Rashmika Philosophy : అన్నిటికీ అదే మంచి మందు - నేషనల్ క్రష్ రష్మిక ఫిలాసఫీ
రష్మిక మాటల్లో ఈ మధ్య ఫిలాసఫీ ఎక్కువ వినబడుతోంది. ఇటీవల ట్రోల్స్ గురించి స్పందించిన ఆమె... ఇప్పుడు మెడికేషన్ గురించి చెబుతున్నారు.
రష్మిక మందన్నా (Rashmika Mandanna) హుషారైన అమ్మాయి. ఎప్పుడూ ఆమె ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంటుంది. చలాకీగా ఉంటారు, అందరితో సరదాగా మాట్లాడుతుంటారు. స్టార్ హీరోయిన్ అయినప్పటికీ... ఆమె కూడా మనిషే కదా! ట్రోల్స్ తనను ఏ విధంగా బాధిస్తున్నాయి? ఎంత వరస్ట్‌గా చేస్తున్నారు? వంటి విషయాలను ఈ మధ్య వెల్లడించారు. తాజాగా ఆమె మెడికేషన్ గురించి మాట్లాడారు.
వర్కవుట్... వర్కవుట్... వర్కవుట్!
రష్మిక ఫిట్‌నెస్ విషయంలో చాలా పర్టిక్యులర్‌గా ఉంటారు. రెగ్యులర్‌గా జిమ్‌లో వర్కవుట్స్ చేస్తుంటారు. ఆ ఫోటోలు, వీడియోలు అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో షేర్ కూడా చేస్తుంటారు. అయితే... లేటెస్టుగా ఆవిడ వర్కవుట్ ఇంపార్టెన్స్ గురించి చెప్పారు.
మెజారిటీ విషయాలకు ఎక్స్‌ర్‌సైజ్ చేయడమే అత్యుత్తమ ఔషధం (మంచి మందు) అని రష్మిక పేర్కొన్నారు. ''బాధలో ఉన్నప్పుడు, కోపంగా ఉన్నప్పుడు... సంతోషంలోనూ, దుఃఖంలోనూ... ప్రశాంతతలోనూ, ప్రపంచంలో ఉన్నత శిఖరాలను అధిరోహించినప్పుడు... ఎలా ఉన్నా వర్కవుట్ చేయండి. వర్కవుట్ చేసిన తర్వాత ఎంత హాయిగా ఉంటుందో కదా! ఒకవేళ ఎవరైనా వర్కవుట్ చేయకపోతే ట్రై చేయండి'' అని రష్మిక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు. ఈ మధ్య రష్మిక మాటల్లో ఫిలాసఫీ ఎక్కువ వినబడుతోంది కదూ!
సినిమాలకు వస్తే... విజయ్ జోడీగా ఆవిడ నటించిన 'వారసుడు' సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల అందులో 'రంజిదమే' సాంగ్ విడుదల అయ్యింది. తెలుగులో అల్లు అర్జున్ సరసన 'పుష్ప 2', హిందీలో రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించే 'యానిమల్'లో కూడా ఆవిడ నటించనున్నారు. ఈ ఏడాది 'గుడ్ బై'తో హిందీ ఇండస్ట్రీకి పరిచయమైన రష్మిక... సిద్దార్థ్ మల్హోత్రాకు జోడీగా 'మిషన్ మజ్ను'లో కనిపించనున్నారు.
Also Read : 'యశోద' రివ్యూ : అసలు కథ వేరే బాస్ - సమంత షీరోయిజం ఎలా ఉందంటే?
వదిలేస్తే వరస్ట్‌గా చేస్తున్నారేంటి?
ట్రోలర్స్‌కు రష్మిక స్ట్రాంగ్ కౌంటర్!
తన తప్పు ఏమీ లేనప్పటికీ... తనను టార్గెట్ చేస్తూ వస్తున్న ట్రోల్స్, మీమ్స్‌పై ఇటీవల రష్మిక (Rashmika Mandanna) ఘాటుగా స్పందించారు. ఆ ట్రోల్స్ వగైరా వగైరా నిరుత్సాహ పరిచే విధంగా ఉన్నాయని, గుండె బద్దలు అయ్యేలా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారని ఆవిడ ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడో వాటి గురించి మాట్లాడాల్సిందని ఆమె అన్నారు.
కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి తనపై కొందరు విషం చిమ్ముతున్నారని, తనను ద్వేషిస్తున్నారని రష్మిక ఆవేదన వ్యక్తం చేశారు. ట్రోల్స్ చేసేవాళ్ళు, నెగిటివిటీ స్ప్రెడ్ చేసే వాళ్ళకు తానొక పంచింగ్ బ్యాగ్ కింద మారినట్టు ఆవిడ చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరూ తనను ఇష్టపడాలని తాను ఆశించడం లేదని, నటిగా ఉన్నప్పుడు కొన్ని కొన్ని విమర్శలు వస్తాయనేది తనకు తెలుసని, దాని అర్థం ద్వేషించమని కాదని రష్మిక స్పష్టం చేశారు.
''ముఖ్యంగా నేను చెప్పని విషయాలకు ఇంటర్నెట్, సోషల్ మీడియాలో నన్ను ఎగతాళి చేస్తున్నారు. టార్గెట్ చేస్తూ పోస్టులు చేస్తున్నారు. వాటిని చూసినప్పుడు గుండె బద్దలవుతోంది. నిరుత్సాహానికి గురవుతాం. కొన్ని ఇంటర్వ్యూలలో నేను చెప్పిన విషయాలు నాకు వ్యతిరేకంగా మారాయి. చిత్రసీమలో, సినిమా ఇండస్ట్రీ బయట నా రిలేషన్షిప్స్‌కు హాని కలిగించే విధంగా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు'' అని రష్మిక పేర్కొన్నారు. తనను మెరుగు పరుచుకునేలా వచ్చే సహేతుకమైన విమర్శలను తాను స్వాగతిస్తానని ఆవిడ తెలిపారు. చాలా రోజులుగా తాను విమర్శలను విస్మరిస్తూ వస్తున్నానని... అయితే రోజు రోజుకూ వాళ్ళ ప్రవర్తన వరస్ట్ అవుతోందని రష్మిక వివరించారు.