Prithviraj Sukumaran: వయలెన్స్ చూపిస్తే తప్పేంటి? 'సలార్'కు అదేమీ నెగెటివ్ కాదు - పృథ్వీరాజ్ కామెంట్స్
ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘సలార్’లో మలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. దీంతో ఈ సినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టాడు.
Prithviraj Sukumaran interview Salaar movie: ‘సలార్’ కోసం సౌత్ ఇండస్ట్రీ అంతా కలిసి పనిచేస్తోంది. రెబల్ స్టార్‌గా ప్యాన్ ఇండియాలో పేరు తెచ్చుకున్న ప్రభాస్‌తో పాటు మలయాళంలో వెర్సటైల్ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న పృథ్విరాజ్ సుకుమారన్ ఇందులో లీడ్ రోల్స్ చేస్తున్నారు. కన్నడ సినిమా రూపురేఖలనే మార్చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్నాడు. దీంతో ప్యాన్ ఇండియా చిత్రంగా విడుదలవుతున్న ‘సలార్’కు అన్ని భాషల ప్రేక్షకుల దగ్గర నుండి ఆదరణ లభిస్తోంది. సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ప్రేక్షకులందరూ ఎదురు చూస్తున్నారు. విడుదల ఇంకా కొన్నిరోజులే ఉండగా... ఇందులో కీలక పాత్ర పోషించిన పృథ్విరాజ్ సుకుమారన్ ‘సలార్’ గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టారు.
మొదట్లోనే అర్థమయిపోతుంది..
‘‘సినిమాలో చాలా యాక్షన్ ఉంటుంది. కానీ ఇది ఇద్దరు స్నేహితుల కథ అన్న విషయంలో మాత్రం ప్రశాంత్ చాలా స్పష్టంగా ఉన్నాడు. ఇదే మేం ప్రేక్షకులకు చూపించాలని అనుకున్నాం. ఇప్పటివరకు విడుదలయిన ట్రైలర్స్, పాటలో కూడా సినిమా ఏంటనేది ఓపెన్‌గా రివీల్ చేశాం. సినిమా ప్రారంభమయిన వెంటనే... వారి ఫ్రెండ్‌షిప్ ఎందుకంత గట్టిగా ఉంది? దానికి కారణమేంటి? అని మీకు అర్థమయిపోతుంది. ప్రభాస్ ఎప్పుడూ సినిమాకే మొదటి ప్రాధాన్యత ఇస్తాడు. ముందుగా ప్లాన్ చేసుకున్న దానికంటే నా స్క్రీన్ టైమ్ చాలా పెరిగింది. నా క్యారెక్టర్‌లో జరిగిన చాలా వరకు మార్పులకు కారణం ప్రభాసే. ఇదిలా ఉండాలి, అదలా ఉండాలి అని చెప్పేవాడు. తను దేశంలోనే అతిపెద్ద స్టార్లలో ఒకడు. ఆ స్థానాన్ని తను చాలా జాగ్రత్తగా నిలబెట్టుకుంటాడు’’ అని ప్రభాస్ గురించి, తన పాత్ర గురించి చెప్పుకొచ్చాడు పృథ్విరాజ్.
వైలెన్స్ తప్పేమీ కాదు..
‘‘మీరు ఒకవేళ ప్రభాస్ ఫ్యాన్ అయితే... థియేటర్ నుండి చాలా సంతోషంగా బయటికి వెళ్తారు. మరో షోకు టికెట్ కూడా కావాలని కోరుకుంటారు. సినిమాల్లో హింసను చూపించడంతో నాకేం సమస్య లేదు. సినిమాలోని లోతును చూపించడం కోసం వైలెన్స్‌ను ఒక ఫ్యాక్టర్‌లాగా ఉపయోగించడంలో తప్పు లేదని నా అభిప్రాయం. సలార్‌లో అలాగే ఉంటుంది. ఈ సినిమా కథ.. ప్రపంచంలోనే అతి హింసాత్మకమైన మనుషులు పాలించే, జీవించే ఒక ప్రాంతం చుట్టూ తిరుగుతుంది. వాళ్లందరిలో అత్యంత భయంకరమైన వ్యక్తి ఒకడు ఉంటాడు’’ అంటూ సినిమాల్లో చూపించే వైలెన్స్‌పై తన అభిప్రాయాన్ని తెలిపాడు పృథ్విరాజ్ సుకుమారన్.
Also Read: 'కెజియఫ్'లో చేసిన తప్పే మళ్ళీ 'సలార్'కు...
అలా అస్సలు అనుకోవడం లేదు..
‘‘వరదరాజా మన్నార్, దేవా పాత్రలకు ఒకదానితో ఒకటి కనెక్షన్ ఉంటుంది. ప్రభాస్ పాత్రను వరద ఎప్పుడూ కంట్రోల్ చేస్తూ.. కట్టిపడేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ ప్రభాస్ పాత్ర కంట్రోల్ తప్పితే... అది మళ్లీ కంట్రోల్‌లోకి తీసుకురావడం తన వల్ల కూడా కాదు అని వరదాకు తెలుసు. కానీ ఒక సమయంలో ఆ కనెక్షన్ తెగిపోతుంది. వరదా పాత్ర ఎప్పుడూ అంత కంట్రోలింగ్‌గా ఎందుకు ఉంటుంది అని ఆ హింసను చూసిన తర్వాత ప్రేక్షకులకు అర్థమవుతుంది. సలార్‌లో ఉన్న వైలెన్స్ వల్ల నెగిటివిటీ వస్తుందని నేను అస్సలు అనుకోవడం లేదు. అలా జరిగితే నేను ముందుగా ఆశ్చర్యపోతాను. నేను సినిమాలోని అన్ని వైలెంట్ సన్నివేశాలను చూశాను. అందులో ఒక్కటి కూడా నన్ను డిస్టర్బ్ చేయలేదు. స్క్రీన్ నుండి మొహం తిప్పేసుకునే వైలెన్స్ కాదు అది’’ అని ప్రభాస్ పాత్రపై, సలార్‌లోని వైలెన్స్‌పై క్లారిటీ ఇచ్చాడు పృథ్వి అలియాస్ వరధరాజా మాన్నార్.
Also Read: ప్రభాస్, ప్రశాంత్ నీల్‌లో అది కామన్, హీరోను ఇరిటేట్ చేశా - ఆసక్తికర విషయాలు బయటపెట్టిన శృతి హాసన్