’ ప్రీ రిలీజ్ బిజినెస్..
కలెక్షన్స్ విషయంలో, ప్రీ బుకింగ్ విషయంలో ‘డంకీ’కి ఏ మాత్రం తీసిపోదు ‘సలార్’. ఇండియాలోని పీవీఆర్‌లలో ఇప్పటికే ‘సలార్’కు 26113 టికెట్స్ బుక్ అయ్యాయి. దాని వల్ల రూ.1.29 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఐనాక్స్‌లలో 14970 టికెట్లు బుక్ కాగా.. రూ.57 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సినీపొలీస్‌లలో 7520 టికెట్లు బుక్ అయ్యాయి కాబట్టి రూ.32 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ దగ్గర ఆగిపోయింది. మొత్తంగా ఈ ప్రముఖ స్క్రీన్స్ వల్ల ‘సలార్’కు రూ.2.18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక దేశవ్యాప్తంగా ‘సలార్’కు 252600 టికెట్లు ప్రీ బుకింగ్ జరిగాయి. దీని వల్ల రూ.6.49 కోట్ల ప్రీ రిలీజ్ కలెక్షన్స్‌ను సాధించింది ‘సలార్’. దీన్ని బట్టి చూస్తే ఇండియా వ్యాప్తంగా ‘డంకీ’ ప్రీ రిలీజ్ కలెక్షన్స్‌తో పోలిస్తే.. ‘సలార్’ కాస్త తక్కువలో ఉంది. ఇక అమెరికా విషయానికొస్తే.. ‘సలార్’ తన జెండాను ఎగరేస్తోంది. ఇప్పటికే అమెరికాలో 1,201,511 డాలర్ల ప్రీ రిలీజ్ కలెక్షన్స్‌ను సొంతం చేసుకుంది ఈ సినిమా. అంటే దాదాపుగా రూ.9.99 కోట్లు. యూఎస్‌లోనే 472 లొకేషన్స్‌లో ‘సలార్’ విడుదల అవుతుండగా.. 1530 షోలకు ఏర్పాట్లు జరిగాయి. 45423 టికెట్స్ బుక్ అయ్యాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో రెండు సినిమాలు పోటాపోటీగా ముందుకెళ్తున్నాయి.
#Salaar & #Dunki advance sales in India for the opening day.
— Manobala Vijayabalan (@ManobalaV) December 19, 2023
National Chains
Dunki
PVR - 54770 - ₹ 2.22 cr
INOX - 37161 - ₹ 1.38 cr
Cinepolis - 19705 - ₹ 0.72 cr
Total Gross = ₹ 4.32 cr
Salaar
PVR - 26113- ₹ 1.29 cr
INOX - 14970- ₹ 0.57 cr
Cinepolis - 7520- ₹ 0.32 cr… pic.twitter.com/OmEzRaPom8
Also Read: వయలెన్స్ చూపిస్తే తప్పేంటి? 'సలార్'కు అదేమీ నెగెటివ్ కాదు - పృథ్వీరాజ్ కామెంట్స్