Pawan Kalyan: 'భీమ్లానాయక్'.. ఆ భయంతోనే వాయిదా వేయించారా..?
'భీమ్లానాయక్' సినిమా వాయిదా పడడానికి మెయిన్ రీజన్ 'ఆర్ఆర్ఆర్' అనే చెప్పాలి.
పవన్ కళ్యాణ్ నటిస్తోన్న 'భీమ్లానాయక్' సినిమాను ముందుగా సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. రెండు నెలల క్రితమే రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. అయితే అదే సమయానికి 'ఆర్ఆర్ఆర్' సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించడంతో 'భీమ్లానాయక్' వెనక్కి తగ్గుతుందని అనుకున్నారు. కానీ చెప్పిన టైంకే సినిమాను రిలీజ్ చేస్తామని నిర్మాత ఎప్పటికప్పుడు చెబుతూ వచ్చారు. కానీ ఫైనల్ గా సినిమాను వాయిదా వేశారు. ఫిబ్రవరి 25న రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు.
ఈ సినిమా వాయిదా పడడానికి మెయిన్ రీజన్ 'ఆర్ఆర్ఆర్' అనే చెప్పాలి. అనుకోకుండా రేసులోకి వచ్చిన ఈ సినిమా కారణంగా చాలా సినిమాలు వాయిదా పడుతున్నాయి. ముందుగా 'సర్కారు వారి పాట'ను వాయిదా వేశారు. ఇప్పుడు 'భీమ్లానాయక్' కూడా వెనక్కి తగ్గింది. పవన్ కళ్యాణ్ సినిమా అంటే అభిమానుల్లో ఉండే క్రేజే వేరు. పైగా 'భీమ్లానాయక్' సినిమాకి మంచి హైప్ క్రియేట్ అయింది. ఇలాంటి సినిమాకు ఎక్కువ థియేటర్లు కావాల్సి ఉంటుంది.
కాబట్టి 'భీమ్లానాయక్' సినిమా సంక్రాంతికి విడుదలైన మెజారిటీ థియేటర్లలో 'ఆర్ఆర్ఆర్' సినిమాను నడిపించడం కష్టమవుతుంది. కనీసం వారం రోజులు తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న అన్ని థియేటర్లలో 'ఆర్ఆర్ఆర్'ను నడిపిస్తేనే వాటి బయ్యర్లకు అనుకున్న స్థాయిలో లాభాలు వస్తాయనే అంచనా ఉంది. అందుకే 'భీమ్లానాయక్' సినిమాను వాయిదా వేయడానికి ఇంతగా ఒత్తిడి తీసుకొచ్చారు.
దీంతో పాటు మేకర్స్ లో మరో భయం కూడా ఉందని తెలుస్తోంది. అదేంటంటే.. పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఏపీ ప్రభుత్వం కచ్చితంగా దాన్ని టార్గెట్ చేస్తుంది. అప్పుడు బెనిఫిట్ షోలు, అదనపు షోలు, టికెట్ రేట్ల విషయంలో మరీ పట్టుదలతో వ్యవహరిస్తోంది. రీసెంట్ గా విడుదలైన 'అఖండ' సినిమా విషయంలో బెనిఫిట్, అదనపు షోల సంగతి చూసి చూడనట్లుగా వదిలేశారు. కానీ 'పుష్ప' సినిమా విషయంలో మాత్రం అదనపు షోలకు పర్మిషన్స్ ఇవ్వలేదు. 'భీమ్లానాయక్' సినిమా విషయంలో కూడా ఇలా జరిగే ఛాన్స్ ఉంది.
ఒకవేళ పవన్ సినిమా గనుక సంక్రాంతి రేసులో ఉంటే.. వారం గ్యాప్ లో విడుదలయ్యే మూడు సినిమాల్లో ఒక్కో సినిమా విషయంలో ఒక్కోలా వ్యవహరించడానికి ఛాన్స్ ఉండదు. అదనపు షోలు, టికెట్ రేట్ల విషయంలో ఏదైనా వెసులుబాటు ఉంటే అన్నింటికీ ఇవ్వాల్సి ఉంటుంది. పవన్ సినిమా బరిలో ఉంటే దాని విషయంలో జగన్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు 'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్' సినిమాలకు కూడా ఇబ్బంది తప్పదు. అందుకే చాలా కష్టపడి పవన్ ను ఒప్పించి మరీ సంక్రాంతి రేసు నుంచి తప్పించారు. ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్' నిర్మాతలు బెనిఫిట్ షోల కోసం ప్రయత్నిస్తే పర్మిషన్స్ దొరికే ఛాన్స్ ఉంటుంది.
Also Read:బన్నీ సినిమా రీమేక్.. హీరోకి వార్నింగ్ ఇచ్చిన నటి..
Also Read: స్టార్ హీరోలు.. ఈ ఏడాది ఒక్క రిలీజ్ కూడా లేదే..
Also Read:కప్పు గెలుస్తాననే అనుకున్నా.. కానీ సిరితో సీన్ జరగడంతో.. షణ్ముఖ్ వ్యాఖ్యలు..
Also Read: పవన్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. సంక్రాంతి రేసు నుంచి 'భీమ్లానాయక్' ఔట్..
Also Read: సెక్సీగా కనిపించడం కోసం ఎంత కష్టపడ్డానో.. 'పుష్ప' ఐటెం సాంగ్ పై సామ్ రియాక్షన్..
Also Read: ప్రభాస్ ఫ్యాన్స్‌కు సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చిన రాధే శ్యామ్ టీమ్... రెబల్ స్టార్ లుక్ రిలీజ్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి