Premalu Actress Mamitha Baiju: ఆ డైరెక్టర్ నన్ను కొట్టలేదు - 'ప్రేమలు' నటి మమిత బైజు పోస్ట్ వైరల్
Mamitha Baiju: ప్రేమలు నటి మమిత బైజు.. కొద్ది రోజలుగా ఇండస్ట్రీలో ఈ పేరు మారుమోగుతుంది. అయితే ఇలా స్టార్ డమ్ వచ్చిందో లేదో ఆ వెంటనే ఓ వార్తతో ఆమె సంచలనంగా మారింది ఈ బ్యూటీ.
Mamitha Baiju Clarifies on Her Comments: మమిత బైజు.. కొద్ది రోజలుగా ఇండస్ట్రీలో ఈ పేరు మారుమోగుతుంది. లేటెస్ట్ లవ్ డ్రామా 'ప్రేమలు' సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది. అప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ప్రేమలు చిత్రమే ఆమెకు బ్రేక్ ఇచ్చింది. హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం మలయాళం బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతుంది. పాజిటివ్ రివ్యూస్, భారీ కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. ఈ చిత్రం ఇంత భారీ విజయం సాధించడంతో మమిత పేరు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇందులో తన యాక్టింగ్ స్కిల్స్, లుక్‌తో యూత్‌ని ఫిదా చేసింది. దీంతో ప్రస్తుతం కుర్రకారు అంతా మమిత పేరునే కలవరిస్తుంది. అయితే ఇలా స్టార్ డమ్ వచ్చిందో లేదో ఆ వెంటనే ఓ వార్తతో ఆమె సంచలనంగా మారింది ఈ బ్యూటీ.
ఆ డైరెక్టర్ కొట్టాడు, తిట్టాడు..
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ బాలాపై ఆమె చేసిన ఆరోపణలు ఇండస్ట్రీలో హట్‌టాపిక్‌గా నిలిచాయి. తమిళ స్టార్ హీరో సూర్య లేటెస్ట్ మూవీ 'వణంగాన్'. ఈ చిత్రంలో మొదట పీమేల్ లీడ్ చాన్స్ తనకే వచ్చిందని, డైరెక్టర్ బాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నానంటూ ఆమె ఓ ఇంటర్య్వూలో చెప్పిన వీడియో క్లిప్ బయటకు వచ్చింది. ఇందులో ఆమె 'వణంగాన్' అనే తమిళ సినిమా షూటింగ్ చేస్తుండగా దర్శకుడు బాలా తనని దూషించారని, తిట్టడమే కాదు కొన్నిసార్లు చేయి కూడా చేసుకున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్ నుంచి బయటికొచ్చేశాను అంటూ చెప్పుకొచ్చింది. ఇదే వీడియో వైరల్‌గా కావడంతో ఆమె ఫ్యాన్స్, నెటిజన్లు డైరెక్టర్ బాలాపై విరుచుకుపడుతున్నారు. ఆయనను విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు. దీంతో ఈ వివాదంపై తాజాగా మిమిత స్పందించింది. తన వీడియో క్లిప్ నిజం కాదనీ, తను ఒకటి చెప్పితే మరోకటి స్రష్టించిన తప్పుగా ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేసింది.
ఆ వార్తలు నిజం కాదు..
ఈ మేరకు మిమిత తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ షేర్ చేసింది. "హాలో.. మీ అందరికి ఓ విషయంపై క్లారిటీ ఇవ్వాలనుకుంటున్న. నేను ఓ తమిళ తమిళ చిత్రం గురించి ఏదో మాట్లాడినట్లుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవి. సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూ నుంచి కేవలం ఒక సందర్భాన్ని కట్ చేసి, ఎడిట్ చేసి, ఇష్టమొచ్చిన టైటిల్స్ పెట్టేసి వార్తలు రాసేశారు. నేను ఆ సినిమా ప్రీ-ప్రొడక్షన్ వర్క్, షూటింగ్‌తో కలిపి దాదాపు ఒక ఏడాది పాటు బాలా సార్‌తో కలిసి పనిచేశాను. షూటింగ్‌లో మొత్తం కూడా ఆయన నాతో చాల కైండ్‌గా ఉన్నారు. బెటర్ యాక్టర్‌గా ఎదగాలంటే ఎలా ఉండాలి, యాక్టింగ్స్ స్కిల్స్ ఎలా ఉండాలో నేర్పించారు. నేను ఆ చిత్రంలో చేస్తున్న సమయంలో ఏ రోజు నాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఫిజికల్‌గా, మెంటల్‌గా లేదా మరే ఏ విధంగానూ నేను ఎలాంటి అసౌకర్యానికి గురి కాలేదు. ఇతర ప్రొఫిషినల్ కమిట్‌మెంట్స్ కారణంగానే నేను ఆ చిత్రం నుంచి తప్పుకున్నాను. ఈ వీడియో గురించి వార్తలు రాసే ముందు నన్ను సంప్రదించిన పలు మీడియా సంస్థలకు ధన్యవాదాలు" అంటూ ఆమె క్లారిటీ ఇచ్చింది.
#Premalu fame #MamithaBaiju talks about director Bala hitting her on the sets of #Vanangaan. Thankfully, #Suriya and left the project. We've known this about #Bala for years, and yet he continues to abuse artists on sets. pic.twitter.com/NSRRRc730u
— George 🍿🎥 (@georgeviews) February 28, 2024