News
News
X

Sai Dhanshika New Movie : 'మంత్ర' దర్శకుడి కొత్త సినిమా - 'కబాలి'లో రజనీ కుమార్తెగా నటించిన అమ్మాయితో

ఛార్మీ కౌర్ ప్రధాన పాత్రలో నటించిన 'మంత్ర', 'మంగళ' సినిమాలు తెలుగులో ఫిమేల్ ఓరియెంటెడ్ థ్రిల్లర్స్ ట్రెండ్ సెట్ చేశాయి. ఆ సినిమాలు తీసిన దర్శకుడు ఓషో తులసీరామ్ కొత్త సినిమా నేడు ప్రారంభమైంది. 

FOLLOW US: 

ఛార్మీ కౌర్ నటించిన సినిమాల్లో 'మంత్ర', 'మంగళ' చిత్రాలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆ రెండూ తెలుగులో ఫిమేల్ ఓరియెంటెడ్ థ్రిల్లర్స్ ఎక్కువ రావడానికి కారణం అని చెప్పాలి. కథ, కథనం, దర్శకత్వం విషయంలో ట్రెండ్ సెట్ చేశాయి. ఆ సినిమాలకు ఓషో తులసీరామ్ (Osho Tulasi Ram) దర్శకుడు. ఆయన దర్శకత్వంలో నేడు నూతన చిత్రం ప్రారంభం అయ్యింది. 

'కబాలి'లో రజనీకాంత్ కుమార్తె పాత్రలో నటించిన సాయి ధన్సిక (Sai Dhanshika) గుర్తు ఉన్నారు కదా! ఈ మధ్య 'షికారు' సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సాయి ధన్సిక ప్రధాన పాత్రలో ఓషో తులసీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'దక్షిణ' (Dakshina Movie 2022). కల్ట్ కాన్సెప్ట్స్ పతాకంపై అశోక్ షిండే (Ashok Shinde) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించడంతో పాటు ఈ రోజు రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారు.

హైదరాబాద్‌లోని నరసింహారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో 'దక్షిణ' పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ నిర్మాత వంశీకృష్ణ ముహూర్తపు సన్నివేశానికి కెమెరా స్విచ్ఛాన్ చేయగా... ప్రణతి, శ్వేతా భావన క్లాప్ ఇచ్చారు.

లేడీ ఓరియెంటెడ్ సస్పెన్స్ థ్రిల్లర్ 
సినిమా ప్రారంభమైన సందర్భంగా చిత్ర నిర్మాత అశోక్ షిండే మాట్లాడుతూ ''ఇదొక లేడీ ఓరియెంటెడ్ సస్పెన్స్ థ్రిల్లర్ (sai dhanshika in female driven suspense thriller). ఓషో తులసీరామ్ దర్శకత్వం వహించిన 'మంత్ర', 'మంగళ' తెలుగులో ఫిమేల్ ఓరియెంటెడ్ థ్రిల్లర్స్ ట్రెండ్ సెట్ చేశాయి.  ఆ సినిమాల తరహాలో 'దక్షిణ' ఉంటుంది. సాయి ధన్సిక, ఓషో తులసీరామ్ కలయికలో సినిమా చేయడం సంతోషంగా ఉంది. నవంబర్ రెండో వారానికి సినిమా షూటింగ్ పూర్తి చేయాలనుకుంటున్నాం. మొత్తం మూడు షెడ్యూళ్లలో చిత్రీకరణ పూర్తి చేస్తాం. మొదటి షెడ్యూల్ ఈ రోజు ప్రారంభించాం. హైదరాబాద్‌లో ఈ నెల 24 వరకు ఈ షెడ్యూల్ జరుగుతుంది. రెండో షెడ్యూల్ గోవాలో అక్టోబర్ 6 నుంచి 20వ తేదీ వరకు ప్లాన్ చేశాం. మూడో షెడ్యూల్ మళ్ళీ హైదరాబాద్‌లో నవంబర్ 1 వ తేదీ నుంచి 10 వరకు జరుగుతుంది. దాంతో సినిమా మొత్తం పూర్తవుతుంది'' అని చెప్పారు. 

