Acharya: బాసూ... క్లాస్‌గా మెగాస్టార్ మాస్ స్టెప్పేస్తే? ఫుల్ సాంగ్ వచ్చేసింది... చూశారా?
క్లాస్‌గా మెగాస్టార్ చిరంజీవి మాస్ స్టెప్పేస్తే? శానా సూపర్ అనాల్సిందే! న్యూ ఇయర్ సందర్భంగా 'ఆచార్య'లో 'శానా కష్టం' సాంగ్ ప్రోమో విడుదల చేశారు. ఈ రోజు ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు. చూశారా?
మెగాస్టార్ చిరంజీవి, మెలోడీ బ్రహ్మ మణిశర్మ కాంబినేషన్‌లో మ్యూజికల్ హిట్స్ చాలా ఉన్నాయి. కొంత గ్యాప్ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ కుదిరేలా చేశారు దర్శకుడు కొరటాల శివ. వీళ్ల ముగ్గురి కలయికలో రూపొందిన సినిమా 'ఆచార్య'. ఆల్రెడీ ఈ సినిమా నుంచి విడుదలైన 'లాహే... లాహే', 'నీలాంబరి' సాంగ్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఇప్పటివరకు విడుదలైన సాంగ్స్ ఒక ఎత్తు... న్యూ ఇయర్ సందర్భంగా విడుదలైన 'శానా కష్టం వచ్చిందే మందాకినీ...' సాంగ్ మరో ఎత్తు. స్పెషల్ సాంగ్ ఇది.
'శానా కష్టం వచ్చిందే మందాకినీ... చూసేవాళ్ల కళ్లు కాకులు ఎత్తుకు పోనీ! శానా కష్టం వచ్చిందే మందాకినీ... నీ నడుం మడతలోనె జనం నలిగిపోనీ' అంటూ భాస్కర భట్ల రవికుమార్ (bhaskarabhatla ravi kumar) రాసిన ఈ పాటకు మణిశర్మ మాంచి బాణీ అందించారు. ఆల్రెడీ రిలీజైన ప్రోమోలో క్లాస్‌గా మెగాస్టార్ వేసిన మాస్ స్టెప్స్, రెజీనా (Regina Cassandra Special Song) అందాలు చూసి ఆడియన్స్ 'శానా సూపర్' అంటున్నారు. ఈ రోజు (జనవరి 3, సోమవారం) ఫుల్ సాంగ్ విడుదల చేశారు. రేవంత్, గీతా మాధురి ఆలపించిన ఈ సాంగ్ ఎలా ఉందో మీరూ వినండి.
Turn on your speakers and get dancing 🕺💃#SaanaKastam Full song out now 🔥🔥
— Konidela Pro Company (@KonidelaPro) January 3, 2022
▶️ https://t.co/q4ZSaDk8OX#Acharya#AcharyaOnFeb4th
Megastar @KChiruTweets #SivaKoratala @ReginaCassandra @singerrevanth @geethasinger @bhaskarabhatla @MatineeEnt @KonidelaPro @adityamusic pic.twitter.com/8s4W1S36p6
చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్, రామ్ చరణ్(Ram Charan)కు జోడీగా పూజా హెగ్డే (Pooja Hegde) నటించిన ఈ సినిమాలో సోనూ సూద్ కీలక పాత్ర చేశారు. 'లాహే... లాహే..' పాటలో సీనియర్ హీరోయిన్ సంగీత కనిపించిన సంగతి తెలిసిందే. ఇంకా పలువురు కీలక పాత్రల్లో నటించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 4న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: 'రాధే శ్యామ్' నిర్మాతలకు కొత్త తలనొప్పి... రోజుకు ఓసారి ఆ మాట చెప్పాల్సిందేనా?
Also Read: త్రివిక్రమ్ క్లాప్‌తో సినిమా మొదలు... బుధవారం నుంచి క్లాసులు!
Also Read: కృష్ణుడే సత్యభామ కాళ్లు పట్టుకున్నాడు... బాలకృషుడు ఓ లెక్కా!?
Also Read: లెఫ్ట్ హ్యాండ్ రెడీ.. వాళ్లు ఎదురుపడితే దబిడిదిబిడే.. వార్నింగ్ ఇచ్చిన బాలయ్య..
Also Read: The Boss: రామ్ గోపాల్ వర్మ బాబాగా మారితే?
Also Read: RGV: ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా ఆర్జీవీ.. అజయ్ భూపతిని ఆడేసుకుంటున్నారుగా..
Also Read: బాలకృష్ణ సినిమాలో కన్నడ నటుడికి పవర్ ఫుల్ రోల్...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి