Prema Vimanam Trailer: ఓవైపు ఫన్, మరోవైపు ఎమోషన్- ఆకట్టుకుంటున్న ‘ప్రేమ విమానం’ ట్రైలర్
సంగీత్ శోభన్, శాన్వీ మేఘన జంటగా నటించిన చిత్రం ‘ప్రేమ విమానం’. నేరుగా ఓటీటీలో విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన తాజాగా ట్రైలర్ విడుదలైంది. ఫన్, ఎమోషన్ తో ఆకట్టుకుంటోంది.
రోజు రోజుకు ఓటీటీలు మరింత విస్తరిస్తున్నాయి. సినీ ప్రియులకు చక్కటి కంటెంట్ తో కూడిన సినిమాలు, వెబ్ సిరీస్ లు అందుబాటులోకి తెస్తున్నాయి. ఇక 'ప్రేమ విమానం' సినిమా నేరుగా ఓటీటీలో విడుదల కాబోతోంది. అభిషేక్ పిక్చర్స్, జీ 5 బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాను రూపొందించాయి. ఈ వెబ్ ఫిల్మ్ అక్టోబర్ 13 నుంచి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
సినిమాపై భారీగా అంచనాలు పెంచిన ట్రైలర్
సంతోష్ కాటా దర్శకత్వంలో ‘ప్రేమ విమానం’ చిత్రం తెరకెక్కింది. సంగీత్ శోభన్, సాన్వీ మేఘన, అనసూయ భరద్వాజ్, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచింది. ఈ ట్రైలర్ చూస్తుంటే రీసెంట్ గా వచ్చిన ‘విమానం’ సినిమా మాదిరిగానే కనిపిస్తోంది. విమానం ఎక్కాలని కలలు కనే ఇద్దరు చిన్న పిల్లలు, కొత్త జీవితం కోసం ఫ్లైట్ ఎక్కి ఎక్కడికైనా వెళ్లిపోవాలనుకునే ప్రేమ జంటను బేస్ చేసుకుని ఈ సినిమాను రూపొందించారు. వీరి జీవితాలో ఎదురయ్యే సంఘటనలు, వారి జర్నీలో వచ్చే మలుపులు, సంతోషాలు, బాధలు, నవ్వులను కలగలిపి ఈ సినిమాను తీశారు. ఇక ఈ చిత్రంలో చిన్న పిల్లలుగా నిర్మాత అభిషేక్ నామా తనయులు దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా నటించారు. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘విమానం‘ మాదిరిగా ఉన్న ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
View this post on Instagram
అక్టోబర్ 13న ‘ప్రేమ విమానం’ స్ట్రీమింగ్
ఇక జీ5 ఓటీటీ ప్రియులకు చక్కటి కంటెంట్ ను అందిస్తోంది. సరికొత్త సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లను అందిస్తోంది. ఈ డిజిటల్ ప్లాట్‍ఫామ్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ, గుజరాతి తదితర భాషల్లో వినోదాన్ని పంచుతోంది. అలాంటి జీ5 వేదికగా ‘ప్రేమ విమానం’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ వెబ్ ఫిల్మ్ అక్టోబర్ 13న జీ5 వేదికగా స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. జగదీష్ చీకటి కెమెరామెన్‍గా వర్క్ చేశారు. దేవాన్ష్ ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ఎడిటర్ గా అమర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ గా గంధి నడికుడికర్ పని చేశారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా మోహిత్ రాల్యని ఉన్నారు.
Read Also: నాలో నేను బాధపడుతున్నా, ‘జవాన్’ బ్యూటీ ఆవేదన- అసలు ఏం జరిగిందంటే?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial