Annaatthe Second Single: రజినీకాంత్ కొత్త సాంగ్ వచ్చేసింది.. నయన్ తో రొమాన్స్ మాములుగా లేదు..
రజినీకాంత్ నటించిన 'అన్నాత్తే' సినిమా నుంచి 'సారా కాట్రే' అంటూ సాగే పాటని శనివారం సాయంత్రం ఆరు గంటలకు విడుదల చేసింది చిత్ర యూనిట్.
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కి కోలీవుడ్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. ఆయన సినిమాలు విడుదలవుతున్నాయంటే చాలు.. హడావిడి మాములుగా ఉండదు. ఆయన చివరిగా నటించిన సినిమా 'దర్బార్'. ప్రస్తుతం శివ దర్శకత్వంలో 'అన్నాత్తే' అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్ చేసి చాలా కాలమవుతున్నా.. కరోనా కారణంగా షూటింగ్ చాలాసార్లు వాయిదా పడింది. ఫైనల్ గా అన్ని అడ్డంకులను దాటుకొని షూటింగ్ పూర్తి చేసుకుంది.
Also Read: 'నాకు నేనే కింగ్..' షణ్ముఖ్ కామెంట్ కి నాగార్జున పంచ్..
దీపావళి కానుకగా సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీంతో ప్రమోషన్స్ షురూ చేశారు. ఇప్పటికే ఈ సినిమా మోషన్ పోస్టర్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో రజినీకాంత్ మాస్ గెటప్ లో ఆకట్టుకున్నారు. కొద్దిరోజుల క్రితం 'అన్నాత్తే.. అన్నాత్తే' అంటూ సాగే ఫస్ట్ సాంగ్ ను విడుదల చేశారు. స్ప్ బాలసుబ్రహ్మణ్యం ఆ పాటను పాడారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో పాటను విడుదల చేశారు.
'సారా కాట్రే' అంటూ సాగే మరో పాటను శనివారం సాయంత్రం విడుదల చేశారు. శ్రేయా గోషల్, సిద్ శ్రీరామ్ లు పాడిన ఈ పాట అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ లిరికల్ సాంగ్ లో నయన్-రజినీకాంత్ ల కెమిస్ట్రీకి సంబంధించిన కొన్ని సీన్లు చూపించారు. ఇమాన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో కుష్బు, మీనా, కీర్తి సురేష్, సూరి, ప్రకాశ్ రాజ్, జగపతి బాబు, అభిమన్యు సింగ్‌లో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నవంబర్ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
#SaaraKaattrae - #AnnaattheSecondSingle is here:
— Sun Pictures (@sunpictures) October 9, 2021
▶️ https://t.co/yFMY34tR6y
@rajinikanth @directorsiva #Nayanthara @KeerthyOfficial @immancomposer @sidsriram @shreyaghoshal #Yugabharathi @BrindhaGopal1 @AntonyLRuben @dhilipaction @vetrivisuals #Annaatthe
Also Read: ప్రకాష్ రాజ్ చుట్టూ వివాదాలే.. బ్యాన్ చేసిన మెగాఫ్యామిలీ ఈరోజు సపోర్ట్ చేస్తుందే..
Also Read: మోనార్క్ Vs మంచు: ‘మా’ పోరుపై ఉత్కంఠ.. విజయావకాశాలు అతడికే ఎక్కువట!
Also Read: విమానంలో పుట్టిన ‘మా’.. తొలి అధ్యక్షుడు ఆయనే.. ఇదే ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ చరిత్ర
Also Read: ‘మా’ బిడ్డల పోరు.. కళామతల్లి కన్నీరు.. పదవుల కోసం పంతాలు? పరువు తీస్తున్న పోట్లాటలు!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి