Regina Cassandra: 2019లో కులు మనాలి రూమ్‌లో ఒకటి జరిగింది, అతడిని మిస్సవుతున్నా - ఆలీతో రెజీనా
నటి రెజీనా.. అలీ నిర్వహించే 'అలీతో సరదాగా' షోకి గెస్ట్ గా వచ్చింది.
కోలీవుడ్ కి చెందిన రెజీనా కసాండ్రా టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 'పిల్లా నువ్వు లేని జీవితం', 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' వంటి హిట్ సినిమాల్లో నటించింది. తెలుగులో ఆమె చివరిగా 'ఆచార్య' సినిమాలో ఐటెం సాంగ్ లో కనిపించింది. ఈ సినిమా పెద్దగా ఆడనప్పటికీ రెజీనా ఐటెం సాంగ్ బాగానే వర్కవుట్ అయింది. రీసెంట్ గా ఈ బ్యూటీ నటించిన 'అన్యాస్ ట్యుటోరియల్' అనే వెబ్ సిరీస్ లో ఆహాలో విడుదలైంది.
ఈ హారర్ సిరీస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ అలీ నిర్వహించే 'అలీతో సరదాగా' షోకి గెస్ట్ గా వచ్చింది. ఈ సందర్భంగా వీరిద్దరూ ఎన్నో ఆసక్తికర విషయాలను చర్చించుకున్నారు. రెజీనా షోలోకి రాగానే 'వెల్కమ్ పాప' అని అన్నారు అలీ. దానికి 'పాప ఉందో లేదో తెలియదిప్పుడు' అని నవ్వుతూ చెప్పింది రెజీనా. స్కూల్ లో క్లాస్ లీడర్ గా ఉన్నప్పుడు అబ్బాయిలను కొట్టానని చెప్పింది రెజీనా.
'బాక్స్ నిండా ఫారెన్ నుంచి చాకోలెట్ బాక్స్ వచ్చిందంట కదా అతడిని కూడా కొట్టావా..?' అని అలీ అడగ్గా.. లేదని చెప్పింది. 'మరి అదేం స్టోరీ అనగా' సమాధానం చెప్పకుండా తప్పించుకుంది రెజీనా. చాలా మంది తనను చూసి డామినేటింగ్ అని చెబుతుంటారని.. బహుశా తన ఫిజిక్ చూసి అలా చెప్తున్నారేమో అని అంది రెజీనా. 'ఆచార్య'లో చిరుతో వర్క్ ఎక్స్ పీరియన్స్ గురించి మాట్లాడింది.
అలానే తనకు పాత్రలు నచ్చితే ఏమైనా చేస్తానని.. 'అ!' సినిమాలో రోల్ కోసం జుట్టు కత్తిరించుకున్నానని చెప్పింది. ఆ తరువాత అలీ '2019 కులుమనాలి.. రూమ్ నెంబర్ నాకు తెలియదు.. ఒకటి జరిగింది' అని రెజీనా ప్రశ్నించగా.. 'నా లైఫ్ లో ఇలాంటివి ఇంకా జరగాలని కోరుకుంటున్నా' అని చెప్పింది. ఏం జరిగిందనేది మాత్రం పూర్తి షో చూశాకే తెలుస్తుంది. ఇప్పటివరకు వర్క్ చేసిన దర్శకుల్లో టాప్ 3 చెప్పమని అలీ అడగ్గా.. ఒకరి పేరు చెప్పి ఇంకొకరి పేరు చెప్పకపోతే అంతే అని బదులిచ్చింది రెజీనా. దానికి అలీ నేను చెప్పనా అని.. ఒకరి పేరు చెప్పగా 'ఆయనొక టాస్క్ మాస్టర్.. నేను మిస్ అవుతున్నా' అని చెప్పింది రెజీనా.
Also Read : సీరియస్‌గా తీసుకోవద్దు శోభు - 'ఆర్ఆర్ఆర్' గే లవ్ స్టోరీ కామెంట్స్‌కు ఇక ఫుల్ స్టాప్ పడుతుందా?
Also Read : గన్స్ అండ్ యాక్షన్ - కళ్యాణ్ రామ్ కొత్త ఫిల్మ్
View this post on Instagram