అన్వేషించండి

Ram Gopal Varma : ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై స్పందించిన RGV.. డైరక్టర్ ఇచ్చిన బెస్ట్ సొల్యూషన్స్ ఇవే!

Ram Gopal Varma : ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేకుండా ఉండేందుకు రామ్ గోపాల్ వర్మ కీలక సూచనలు చేశారు. కొత్తగా వచ్చే అమ్మాయిలకు మెంబర్ షిప్ తో పాటు వేధింపులు ఎదురైతే ఏం చేయాలో అవగాహన కల్పించాలన్నారు.

RGV About Casting Couch Control : సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల వ్యవహారాలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రీసెంట్ గా మలయాళీ సినీ పరిశ్రమలో జస్టిస్ హేమ కమిటీ రిపోర్టు సంచలనం సృష్టించింది. చాలా మంది బాధితులు బయటకు వచ్చి తమకు ఎదురైన వేధింపుల గురించి చెప్పారు. ఇండస్ట్రీలో పెద్దలుగా చలామణి అయ్యే చాలా మందిపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో తమ పదవులకు రాజీనామా చేశారు. ప్రస్తుతం టాలీవుడ్ లో జానీ మాస్టర్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. లేడీ కొరియోగ్రాఫర్ ఆయన మీద అత్యాచార ఆరోపణలు చేయడం అందరినీ షాక్ కి గురి చేసింది. ప్రస్తుతం జానీ మాస్టర్ ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఆగాలంటే ఏం చేయాలనే చర్చ జరుగుతోంది.    

రామ్ గోపాల్ వర్మ కీలక సూచనలు

సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు తగ్గాలంటే రెండు కీలక నిర్ణయాలు తీసుకోవాలన్నారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. “ఇండస్ట్రీలోకి రావాలనుకునే మహిళలు ఆయా డిపార్ట్ మెంట్ కు సంబంధించిన కమిటీలో మెంబర్ షిప్ తీసుకోవాలి. కొత్తవారికి ముందుగా అసలు ఇండస్ట్రీ అంటే ఏంటి? ఇండస్ట్రీ ఎలా ఉంటుంది? ఏ పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది? ఏవైనా వేధింపులు ఎదురైతే కమిటీకి ఎలా చెప్పాలి? అనే విషయాలపై వారికి అవగాహన కల్పించాలి. అప్పుడే వారికి ఇండస్ట్రీ అంటే కొంత అవగాహన వస్తుంది.

మెంబర్ షిప్ లేని వారిని సినిమాల్లోకి తీసుకోకూడదు అనే కండీషన్ పెట్టాలి. మెంబర్ షిప్ ఉందంటే.. ఆ అమ్మాయిని ఇబ్బంది పెడితే విషయం కమిటీకి తెలుస్తుందనే భయం ఉండాలి. అప్పుడు అమ్మాయిలను మాయ చేయాలనుకునేవారు కంట్రోల్ అవుతారు. అందుకే, అప్ కమింగ్ యాక్టర్లకు అవగాహన కార్యక్రమాలు అనేవి చాలా ముఖ్యం. మెంబర్ షిప్ ఉంటే సదరు అమ్మాయిలను ఎక్స్ ప్లాయిడ్ చేయకూడదని ప్రొడ్యూసర్లకు అర్థం అవుతుంది. అమ్మాయిలకు మెంబర్ షిప్, వారికి అవగాహన కల్పించడం ద్వారానే ఇండస్ట్రీలో లైంగిక వేధింపులను అడ్డుకునే అవకాశం ఉంటుంది” అని చెప్పుకొచ్చారు.  

‘శారీ’ నిర్మాణ పనుల్లో వర్మ బిజీ

ఇక ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ ‘శారీ’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. గిర కృష్ణ కమల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆరాధ్య దేవి, సత్య యదు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు నుంచి విడుదలైన టీజర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లిరికల్ సాంగ్ లో ఆరాధ్య గ్లామర్ మెరుపులు మెరిపిస్తూ కుర్రకారును కవ్వించింది. ఈ హాట్ సాంగ్ నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఈ పాటన్ ఆర్జీవీ డెన్ మ్యూజిక్ అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా రిలీజ్ చేశారు. ఇకపై తన సినిమా పాటలను ఈ ఛానెల్ ద్వారానే విడుదల చేయున్నారు.   

