News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

Upcoming Movies Web Series This Week: మూవీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్, ఈ వారం థియేటర్లు, ఓటీటీ విడుదలయ్యే సినిమాలు ఏవో తెలుసా?

Upcoming Movies Web Series In April 3rd Week 2022: తెలుగులో భారీ, మీడియమ్ బడ్జెట్ సినిమాలు ఏవీ ఈ వారం థియేటర్లలో విడుదల కావడం లేదు. మరి, ఏ సినిమాలు వస్తున్నాయి? ఏంటి? అంటే...

FOLLOW US: 
Share:

ఇది మూవీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్... మరీ ముఖ్యంగా తెలుగు సినిమా ప్రేక్షకులకు! ఎందుకంటే... ఈ వారం భారీ, మీడియం బడ్జెట్ సినిమాలు ఏవీ విడుదల కావడం లేదు. ఆ మాటకు వస్తే... చెప్పుకోదగ్గ సినిమాలు ఏవీ లేవు. అటు థియేటర్లలో, ఇటు ఓటీటీల్లో క్రేజ్ ఉన్న తెలుగు సినిమాలు లేవు. అందువల్ల, ప్రతి వారం కొత్త సినిమా చూసే అలవాటు ఉన్న ప్రేక్షకులకు నిరాశ తప్పదు.

అలాగని, ఈ వారం తెలుగు సినిమాలు ఏవీ విడుదల కావడం లేదని కాదు! కొన్ని సినిమాలు ఉన్నాయి. అందరూ కొత్తవాళ్లతో, కాస్త లో బడ్జెట్‌తో తీసిన తెలుగు సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. ఓటీటీలో వరుణ్ తేజ్ 'గని' వస్తోంది. థియేటర్లలో ఈ సినిమాకు వసూళ్లు ఏమాత్రం చెప్పుకోదగ్గ రీతిలో లేవు. సినిమా విడుదలైన తర్వాత వరుణ్ తేజ్ ఓ లేఖ రాశారు. అందులో ప్లాప్ అని పరోక్షంగా అంగీకరించారు. హిందీలో షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన 'జెర్సీ' ఒక్కటే థియేటర్లలో విడుదలవుతున్న చెప్పుకోదగ్గ సినిమా. ఇది తెలుగు హిట్ సినిమా 'జెర్సీ'కి రీమేక్.

Also Read: 'బ్లడీ మేరీ' రివ్యూ: ఓటీటీలో విడుదలైన నివేదా పేతురాజ్ సినిమా ఎలా ఉందంటే?

థియేటర్లలో ఈ వారం విడుదలవుతున్న హిందీ, తెలుగు సినిమాల వివరాలు:

  • హిందీలో ఏప్రిల్ 22న 'జెర్సీ' విడుదల
  • తెలుగులో 'బొమ్మల కొలువు', 'తపన', 'నాలో నిన్ను దాచానే', 'వన్ బై టు' తదితర లో బడ్జెట్ సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. 

ఓటీటీల్లో ఈ వారం విడుదలవుతున్న ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్, సినిమాల వివరాలు:

  • నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్ 21న 'హి ఈజ్ ఎక్స్‌పెక్టింగ్‌' (He Is Expecting) అనే జపనీస్ కామెడీ వెబ్ సిరీస్ విడుదల కానుంది. పురుషుడు గర్భం దాలిస్తే? అనే కథాంశంతో  ఈ సిరీస్ రూపొందింది.
  • వూట్ ఓటీటీలో ఏప్రిల్ 21న 'లండన్ ఫైల్స్' అనే సిరీస్ విడుదల కానుంది.
  • అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఏప్రిల్ 21న అరుణ్ విజయ్ హీరోగా నటించిన 'ఓ మై డాగ్' విడుదల కానుంది. ఇందులో ఓ పెట్ డాగ్ (పెంపుడు కుక్క) సైతం ప్రధాన పాత్రలో కనిపించనుంది. తెలుగు, తమిళ భాషల్లో సినిమా విడుదల కానుంది.
  • ప్రకాష్ రాజ్, సంపత్ రాజ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన తమిళ వెబ్ సిరీస్ 'అనంతం'. ఏప్రిల్ 22న 'జీ 5' ఓటీటీలో విడుదల కానుంది.
  • ఏప్రిల్ 22న సోనీ లివ్ ఓటీటీలో మలయాళ సినిమా 'అంత్యాక్షరి' విడుదల అవుతోంది.
  • ఏప్రిల్ 22న ఆహా ఓటీటీలో 'గని' విడుదలకు రెడీ అయ్యింది.

Also Read: 'గని' సినిమా రివ్యూ: బాక్సింగ్ పంచ్ అదిరిందా? లేదా?

ప్రదీప్ మాచిరాజు హోస్ట్ చేస్తున్న గేమ్ షో 'సర్కార్' సీజన్ 2 రెడీ అయ్యింది. ఏప్రిల్ 22న స్టార్ట్ కానున్నట్టు టాక్. 

Also Read: 'గాలివాన' రివ్యూ: 'జీ 5'లో విడుదలైన సిరీస్ ఎలా ఉందంటే?

Published at : 18 Apr 2022 02:39 PM (IST) Tags: Upcoming Movies Web Series Varun Tej Ghani Shahid Kapoor Jersey Prakash Raj Anantham Arun Vijay Oh My Dog London Files Series Japanese Series He Is Expecting

ఇవి కూడా చూడండి

Bigg Boss 7 Telugu: అర్జున్ ఎలిమినేట్ అవ్వాల్సింది కానీ.. అంటూ కంటెస్టెంట్‌కు షాకిచ్చిన నాగార్జున

Bigg Boss 7 Telugu: అర్జున్ ఎలిమినేట్ అవ్వాల్సింది కానీ.. అంటూ కంటెస్టెంట్‌కు షాకిచ్చిన నాగార్జున

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్‌కు క్యాష్ ప్రైజ్ ఎంతో రివీల్ చేసిన నాగార్జున, డబ్బులతో పాటు అవన్నీ కూడా!

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్‌కు క్యాష్ ప్రైజ్ ఎంతో రివీల్ చేసిన నాగార్జున, డబ్బులతో పాటు అవన్నీ కూడా!

Yash 19: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్‌కు పూనకాలే

Yash 19: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్‌కు పూనకాలే

Supritha Congratulates Revanth Reddy: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!

Supritha Congratulates Revanth Reddy: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ స్టేజ్‌పై ‘నా సామిరంగ’ హీరోయిన్ - ఇంప్రెస్ చేసి ఫ్లయింగ్ కిస్ కొట్టేసిన అమర్

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ స్టేజ్‌పై ‘నా సామిరంగ’ హీరోయిన్ - ఇంప్రెస్ చేసి ఫ్లయింగ్ కిస్ కొట్టేసిన అమర్

టాప్ స్టోరీస్

Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు

Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు

Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!

Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!

Rajasthan Election Result 2023: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?

Rajasthan Election Result 2023: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?

RGV Tweet on Revanth Reddy: రేవంత్ రెడ్డి బాహుబలి, తెలంగాణ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌ది కాదు - వర్మ సెన్సేషనల్ ట్వీట్

RGV Tweet on Revanth Reddy: రేవంత్ రెడ్డి బాహుబలి,  తెలంగాణ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌ది కాదు - వర్మ సెన్సేషనల్ ట్వీట్
×