News
News
వీడియోలు ఆటలు
X

Priyanka Chopra: పెళ్లికి ముందే అండాలను దాచిపెట్టాను, అమ్మే అలా చేయమంది: ప్రియాంక చోప్రా

ఇటీవల ప్రియాంక చోప్రా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా పిల్లల్ని కనడం గురించి అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పింది.

FOLLOW US: 
Share:

Priyanka Chopra: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో ప్రియాంక చోప్రా ఒకరు. దశాబ్ద కాలంగా సినిమాల్లో నటిస్తూ ఇప్పటికీ వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోన్న ఈ బ్యూటీకు తెలుగులో కూడా గుర్తింపు బానే ఉంది. గతంలో కొన్నాళ్లు బాలీవుడ్ కు దూరంగా ఉన్న ఈ భామ మళ్లీ సినిమాల్లో నటిస్తోంది. ఈ మధ్య కాలంలో ప్రియాంక చేసిన కొన్ని వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. ముఖ్యంగా ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బాలీవుడ్ కు ఎందుకు దూరం కావాల్సింది వచ్చిందో చెప్పుకొచ్చింది. దీనిపై కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి. ఇదిలా ఉండగా ప్రియాంక మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేసింది. పిల్లల్ని కనడం కోసం తాను ఎలాంటి ప్రయత్నాలు చేసిందో చెప్పుకొచ్చింది. దీంతో మళ్లీ ప్రియాంక చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ఇటీవల ప్రియాంక చోప్రా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా పిల్లల్ని కనడం గురించి అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పింది. తనకు పిల్లలు అంటే చాలా ఇష్టమని, ఎక్కువ సేపు వాళ్లతో గడపడానికి ఇష్టపడేదానినని చెప్పింది ప్రియాంక. అందుకే 30 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తన అండాలను దాచి పెట్టుకోవాలని ఆమె తల్లి(గైనకాలజిస్ట్) మధు చోప్రా సలహా ఇచ్చిందని, ఆమె సలహా మేరకు తాను అండాలను దాచి పెట్టుకున్నానని తెలిపింది. అలా చేయడం వలన తనకు చాలా స్వేచ్ఛగా అనిపించిందని చెప్పింది. ఆ స్వేచ్ఛతోనే కెరీర్ లో తాను అనుకున్న లక్ష్యాలను చేరుకోగిగానని తెలిపింది. కానీ తనకు పిల్లల్ని కనాలనే ఆశ ఉండేదని, తన ప్రియుడు నిక్ జోనస్ కు ఆ సమయంలో 25 ఏళ్లు వయసు ఉండటంతో తనకి అప్పుడే పిల్లల్ని కనడం ఇష్టం ఉందో లేదో అనే అనుమానం ఉండేదని అంది. ఆ కారణం చేతే అతనితో డేటింగ్ కు కూడా ఒప్పుకోలేదని పేర్కొంది.  అందుకే తన తల్లి చెప్పినట్టు అండాలను దాచి పెట్టుకున్నానని తెలిపింది ప్రియాంక.

ప్రియాంక, నిక్ జోనస్ 2018 డిసెంబర్ 1, 2 తేదీల్లో హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయాల్లో వివాహం చేసుకున్నారు. తర్వాత 2022 జనవరిలో సరోగసి ద్వారా ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఇక ప్రియాంక ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తోంది. అయితే కొన్నాళ్లు ఆమె బాలీవుడ్ నుంచి తప్పుకుంది. గతంలో బాలీవుడ్ లో కొంతమంది వ్యక్తులకు తనకు విభేదాలు వచ్చాయి. ఆ గొడవల వలన తాను బాలీవుడ్ లో జరిగే రాజకీయాలతో విసిగిపోయాను అని, బాలీవుడ్ లో తనను పక్కన పెట్టేశారని వాపోయింది. తనకు అవకాశాలు రాకుండా చేశారని అందుకే బాలీవుడ్ కు దూరం కావాల్సి వచ్చిందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది ప్రియాంక. బాలీవుడ్ లో గ్యాప్ రావడంతో మ్యూజిక్ ఆల్బమ్స్ కోసం పనిచేశానని, అందులో భాగంగానే అమెరికా వెళ్లానని తెలిపింది. అయితే తనకు అందులో సంపూర్ణ జ్ఞానం రాలేదని, పూర్తిగా నేర్చుకున్నాక మళ్లీ మ్యూజిక్ వీడియోలు చేస్తానని చెప్పుకొచ్చింది. దీంతో మళ్లీ సినిమాల మీద దృష్టి పెట్టినట్టు చెప్పింది. ప్రియాంక ప్రస్తుతం ప్రముఖ దర్శకులు రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందుతున్న ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది ప్రియాంక. ఇదే వెబ్ సిరీస్ లో ఇండియాలో ప్రియాంక పాత్రను సమంత పోషిస్తుంది. ఈ వెబ్ సిరీస్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. అలాగే ప్రియాంక నటించిన ‘లవ్ ఎగైన్’ అనే సినిమా వేసవిలో విడుదల కానుంది.

Read Also: అల్లు అర్జున్ మొదటి జీతం రూ.3500 మాత్రమే - ఇప్పుడు ఆయన ఆస్తుల విలువెంతో తెలుసా?

Published at : 29 Mar 2023 08:06 PM (IST) Tags: Priyanka Chopra Bollywood Priyanka Chopra Movies Priyanka Chopra Egg

సంబంధిత కథనాలు

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

Adipurush Trailer: ‘ఆదిపురుష్’ ఫైనల్ ట్రైలర్ - భీకర యుద్ధంలో కదంతొక్కిన రామసేన!

Adipurush Trailer: ‘ఆదిపురుష్’ ఫైనల్ ట్రైలర్ - భీకర యుద్ధంలో కదంతొక్కిన రామసేన!

ప్రభాస్ తనలో రాముడిని బయటకు తెచ్చారు, నేటితరానికి ఈ మూవీ అవసరం: చిన్న జీయర్ స్వామి

ప్రభాస్ తనలో రాముడిని బయటకు తెచ్చారు, నేటితరానికి ఈ మూవీ అవసరం: చిన్న జీయర్ స్వామి

రామ్ చరణ్ సినిమా కోసం 'RRR' ఫార్ములాను ఫాలో అవుతున్న బుచ్చిబాబు!

రామ్ చరణ్ సినిమా కోసం 'RRR' ఫార్ములాను ఫాలో అవుతున్న బుచ్చిబాబు!

వివాదంలో ‘2018’ మూవీ - జూన్ 7 నుంచి థియేటర్స్ బంద్, ఎందుకంటే..

వివాదంలో ‘2018’ మూవీ - జూన్ 7 నుంచి థియేటర్స్ బంద్, ఎందుకంటే..

టాప్ స్టోరీస్

Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!

Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!

Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో బిపర్‌జోయ్ తుపాను, వచ్చే 5 రోజులు ఇక్కడే బీభత్సమే - ఐఎండీ హెచ్చరిక

Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో బిపర్‌జోయ్ తుపాను, వచ్చే 5 రోజులు ఇక్కడే బీభత్సమే - ఐఎండీ హెచ్చరిక

Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!

Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!

Kakinada MP Vanga Geetha: వైసీపీ ఎంపీ వంగా గీత నుంచి ప్రాణహాని! స్పందనలో కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన ఆడపడుచు

Kakinada MP Vanga Geetha: వైసీపీ ఎంపీ వంగా గీత నుంచి ప్రాణహాని! స్పందనలో  కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన ఆడపడుచు