అన్వేషించండి

RRR Theme Song Update :'దోస్తులు' వచ్చేశారు.. మెగా, నందమూరి ఫ్యాన్స్ రచ్చ షురూ..ఈ సర్‌ప్రైజ్ మామూలుగా లేదు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులందరూ 'ఆర్ఆర్ఆర్' సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ సినిమాను రాజమౌళి డైరెక్ట్ చేస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులందరూ 'ఆర్ఆర్ఆర్' సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ సినిమాను రాజమౌళి డైరెక్ట్ చేస్తున్నారు. అక్టోబర్ 13న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు. ఇందులో భాగంగా దేశంలో పేరు గాంచిన ఐదుగురు టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్, సింగర్స్ తో ఓ పాటను రూపొందించారు.

'దోస్తీ' అంటూ సాగే ఈ పాటను స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం నాడు చిత్రబృందం విడుదల చేసింది. టాలీవుడ్ సింగ‌ర్ హేమ‌చంద్రతో పాటు అనిరుధ్ ర‌విచంద‌ర్‌, అమిత్ త్రివేది, యాసిన్ న‌జీర్, విజ‌య్ ఏసుదాస్ ఈ పాట‌లో భాగ‌మ‌య్యారు. స్నేహం విలువ చాటిచెప్పేలా ఈ పాటను రూపొందించారు. 

RRR Theme Song Update :'దోస్తులు' వచ్చేశారు.. మెగా, నందమూరి ఫ్యాన్స్ రచ్చ షురూ..ఈ సర్‌ప్రైజ్ మామూలుగా లేదు

ఇందులో రామ్ చ‌ర‌ణ్ అగ్గికి ప్ర‌తిబింబంలాంటి పాత్ర‌ను పోషిస్తుండ‌గా.. నీటిని ప్ర‌తిరూపం లాంటి పాత్ర‌లో జూనియ‌ర్ ఎన్టీఆర్ క‌నిపించ‌నున్నాడు. ప‌ర‌స్ప‌ర విరుద్ధ‌మైన ఈ పాత్ర‌లు ఒక్క‌టైతే.. వ‌చ్చే పాజిటివ్ ఎన‌ర్జీ ఎలా ఉంటుందో ఈ పాటలో చూపించారు. సినిమా క‌థ‌ను ప్ర‌తిబింబించేలా లెజెండ‌రీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి అద్భుతంగా ఈ పాట‌ను రాశారు. సినిమా ఎసెన్స్ అంతా ఈ పాట‌లోనే కనిపిస్తుంది. 

ఈ వీడియో చూసిన తరువాత రాజమౌళి మేకింగ్, కీరవాణి సంగీతం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. సినిమాలో హీరోల పాత్రలను ఈ ఒక్క పాటలోనే వివరించేశారు. ఈ పాట చిత్రీకరణ చూస్తుంటే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఐదు నిమిషాల నిడివితో సాగిన ఈ పాటను విన్నాక గూస్ బంప్స్ రావడం ఖాయం. ఇక పాట చివర్లో రామ్ చరణ్-ఎన్టీఆర్ లు ఇద్దరూ నడుచుకుంటూ రావడం మరో హైలైట్. 

RRR Theme Song Update :'దోస్తులు' వచ్చేశారు.. మెగా, నందమూరి ఫ్యాన్స్ రచ్చ షురూ..ఈ సర్‌ప్రైజ్ మామూలుగా లేదు

థీమ్ సాంగే ఈ రేంజ్ లో ఉంటే ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. సినిమాలో ఈ పాట మేకింగ్ కూడా ఓ రేంజ్ లో ఉంటుందట. తెలుగులో ఈ పాటను హేమచంద్ర పాడగా.. హిందీలో అమిత్ త్రివేది.. తమిళంలో అనిరుద్.. కన్నడలో యాజిన్ నైజర్.. మలయాళంలో విజయ్ ఏసుదాస్ ఆలపించనున్నారు. తన గొంతుతో పాటకు ప్రాణం పోశాడు హేమచంద్ర. ఈ ఒక్క పాటతోనే సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకోవడం ఖాయం. 
ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కు జంటగా అలియా భట్.. ఎన్టీఆర్ కి జోడీగా ఒలీవియా మోరీస్‌ కనిపించనున్నారు. వీరితో పాటు రేయ్‌ స్టీవ్‌సన్‌, ఆలిసన్‌ డ్యూడీ, శ్రియ, అజయ్‌ దేవ్‌గణ్‌, సముద్రఖనిలు కీలకపాత్రలు పోషించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan babu Hospital : బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
Mohanbabu Gun:  గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
Sana Sathish: చానా చరిత్ర ఉండాది సామీ... ! టీడీపీ రాజ్యసభ క్యాండిడేట్ మామూలోడు కాదు..
చానా చరిత్ర ఉండాది సామీ... ! టీడీపీ రాజ్యసభ క్యాండిడేట్ మామూలోడు కాదు..
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ముంబయిలో బస్ బీభత్సం, ఏడుగురు మృతితండ్రి ఆరోపణలపై మంచు మనోజ్ ఫైర్Manchu Manoj vs Mohan babu | కరిగిన మంచు...ముదిరిన వివాదం | ABP DesamPushpa Day 4 Collections | రోజు రోజుకూ కలెక్షన్లు పెంచుకుంటున్న పుష్ప 2 | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan babu Hospital : బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
Mohanbabu Gun:  గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
Sana Sathish: చానా చరిత్ర ఉండాది సామీ... ! టీడీపీ రాజ్యసభ క్యాండిడేట్ మామూలోడు కాదు..
చానా చరిత్ర ఉండాది సామీ... ! టీడీపీ రాజ్యసభ క్యాండిడేట్ మామూలోడు కాదు..
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
RCB News: డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
Gautham Krishna - Bigg Boss Telugu: సోలో బాయ్ గౌతమే విన్నర్ అంటోన్న సోషల్ మీడియా - అతనిలో ప్లస్, మైనస్‌లు ఏంటి?
సోలో బాయ్ గౌతమే విన్నర్ అంటోన్న సోషల్ మీడియా - అతనిలో ప్లస్, మైనస్‌లు ఏంటి?
Pushpa 2: ఇండియా అంతటా పూనకాలే... కానీ కేరళలో మాత్రం ఎందుకిలా? 'పుష్ప 2' విషయంలో మల్లు అభిమానం ఏమైంది?
ఇండియా అంతటా పూనకాలే... కానీ కేరళలో మాత్రం ఎందుకిలా? 'పుష్ప 2' విషయంలో మల్లు అభిమానం ఏమైంది?
Manoj: మోహన్‌బాబు ఇంటి గేటు తోసేసుకుని లోపలికి వెళ్లిన మంచు మనోజ్ దంపతులు - తీవ్ర ఉద్రిక్తత
మోహన్‌బాబు ఇంటి గేటు తోసేసుకుని లోపలికి వెళ్లిన మంచు మనోజ్ దంపతులు - తీవ్ర ఉద్రిక్తత
Embed widget