By: ABP Desam | Updated at : 12 Sep 2022 04:55 PM (IST)
'రంగమార్తాండ' - దీపావళికైనా వస్తుందా?
ప్రముఖ దర్శకుడు కృష్మవంశీ 'రంగమార్తాండ' అనే సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. మరాఠీలో విడుదలైన 'నట సామ్రాట్' సినిమాకి ఇది రీమేక్. సాధారణంగా అయితే దర్శకుడు కృష్ణవంశీ రీమేక్ సినిమాపై పెద్దగా ఆసక్తి చూపరు. సొంత కథలతోనే సినిమాలను రూపొందిస్తారు. కానీ 'నట సామ్రాట్' సినిమాను చూసిన ఆయన రీమేక్ చేయాలని ఫిక్సయిపోయారు. అంతగా అతడిని కదిలించిన సినిమా అది.
చాలా కాలంగా ఫ్లాప్ లతో డీలా పడ్డ వంశీ ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నారు. 'నట సామ్రాట్' సినిమాలో నానా పటేకర్ ప్రధాన పాత్ర పోషించారు. ఆయన పాత్రను తెలుగులో ప్రకాష్ రాజ్ పోషిస్తున్నారు. అలానే సినిమాలో మరో ముఖ్య పాత్ర ఒకటి ఉంటుంది. నానా పటేకర్ స్నేహితుడిగా మరాఠీలో విక్రమ్ గోఖలే నటించారు. సీరియస్ గా ఎమోషనల్ గా సాగే ఆ పాత్ర కోసం బ్రహ్మానందాన్ని ఎంపిక చేశారు.
ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. నిజానికి ఈపాటికే సినిమా రిలీజ్ కావాల్సింది కానీ ఆలస్యం జరుగుతోంది. ఆగస్టులో సినిమా కచ్చితంగా రిలీజ్ అవుతుందన్నారు. కానీ అలా జరగలేదు. ఇప్పుడు దీపావళికి టార్గెట్ చేసినట్లు సమాచారం. ఎట్టిపరిస్థితుల్లో దీపావళికి సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ షురూ చేయనున్నారు. ముందుగా సినిమాలో సాంగ్స్ ను ఒక్కొక్కటిగా రిలీజ్ చేయనున్నారు.
ఈ సినిమాకి ఓటీటీ నుంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. కానీ థియేటర్లోనే విడుదల చేయాలని భావిస్తున్నారు దర్శకుడు కృష్ణవంశీ. ఇక ఈ సినిమాకి ఇళయరాజా సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ సినిమాకి సంబంధించిన ఇప్పటివరకు ఒక్క పోస్టర్ కానీ, టీజర్ కానీ రిలీజ్ కాలేదు. అయినప్పటికీ ఈ రేంజ్ బజ్ రావడమంటే విశేషమనే చెప్పాలి.
కృష్ణవంశీ ఓటీటీ ప్రాజెక్ట్:
పాండమిక్ సమయంలో జనాలు ఓటీటీకి బాగా అలవాటు పడ్డారు. ఇప్పుడు చాలా మంది థియేటర్లకు వెళ్లి సినిమా చూడడానికి కూడా పెద్దగా ఇష్టపడడం లేదు. ఓటీటీలోనే చూసుకుంటున్నారు. ఇక వెబ్ సిరీస్ లైతే వందల సంఖ్యలో రిలీజ్ అవుతున్నాయి. ఒరిజినల్ కంటెంట్ కోసం బాగా ఖర్చు చేస్తున్నాయి ఓటీటీ సంస్థలు. తెలుగులో కూడా పదుల సంఖ్యలో వెబ్ సిరీస్ లు వస్తున్నాయి. వీటికోసం కోట్లలో ఖర్చు చేస్తున్నారు. పేరున్న దర్శకులు చాలా మంది ఓటీటీ ప్రాజెక్ట్స్ చేపడుతున్నారు.
ఇప్పుడు కృష్ణవంశీ వంతు వచ్చింది. త్వరలోనే ఆయన ఓటీటీ ప్రాజెక్ట్ చేయబోతున్నారట. ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అక్షరాల రూ.300 కోట్ల వరకు ఉంటుంది. ఇదొక బ్లాస్ట్ లాంటి ప్రాజెక్ట్ అని.. త్వరలోనే వివరాలు చెబుతానని అన్నారట. కృష్ణవంశీ లాంటి డైరెక్టర్ ని నమ్మి మూడొందల కోట్ల బడ్జెట్ పెట్టడమంటే మాములు విషయం కాదు. కాకపోతే ఓటీటీలతో ఏదైనా సాధ్యమనే చెప్పాలి. అక్కడ బడ్జెట్ లిమిటేషన్స్ ఉండవు. ప్రాజెక్ట్ పై నమ్మకం ఉంటే ఎంతైనా పెట్టొచ్చు. నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థలకు మూడొందల కోట్లు పెద్ద మేటర్ కూడా కాదు.
Shastipoorthi Movie : మళ్ళీ 'లేడీస్ టైలర్' జోడీ - 37 ఏళ్ళ తర్వాత 'షష్టిపూర్తి'తో!
NTR30 Shoot Begins : అదిగో భయం - కొరటాల సెట్స్కు ఎన్టీఆర్ వచ్చేశాడు
Sreeleela Role In NBK 108 : బాలకృష్ణకు శ్రీలీల కూతురు కాదు - అసలు నిజం ఏమిటంటే?
Tollywood: మహేశ్ తర్వాత నానినే - మిగతా స్టార్స్ అంతా నేచురల్ స్టార్ వెనుకే!
Taraka Ratna Wife Alekhya : కోయంబత్తూరు వెళ్లిన తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి
Data Theft Case : వినయ్ భరద్వాజ ల్యాప్ టాప్ లో 66.9 కోట్ల మంది డేటా- 24 రాష్ట్రాలు, 8 మెట్రోపాలిటిన్ సిటీల్లో డేటా చోరీ
PBKS Vs KKR: కోల్కతాకు వర్షం దెబ్బ - డక్వర్త్ లూయిస్ పద్ధతిలో పంజాబ్ విక్టరీ!
BRSలో చేరిన మహారాష్ట్ర రైతు సంఘాల నేతలు, తన జీవితమంతా పోరాటాలేనన్న కేసీఆర్
Nellore Adala : టీడీపీకి అభ్యర్థులు లేకనే ఫిరాయింపులు - నెల్లూరు వైఎస్ఆర్సీపీ ఎంపీ లాజిక్ వేరే...