Tabu: బన్నీ సినిమా రీమేక్.. హీరోకి వార్నింగ్ ఇచ్చిన నటి..
'అల వైకుంఠపురములో' సినిమాలో టబు కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. హీరో మదర్ గా కనిపించిందామె.

ఈ మధ్యకాలంలో సౌత్ లో హిట్ అయిన చాలా సినిమాలను హిందీలో రీమేక్ చేస్తున్నారు. తెలుగులో అల్లు అర్జున్ నటించిన 'అల.. వైకుంఠపురములో' సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు అల్లు అరవింద్. ఆయనతో పాటు భూషణ్ కుమార్, అమన్ గిల్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు రోహిత్ ధావన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో కార్తిక్ ఆర్యన్, కృతిశెట్టిలను హీరో, హీరోయిన్లుగా తీసుకున్నారు. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన 'లూకా చుప్పి' సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఇప్పుడు మరోసారి ఈ కాంబో రిపీట్ కాబోతుంది.
బాలీవుడ్ లో ఈ రీమేక్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్లుగానే సినిమాను ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా షూటింగ్ లొకేషన్ లో హీరో కార్తిక్ ఆర్యన్.. దర్శకుడు రోహిత్ తో కలిసి ఓ సెల్ఫీ తీసుకున్నాడు. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అది చూసిన సీనియర్ నటి టబు.. కార్తిక్ కి స్వీట్ వార్నింగ్ ఇచ్చింది.
'అది నా సినిమా రీమేక్.. జాగ్రత్తగా చేయండి' అని కామెంట్ పెట్టింది. ఈ కామెంట్ చూసిన కార్తిక్ ఆర్యన్ 'మీ సినిమా కాబట్టే ఇంకా ప్రేమతో చేస్తున్నాం మేడం' అంటూ బదులిచ్చాడు. 'అల వైకుంఠపురములో' సినిమాలో టబు కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. హీరో మదర్ గా కనిపించిందామె. కానీ హిందీ వెర్షన్ కి మాత్రం ఆమెని తీసుకున్నట్లు లేరు. ఈ సినిమాకి 'షెహ్ జాదా' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.
View this post on Instagram
Also Read: స్టార్ హీరోలు.. ఈ ఏడాది ఒక్క రిలీజ్ కూడా లేదే..
Also Read:కప్పు గెలుస్తాననే అనుకున్నా.. కానీ సిరితో సీన్ జరగడంతో.. షణ్ముఖ్ వ్యాఖ్యలు..
Also Read: పవన్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. సంక్రాంతి రేసు నుంచి 'భీమ్లానాయక్' ఔట్..
Also Read: సెక్సీగా కనిపించడం కోసం ఎంత కష్టపడ్డానో.. 'పుష్ప' ఐటెం సాంగ్ పై సామ్ రియాక్షన్..
Also Read: ప్రభాస్ ఫ్యాన్స్‌కు సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చిన రాధే శ్యామ్ టీమ్... రెబల్ స్టార్ లుక్ రిలీజ్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Before You Go
Serial Actor Charishma Shreekhar Profile | అమ్మోరు' సీరియల్ నటి సక్సెస్ స్టోరీ ఇదే
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















