అన్వేషించండి

Sanya Malhotra: నాలో నేను బాధపడుతున్నా, ‘జవాన్’ బ్యూటీ ఆవేదన- అసలు ఏం జరిగిందంటే?

బాలీవుడ్ బ్యూటీ సన్యా మల్హోత్రా సరికొత్త విషయాన్ని వెల్లడించింది. తాను ఇంపోస్టర్ సిండ్రోమ్‌ తో బాధపడుతున్నట్లు చెప్పింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

సాన్యా మల్హోత్ర. పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. ‘దంగల్’ చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ,  అమీర్ ఖాన్ కూతురిగా నటించి ఆకట్టుకుంది. తొలి సినిమాతోనే అద్భుత గుర్తింపు తెచ్చుకుది. ఈ చిత్రం తర్వాత బాలీవుడ్ లో వరుస అవకాశాలు వచ్చాయి. తాజాగా ‘జవాన్’ సినిమాలో కనిపించింది. డాక్టర్ పాత్రలో చక్కటి నటన కనబర్చింది. ఈ సినిమాతో మరోసారి బాగా క్రేజ్ సంపాదించుకుంది. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, పలు కీలక విషయాలను వెల్లడించింది.   

ఆ సమస్యతో చాలా ఇబ్బంది పడ్డా- సాన్యా     

చాలా కాలంగా ఇంపోస్టర్ సిండ్రోమ్ అనే సమస్యతో బాధపడుతున్నట్లు సాన్యా తెలిపింది. దీని కారణంగా తనతో తాను ఆత్మ న్యూనతకు గురవుతున్నట్లు వెల్లడించింది. తన నటన పట్ల ప్రజల నుంచి ప్రశంసలు లభిస్తున్నా, బాగా చేయలేదేమోనని తనకు అనుమానం కలుగుతుందని చెప్పింది. తాను చేసే పని తనకు నచ్చేది కాదన్నారు.  ‘బదాయ్‌ హో’ సినిమాను ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడ్డా, తాను బాగా నటించలేదని ఫీలయ్యానని తెలిపింది. ఇప్పుడిప్పుడే కాస్త కుదుటపడుతున్నట్లు తెలిపింది.   

అనుకోకుండా ‘దంగల్’ అవకాశం   

ఢిల్లీ నుంచి ముంబైకి మారిన సమయంలోనూ పలు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సాన్యా వివరించింది. "నేను ఢిల్లీ నుంచి ముంబైకి మారినప్పుడు, బాలీవుడ్‌లో రాణించాలంటే 10 నుంచి 15 సంవత్సాల సమయం పడుతుందని చాలా మంది అన్నారు. కానీ, కొద్ది రోజుల్లోనే  ‘దంగల్’ సినిమా కోసం నితేష్ తివారీ నుంచి కాల్ వచ్చింది.  నేను ఎప్పుడూ నా కష్టాన్ని నమ్ముకుంటాను. టాలెంట్ ను నమ్ముకుంటాను. మీరు కూడా మిమ్మల్ని నమ్ముకోండి” అని చెప్పింది.  

ఢిల్లీతో పోల్చితే ముంబై సేఫ్

మహిళల రక్షణ విషయంలో ఢిల్లీతో పోలిస్తే ముంబై బెస్ట్ అంటూ గతంలో సంచలన వ్యాఖ్యలు చేసింది సాన్యా.  ‘‘నాది ఢిల్లీ. నేను అక్కడే పుట్టి పెరిగాను. కానీ, ముంబైలో సేఫ్ గా ఫీలవుతున్నాయి. ఢిల్లీ అభివృద్ధి చెందిందో? లేదో? తెలియదు కానీ,  అక్కడ మహిళలకు మాత్రం భద్రత లేదు” అని అప్పట్లో హాట్ కామెంట్స్ చేసింది. అటు కొంత మంది సినీ దర్శకుడు తనతో వ్యహరించిన తీరు ఆగ్రహాన్ని కలిగించిందని చెప్పారు.  ‘దంగల్‌’ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సాన్యా ‘బదాయ్‌ హో’, ‘ఫొటోగ్రాఫ్‌’, ‘మీనాక్షి సుందరేశ్వర్‌’ ‘లవ్‌ హాస్టల్‌’ ‘హిట్’ సహా పలు సినిమాల్లో నటించింది. తదితర సినిమాల్లో నటించారు. సాన్యా మల్హోత్రా చివరిసారిగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జవాన్‌’లో కనిపించింది. ఇక  భారతదేశపు తొలి ఫీల్డ్ మార్షల్ సామ్ మానెక్షా జీవితకథ ఆధారంగా రూపొందించబడిన ‘సామ్ బహదూర్‌’లో కనిపించబోతోంది. ఈ చిత్రంలో విక్కీ కౌశల్  టైటిల్ రోల్‌ పోషిస్తుండగా, ఫాతిమా సనా షేక్ కూడా నటించారు. ఈ సినిమా  డిసెంబర్ 1, 2023న విడుదల కానుంది. అటు మలయాళ చిత్రం ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ హిందీ రీమేక్‌ లోనూ ఆమె నటిస్తోంది.  

Read Also: రజనీకాంత్ కొత్త మూవీ షూటింగ్ షురూ, ఫుల్ జోష్ లో సూపర్ స్టార్ ఫ్యాన్స్

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget