Pawan Kalyan Sujeeth Movie : పవన్ కోసం మూడు కథలు రెడీ చేసిన సుజిత్ - 'బిల్లా', 'పంజా' తరహాలో?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, 'సాహో' దర్శకుడు సుజిత్‌తో డీవీవీ దానయ్య ఒక సినిమా చేయనున్నారని ఇండస్ట్రీ టాక్. అయితే, నిర్మాణ సంస్థ ఖండించింది. అసలు విషయం ఏంటి? ఏమైంది? అనే వివరాల్లోకి వెళితే...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో కొత్త సినిమా (Pawan Kalyan New Movie) కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? అంటే... 'అవును' అని ఇండస్ట్రీ అంటోంది. కానీ, నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ మాత్రం కాదని క్లారిటీ ఇచ్చింది. అసలు, 'సాహో' ఫేమ్ సుజిత్ (Sujeeth) దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ - డీవీవీ దానయ్య సినిమా ఉంటుందా? లేదా? అనే వివరాల్లోకి వెళితే...
రీమేక్ స్క్రిప్ట్ మీద వర్క్ చేసినా...
ఆ కథ చేయడం సుజిత్‌కు ఇష్టం లేదా?
తమిళంలో విజయ్, సమంత జంటగా నటించిన 'తెరి' సినిమాను తెలుగులో పవన్ కళ్యాణ్ రీమేక్ చేయాలని అనుకున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో స్క్రిప్ట్ పనులు మొదలయ్యాయి. దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ఆ సినిమా కోసం కొన్ని రోజులు ఖాళీగా ఉన్నారు. ఆ తర్వాత పవన్ రాజకీయాల్లో బిజీ కావడంతో ఆ సినిమా పక్కకు వెళ్ళింది. దాంతో పవన్ అనుమతి తీసుకుని రవితేజతో స్టార్ట్ చేసి ఒక ఫైట్ తీశారు. 'అమర్ అక్బర్ ఆంటోనీ' ఫ్లాప్ తర్వాత పక్కన పెట్టేశారు. కొన్నాళ్ళకు మళ్ళీ సుజిత్ దర్శకత్వంలో పవన్ హీరోగా డీవీవీ దానయ్య నిర్మాణంలో 'తెరి' రీమేక్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయి.
'సాహో' తర్వాత సొంత కథతో సుజిత్ సినిమా చేయాలనే ఆలోచనల్లో ఉన్నారు. ఆ సమయంలో పవన్ హీరోగా 'తెరి' ప్రపోజల్ వచ్చింది. అయిష్టంగానే స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేశారట. ఆ కథా చర్చల్లో భాగంగా పవన్ కళ్యాణ్‌కు తన దగ్గర ఉన్న మరో మూడు కథలు వినిపించారు.
పవన్ కోసం 'పంజా', 'బిల్లా' తరహాలో...
స్టయిలిష్ 'డాన్' స్టోరీ రెడీ చేసిన సుజిత్
Pawan Kalyan As Stylish Don? : 'సాహో' చూస్తే... సుజిత్ డైరెక్షన్ స్టయిల్ మీద ఒక అవగాహన వస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం అటువంటి స్టయిలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ స్టోరీలు రెడీ చేశారట. మొత్తం మూడు కథలు రెడీ చేయగా... అందులో రెండు మాఫియా బ్యాక్ డ్రాప్ స్టోరీలేనట. పవన్‌ను స్టయిలిష్ డాన్ రోల్‌లో చూపించాలని సుజిత్ ఉన్నారని తెలిసింది. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ చేసిన సినిమాల్లో 'పంజా' స్టయిలిష్‌గా ఉంటుంది. అది కూడా మాఫియా బ్యాక్ డ్రాప్ స్టోరీ. కానీ, అందులో పవన్ డాన్ కింద పని చేస్తారు. సుజిత్ కథలో మాత్రం ఆయనది డాన్ రోల్ అని తెలుస్తోంది.
Also Read : ఫ్లాప్‌లతో కట్టిన స్టార్‌డమ్ కోట - పవన్ కళ్యాణ్ క్రేజ్ వేరే లెవల్
'హరి హర వీరమల్లు' (Hari Hara Veera Mallu) చిత్రీకరణ ఈ నెలలో మళ్ళీ స్టార్ట్ కానుందని తెలుస్తోంది. కొన్ని రోజులు ఆ సినిమా చేశాక... వచ్చే నెలలో సుజిత్ సినిమా సెట్స్ మీదకు తీసుకు వెళ్లాలని భావిస్తున్నారట. డీవీవీ దానయ్య నిర్మాణ సంస్థతో పాటు త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య నిర్మాతగా ఏర్పాటు చేసిన ఫార్చ్యూన్ ఫర్ సినిమాస్ సంస్థ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉంటుందట. అదీ సంగతి!
Also Read : ఒకవేళ ఆ సినిమాలు పవన్ కళ్యాణ్ చేస్తే మహేశ్, రవితేజ, సూర్యకు స్టార్‌డమ్ వచ్చేదా?