Upasana: గోల్డెన్ టెంపుల్ లో ఉపాసన, చరణ్ కు సపోర్ట్ గా!
కృతజ్ఞతాభావంతో అమృత్ సర్ లోని గోల్డెన్ టెంపుల్ లో రామ్ చరణ్ లాంగర్ సేవను నిర్వహించారు.
మెగా కోడలు ఉపాసన గోల్డెన్ టెంపుల్ ను సందర్శించినట్లుగా వెల్లడించింది. రామ్ చరణ్ చేయాల్సిన ఈ సేవా కార్యక్రమంలో ఉపాసన పాల్గొంది. రామ్ చరణ్ ఈ సేవను ఏర్పాటు చేశారు కానీ షూటింగ్ లో బిజీగా ఉండడంతో ఉపాసన హాజరైనట్లు తెలుస్తోంది. గోల్డెన్ టెంపుల్ లో లాంగర్ సేవ(అన్నదానం లాంటి కార్యక్రమం)ను రామ్ చరణ్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన పనులను ఉపాసన పూర్తి చేశారు. తను గోల్డెన్ టెంపుల్ లో ఉన్నట్లు ఉపాసన ఓ వీడియోను షేర్ చేశారు.
కృతజ్ఞతాభావంతో అమృత్ సర్ లోని గోల్డెన్ టెంపుల్ లో రామ్ చరణ్ లాంగర్ సేవను నిర్వహించారు. ఆయన షూటింగ్ లో బిజీగా ఉండడం వలన.. రామ్ చరణ్ తరఫున తను వెళ్లడం.. ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు ఉపాసన. తనకు, చరణ్ కు ప్రేక్షకుల ప్రేమాభిమానాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తున్నట్లు పేర్కొంది.
రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా షూటింగ్ అమృత్ సర్ లోనే జరుగుతోంది. అక్కడ ఓ యూనివర్సిటీలో షూటింగ్ ను మొదలుపెట్టారు. ఈ కాలేజీ సీన్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అలానే అంజలి, శ్రీకాంత్, సునీల్ లాంటి తారలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.
Also Read: మూవీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్, ఈ వారం థియేటర్లు, ఓటీటీ విడుదలయ్యే సినిమాలు ఏవో తెలుసా?
Also Read: అమ్మాయిని కాపాడేందుకు అది కోసుకోవడానికి సిద్ధపడిన తండ్రి - 'జయేష్‌భాయ్ జోర్దార్'
View this post on Instagram