Read Also: లేడీ కొరియోగ్రాఫర్‌కు అల్లు అర్జున్ సాయం... అసలు విషయం చెప్పేసిన ‘పుష్ప 2’ నిర్మాత

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Prakash Raj vs Pawan Kalyan : రాజకీయాల్లోనూ నందా వర్సెస్ బద్రి - 30 తర్వాత చూసుకుందామని పవన్‌కు ప్రకాష్ రాజ్ కౌంటర్
రాజకీయాల్లోనూ నందా వర్సెస్ బద్రి - 30 తర్వాత చూసుకుందామని పవన్‌కు ప్రకాష్ రాజ్ కౌంటర్
Temple Chariot Fire Accident: అనంతపురంలో దేవుడి రథం దగ్ధం, విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం
అనంతపురంలో దేవుడి రథం దగ్ధం, విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం
Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం
Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం
Raghurama custodial torture case : వెంటాడుతున్న మరో కేసు - రఘురామ కేసులో ముందస్తు బెయిల్‌కు నో - ఆ పాల్‌తో పాటు జగన్‌నూ ?
వెంటాడుతున్న మరో కేసు - రఘురామ కేసులో ముందస్తు బెయిల్‌కు నో - ఆ పాల్‌తో పాటు జగన్‌నూ ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

లెబనాన్‌పై ఇజ్రాయేల్ భీకర దాడులు, 492 మంది మృతిఅమెరికా నుంచి ఇండియాకి యాంటిక్ పీసెస్, మోదీ పర్యటనతో అంతా క్లియర్Laapataa Ladies for Oscar | లాపతా లేడీస్ మూవీ కథేంటి? | ABP DesamPawan Kalyan HHVM Shoot Starts | వీరమల్లు రిలీజ్ డేట్‌పై క్రేజీ అప్ డేట్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prakash Raj vs Pawan Kalyan : రాజకీయాల్లోనూ నందా వర్సెస్ బద్రి - 30 తర్వాత చూసుకుందామని పవన్‌కు ప్రకాష్ రాజ్ కౌంటర్
రాజకీయాల్లోనూ నందా వర్సెస్ బద్రి - 30 తర్వాత చూసుకుందామని పవన్‌కు ప్రకాష్ రాజ్ కౌంటర్
Temple Chariot Fire Accident: అనంతపురంలో దేవుడి రథం దగ్ధం, విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం
అనంతపురంలో దేవుడి రథం దగ్ధం, విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం
Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం
Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం
Raghurama custodial torture case : వెంటాడుతున్న మరో కేసు - రఘురామ కేసులో ముందస్తు బెయిల్‌కు నో - ఆ పాల్‌తో పాటు జగన్‌నూ ?
వెంటాడుతున్న మరో కేసు - రఘురామ కేసులో ముందస్తు బెయిల్‌కు నో - ఆ పాల్‌తో పాటు జగన్‌నూ ?
DEVARA X JIGRA Interview: ‘దేవర’ చివరి 30 నిమిషాలు మరో లెవల్... ఆలియాతో ఎన్టీఆర్ ఇంటర్వ్యూ
‘దేవర’ చివరి 30 నిమిషాలు మరో లెవల్... ఆలియాతో ఎన్టీఆర్ ఇంటర్వ్యూ
Muda Case: కర్ణాటక హైకోర్టులో సీఎం సిద్ధరామయ్యకు గట్టి ఎదురుదెబ్బ-గవర్నర్‌ ఆదేశాలు సరైనవేననన్న కోర్టు
కర్ణాటక హైకోర్టులో సీఎం సిద్ధరామయ్యకు గట్టి ఎదురుదెబ్బ-గవర్నర్‌ ఆదేశాలు సరైనవేననన్న కోర్టు
Pawan Kalyan: ఆ ధైర్యం చేయకండి! నటులు కార్తీ, ప్రకాశ్‌ రాజ్‌కి పవన్ వార్నింగ్- వైసీపీ నేతలపై హైవోల్టేజ్‌ విమర్శలు 
ఆ ధైర్యం చేయకండి! నటులు కార్తీ, ప్రకాశ్‌ రాజ్‌కి పవన్ వార్నింగ్- వైసీపీ నేతలపై హైవోల్టేజ్‌ విమర్శలు 
Hyderabad: హైదరాబాద్‌లోని ఐటీ రైడ్స్‌ కలకలం- న్యూస్‌ చానల్‌ అధినేత ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీలు
హైదరాబాద్‌లోని ఐటీ రైడ్స్‌ కలకలం- న్యూస్‌ చానల్‌ అధినేత ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీలు
Embed widget