Rakul Preet Singh: రకుల్ హిందీ సినిమా టైటిల్ మారింది... అంతా అజయ్ దేవగణే చేశారు!
రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ఓ హిందీ సినిమా టైటిల్ మారింది. దీనికి కారణం అజయ్ దేవగణ్. పూర్తి వివరాలు చూడండి.
అజయ్ దేవగణ్‌కు జంటగా నటించిన 'దే దే ప్యార్ దే' సినిమా హిందీలో రకుల్ ప్రీత్ సింగ్‌కు హిట్ ఇవ్వడమే కాదు, అక్కడ మరిన్ని అవకాశాలు వచ్చేలా చేసింది. అజయ్ దేవగణ్ ఆ సినిమా తర్వాత రకుల్‌కు మరోసారి అవకాశం ఇచ్చారు. ఆయన ఓ ప్రధాన పాత్రలో, స్వీయ దర్శక - నిర్మాణంలో ప్రారంభించిన సినిమా 'మిడ్ డే'. అందులో ఓ పాత్ర రకుల్‌కు ఇచ్చారు. 'దే దే ప్యార్ దే'లో పాత్రకు ఇది భిన్నమైన పాత్ర. ఇప్పుడీ సినిమా టైటిల్ మారింది.
'మిడ్ డే' టైటిల్‌ను 'రన్ వే 34'గా మార్చినట్టు అజయ్ దేవగణ్ సోమవారం వెల్లడించారు. అలాగే, రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 22న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్టు తెలియజేశారు. రంజాన్ సందర్భంగా సినిమా విడుదల అవుతుందన్నమాట. వాస్తవ సంఘటనల అధారంగా సినిమా తీశామని ఆయన చెప్పారు. ఈ సినిమాలో అజయ్ దేవగణ్ వైఫ్ పాత్రలో 'మళ్లీ రావా', 'దేవదాస్' ఫేమ్ ఆకాంక్షా సింగ్ నటించారు. అమితాబ్ బచ్చన్, బోమన్ ఇరానీ, అనిఘా ధర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
MayDay is now Runway 34. A high-octane thriller inspired by true events that is special to me, for reasons more than one! #Runway34 - Landing on Eid, April 29, 2022, as promised 🙏@SrBachchan @Rakulpreet @bomanirani @CarryMinati @aakanksha_s30 @angira_dhar @ADFFilms pic.twitter.com/FSP3hYF0o8
— Ajay Devgn (@ajaydevgn) November 29, 2021
'రన్ వే' టైటిల్, ఈ రోజు విడుదల చేసిన పోస్టర్లు చూస్తే... అజయ్ దేవగణ్, రకుల్ పైలెట్స్‌గా నటించినట్టు సులభంగా అర్థం అవుతుంది. కథ గురించి ఎక్కువ వివరించలేనని కానీ, యాక్షన్ థ్రిల్లర్‌గా సినిమా తీశామని అజయ్ దేవగణ్ చెప్పారు.
Also Read: బాలకృష్ణ ముందు డైలాగులు చెప్పడానికి భయపడ్డా! కానీ...
Also Read: నందమూరి కుటుంబంలో మూడు తరాలతో పని చేసిన మాస్టర్!
Also Read: అమిత్ షా మీద జోక్ వేశాడని... ఎక్కడా ఏ జోక్ వేయడానికి వీలు లేకుండా!
Also Read: పుష్ప సెట్‌కు వచ్చిన సమంత... అల్లు అర్జున్‌తో స్పెషల్ సాంగ్ షురూ!
Also Read: 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్... గెస్ట్ కూడా! ఎప్పుడు? ఎక్కడ? అంటే...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి