Shanmukh: కప్పు గెలుస్తాననే అనుకున్నా.. కానీ సిరితో సీన్ జరగడంతో.. షణ్ముఖ్ వ్యాఖ్యలు..
షణ్ముఖ్ విన్నర్ అవుతాడని అందరూ అనుకున్నారు కానీ అతడు చేసిన కొన్ని పనుల కారణంగా నెగెటివిటీ పెరిగింది.
బిగ్ బాస్ సీజన్ 5 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న షణ్ముఖ్ తన గేమ్ ప్లేతో అందరినీ ఆకట్టుకున్నాడు. అందరి ఆలోచనలను ముందే ఊహిస్తూ.. బ్రహ్మ అని పేరు తెచ్చుకున్నాడు. ఒకానొక దశలో షణ్ముఖ్ విన్నర్ అవుతాడని అందరూ అనుకున్నారు కానీ అతడు చేసిన కొన్ని పనుల కారణంగా నెగెటివిటీ పెరిగింది. దీంతో రన్నరప్ గా నిలిచాడు. ఈ సందర్భంగా షణ్ముఖ్ కొన్ని విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.
కప్పు గెలుస్తాననే అనుకున్నా...: రన్నరప్ గానే నిలుస్తానని ముందే ఊహించాను. నా నెగెటివ్స్ ఏంటో నాకు అర్ధమైంది. బయట ఏం జరుగుతుందో ఊహించగలిగా.. నేను ఏంటో అలానే ఉన్నాను. 'ఐయామ్ హ్యాపీ విత్ వాట్ ఐయామ్'. 105 రోజులు హౌస్ లో ఉన్నందుకు సంతోషంగా ఉంది. పదకొండో వారం వరకు కప్పు గెలుస్తాననే అనుకున్నాను. కానీ అప్పుడే సిరితో పెద్ద సీన్ జరిగింది. ఆ తరువాత బాగా లో అయిపోయాను.
సిరి మైనస్ అవుతుందని తెలుసు కానీ.. : హౌస్ లో 105 రోజులు కలిసి ఒక మనిషితో ఉన్నప్పుడు కచ్చితంగా కనెక్షన్స్ వస్తుంది. కానీ అది బయట ఉండే ఆడియన్స్ కు తెలియదు. బహుశా.. వాళ్లకు నేను ఒక ఫ్రెండ్ కి ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడం నచ్చలేదేమో. నాకు మధ్యలో సిరితో స్నేహం మైనస్ అవుతుందని అనిపించింది కానీ నేను ఫేక్ చేయలేను. మనుషులను దూరం పెట్టి నటించలేను.
రాంగ్ ఎలిమినేషన్..: రవి ఎలిమినేషన్ అసలు నాకు నచ్చలేదు. అదొక రాంగ్ ఎలిమినేషన్. హౌస్ లో ఉన్నవాళ్లలో అతడు బాగా గేమ్ ఆడాడు. అలాంటిది అతడికి ఓట్లు కూడా తక్కువ పడ్డాయనేది షాకింగ్ గా అనిపించింది. రవి ఆ స్టేజ్ లో ఉండడం కూడా నాకు అవమానంగా అనిపించింది. రవి వెళ్లిపోయాక చాలా లోన్లీగా ఫీల్ అయ్యేవాడ్ని. నేను ఒక్కడినే ఉంటే రవి వచ్చి మాట్లాడేవాడు. కానీ ఆ తరువాత అతడు లేకపోవడం బాధగా అనిపించింది.
నేను చీట్ చేయను..: దీప్తి సునైనా హౌస్ లోకి వచ్చినప్పుడు రెండు వేళ్లు చూపిస్తూ.. షణ్ముఖ్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడని హింట్ ఇచ్చిందని సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. దీనిపై స్పందించిన షణ్ముఖ్.. దీప్తి ఎప్పటికీ అలా చేయదని అన్నాడు. ఒకవేళ దీప్తి అలా చెప్పి ఉంటే సిరిని ఫ్రెండ్ గా కట్ చేసేవాడ్ని కదా.. నాకు చీట్ చేయడం రాదు.
ఫ్రెండ్షిప్ హగ్..: సిరి నాకు బెస్ట్ ఫ్రెండ్. ఇప్పుడు ఎవరో ఏదో అంటున్నారని.. తనతో స్నేహాన్ని వదులుకోను. అలా అని దీప్తితో నా రిలేషన్ చెడగొట్టుకోను. సిరి వాళ్ల మదర్ వచ్చి హగ్స్ గురించి మాట్లాడినప్పుడు బాధపడ్డాను. అందుకే తరువాత సిరిని హగ్ చేసుకున్నప్పుడు ఫ్రెండ్షిప్ హగ్ అని చెప్పేవాడ్ని. వాళ్ల మదర్ కి నచ్చనప్పుడు ఎవరికీ నచ్చదు.
సిరి ఫేక్ ఎలిమినేషన్..: సిరిని ఫేక్ ఎలిమినేట్ చేసిన రోజు ఆమెతో గొడవైంది. గొడవైన రోజు ఆమె వెళ్లిపోవడంతో నేను చాలా ఫీల్ అయ్యాను. నేను ఎవరితో ఓపెన్ ఉండను. తనతో ఉండేవాడిని కాబట్టి బాధ పడ్డాను. నేను ఆమె గురించి ఎక్కువ ఆలోచించాను. నా ఆలోచనకు తను బలైంది.
Also Read: పవన్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. సంక్రాంతి రేసు నుంచి 'భీమ్లానాయక్' ఔట్..
Also Read: సెక్సీగా కనిపించడం కోసం ఎంత కష్టపడ్డానో.. 'పుష్ప' ఐటెం సాంగ్ పై సామ్ రియాక్షన్..
Also Read: ప్రభాస్ ఫ్యాన్స్‌కు సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చిన రాధే శ్యామ్ టీమ్... రెబల్ స్టార్ లుక్ రిలీజ్!
Also Read: అప్పుడు అనుష్కతో... ఇప్పుడు సమంతతో
Also Read: పవన్ కల్యాణ్‌తో క్రిష్ మీటింగ్... 'హరి హర వీరమల్లు' గురించి కొత్త అప్‌డేట్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి