By: ABP Desam | Updated at : 21 Apr 2023 03:35 PM (IST)
రుహాని శర్మ (Image Credits: Ruhani Sharma/Twitter)
Saindhav : టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ 75వ చిత్రం 'సైంధవ్'లో యువ నటి రుహాని శర్మ కీలక పాత్రలో నటిస్తుందని నిర్మాతలు ప్రకటించారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో డా. రేణుగా ఆమె నటిస్తున్నట్లు రుహాని ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో రుహాని మెడలో స్టెతస్కోప్ తో క్యాజువల్ డ్రెస్సులో డాక్టర్ పాత్రలో కనిపిస్తూ, గంభీరంగా చూస్తోంది. తాజాగా రివీల్ అయిన రుహానీ పాత్ర సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.
సుశాంత్ 'చిలసౌ' సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ రుహానీ శర్మ.. ఆ తర్వాత విశ్వక్ సేన్ సరసన 'హిట్' సినిమాలో నటించింది. ఆ మూవీ ఎంత భారీ హిట్ కొట్టిందో అందరికీ తెలిసిందే. 'డర్టీ హరి', 'నూటొక్క జిల్లాల అందగాడు' సినిమాలతో పాటు ఇటీవల ఓటీటీలో విడుదలైన 'మీట్ క్యూట్' యాంథాలజీలోనూ రుహానీ నటించి, మెప్పించారు. ఆ తర్వాత ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా 'హెర్' (HER)లోనూ ఆమె నటించారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో రుహానీ.. ఓ లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించారు. ఈ మూవీకి శ్రీధర్ స్వరగావ్ రచన, దర్శకత్వం వహించారు. ఆ తర్వాత హిట్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రూహాని శర్మకు శైలేష్ మరోసారి తన సినిమా 'సైంధవ్'లో ఛాన్స్ ఇచ్చాడు.
అంతకుముందు 'సైంధవ్' చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటిస్తున్నట్లు కొద్దిరోజుల క్రితమే మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్ లో వెంకటేష్ గన్ పట్టుకొని బాంబ్స్ పేల్చడానికి రెడీ గా ఉన్న 'సైంధవ్'లా కనిపించాడు. ఆ తరువాత రిలీజైన పోస్టర్ లో శ్రద్దా అలిసిపోయి కారులో కూర్చొని భోజనం చేస్తూ కనిపించింది. ఇక ఇప్పుడు రుహనీ ఇలా సీరియస్ లుక్ లో కనిపిస్తోంది. అసలు వీరందరితో శైలేష్ ఏం చేయబోతున్నాడు.. స్టోరీ ఏంటీ అన్నది ప్రస్తుతం మిస్టరీగా మారింది. అది తెలుసుకోవాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందేనని మేకర్స్ చెబుతున్నారు. హిట్ ఫ్రాంచైజీ తో హిట్లు అందుకున్న శైలేష్.. ప్రస్తుతం తెరకెక్కుతోన్న సైంధవ్ సినిమాతో హ్యాట్రిక్ హిట్ అందుకుంటాడా..? వెంకటేష్ కెరీర్లో సైంధవ్ ఓ మైలు రాయిగా నిలబెడుతుందా.. అన్న ప్రశ్నలు కీలకంగా మారనున్నాయి. దానికి తోడు 'హిట్' తర్వాత తన టాలెంట్ ను నిరూపించుకోబోతున్న రుహాని శర్మకు ఈ మూవీ టర్నింగ్ పాయింట్ గా కానుందా అన్న విషయంపై ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
"సైంధవ్' సినిమాను పూర్తి స్పై థ్రిల్లర్ మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తోండగా, ఈ సినిమాలో వెంకటేష్ పాత్ర అల్టిమేట్‌గా ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక సైంధవ్ తాజా షెడ్యూల్ ప్రస్తుతం వైజాగ్‌లో జరుగుతోంది. ఈ సినిమా కోసం ప్రధాన నటీనటులందరూ షూట్‌లో ఇప్పుడిప్పుడే పాల్గొంటున్నారు. ఈ చిత్రంలో మనోజ్ఞ పాత్రలో కన్నడ నటి శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తుండగా, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన హిందీ సినీ నటుడు నవాజుద్దీన్ సిద్ధిక్ విలన్‌గా నటిస్తున్నారు. సైంధవ్ చిత్రాన్ని వెంకట్ బోయనపల్లి తన సొంత బ్యానర్ నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మిస్తున్నారు. దసరా ఫేమ్ సంతోష్ నారాయణన్ సౌండ్‌ట్రాక్ కంపోజ్ చేస్తోన్న ఈ సినిమా డిసెంబర్ 22న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Read Also: చిరంజీవి, బాలయ్య రికార్డులను వెనక్కి నెట్టిన అఖిల్, ఆ విషయంలో అయ్యగారే నెంబర్ వన్!
Vijay Sethupathi: అందుకే కృతి శెట్టిని తిరస్కరించాడట - విజయ్ సేతుపతిలా మన హీరోలు చేయగలరా?
Vijay Antony: మూవీ ప్రమోషన్స్ మొదలుపెట్టిన విజయ్ ఆంటోనీ, నెటిజన్స్ నెగిటివ్ కామెంట్స్
Shiva Rajkumar: హీరో సిద్ధార్థ్‌కు క్షమాపణలు చెప్పిన కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్
Gundeninda Gudi Gantalu Serial : మదర్ సెంటిమెంట్‌తో 'స్టార్ మా' సరికొత్త సీరియల్ 'గుండె నిండా గుడిగంటలు'
Bigg Boss Telugu 7: సిగ్గు లేదా నీకు? ఇంట్లో నిన్ను ఇలాగే పెంచారా? ప్రశాంత్‌పై రతిక చెత్త కామెంట్స్
Chandrababu Naidu Arrest : చంద్రబాబు కేసుల్లో కక్ష సాధింపు లేదు - కోర్టే రిమాండ్ విధించింది - సజ్జల కీలక వ్యాఖ్యలు
Chandrayaan 3: రేపటి నుంచి చంద్రుడిపై రాత్రి సమయం, ఇక భారత్‌కు నిరాశేనా?
Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?
CM Jagan: ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ ప్రారంభించిన సీఎం - దీంతో ప్రయోజనాలు ఇవే
/body>