Also Read : రాజ మందిరంలోకి వంచన, ద్రోహం - మణిరత్నం తీసిన విజువల్ వండర్, 'పొన్నియన్ సెల్వన్' ట్రైలర్

'దక్షిణ' సినిమాలో కనిపించబోయే ఇతర నటీనటులు, సినిమాకు పని చేయబోయే సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. సాయి ధన్సిక, రిషబ్ బసు, సుభాష్, ఆనంద భారతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : నర్సింగ్, సంగీతం : బాలాజీ, నిర్మాణ సంస్థ: కల్ట్ కాన్సెప్ట్స్, నిర్మాత : అశోక్ షిండే, దర్శకత్వం : ఓషో తులసీరామ్. 

Also Read : పవన్ కోసం మూడు కథలు రెడీ చేసిన సుజిత్ - 'బిల్లా', 'పంజా' తరహాలో?

Published at : 07 Sep 2022 04:20 PM (IST) Tags: Sai Dhanshika New Movie Osho Tulasi Ram Dakshina Movie Dakshina 2022 Movie Ashok Shinde Producer Sai Dhanshika Telugu Movie

సంబంధిత కథనాలు

Nagarjuna Bigg Boss 6 : 'బిగ్ బాస్ 6' టీఆర్పీపై నాగార్జున కామెంట్

Nagarjuna Bigg Boss 6 : 'బిగ్ బాస్ 6' టీఆర్పీపై నాగార్జున కామెంట్

ఎన్టీఆర్ సినిమాలు చూసి నేర్చుకోండి - ‘ఆదిపురుష్’ దర్శకుడిపై ‘కేజీఎఫ్’ నటి ఆగ్రహం

ఎన్టీఆర్ సినిమాలు చూసి నేర్చుకోండి - ‘ఆదిపురుష్’ దర్శకుడిపై ‘కేజీఎఫ్’ నటి ఆగ్రహం

Dussehra 2022 Celebrations: కేజ్రీవాల్‌తో కలిసి రావణ సంహారం చేయనున్న 'ఆదిపురుష్'!

Dussehra 2022 Celebrations: కేజ్రీవాల్‌తో కలిసి రావణ సంహారం చేయనున్న 'ఆదిపురుష్'!

Adipurush Teaser Controversy: ‘ఆదిపురుష్’ దర్శకుడిపై హోం మంత్రి ఆగ్రహం - ఆ సీన్లు తొలగించకపోతే చర్యలు తప్పవు

Adipurush Teaser Controversy: ‘ఆదిపురుష్’ దర్శకుడిపై హోం మంత్రి ఆగ్రహం - ఆ సీన్లు తొలగించకపోతే చర్యలు తప్పవు

Chandrababu In Unstoppable Show:- బాలయ్య అన్‌స్టాపబుల్‌- 2కు ఫస్ట్ గెస్ట్‌గా చంద్రబాబు!

Chandrababu In Unstoppable Show:- బాలయ్య అన్‌స్టాపబుల్‌- 2కు ఫస్ట్ గెస్ట్‌గా చంద్రబాబు!

టాప్ స్టోరీస్

కేసీఆర్ వల్ల భూలోకంలోనే నరకం అనుభవించాను: ఈటల రాజేందర్

కేసీఆర్ వల్ల భూలోకంలోనే నరకం అనుభవించాను: ఈటల రాజేందర్

In Pics : తణుకులో ఎడ్ల పోటీలు, పాల్గొన్న మంత్రి రోజా

In Pics : తణుకులో ఎడ్ల పోటీలు, పాల్గొన్న మంత్రి రోజా

Munugode TRS : మునుగోడులో మోహరించనున్న 86 మంది ఎమ్మెల్యేలు - హరీష్ రావుకే కీలక బాధ్యతలిచ్చిన కేసీఆర్ !

Munugode TRS :  మునుగోడులో మోహరించనున్న 86 మంది ఎమ్మెల్యేలు - హరీష్ రావుకే కీలక బాధ్యతలిచ్చిన కేసీఆర్ !

Amit Shah Jammu Kashmir Visit: జమ్ముకశ్మీర్‌లో అమిత్ షా కీలక ప్రకటన- ఆ వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ!

Amit Shah Jammu Kashmir Visit: జమ్ముకశ్మీర్‌లో అమిత్ షా కీలక ప్రకటన- ఆ వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ!