Pranitha Subhash Baby: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ప్రణీత సుభాష్, ఇవిగో ఫొటోలు
నటి ప్రణీత పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. సోషల్ మీడియా వేదికగా ఫొటోను షేర్ చేసింది.
నటి ప్రణీత సుభాష్ శుక్రవారం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియా వేదికగా తన బేబీ గర్ల్ ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకుంది. కరోనా వైరస్ పీక్‌లో ఉన్న సమయంలో ప్రణీత.. నితిన్ రాజును పెళ్లి చేసుకుంది. ఏడాది తిరగగానే తాను తల్లి కాబోతున్నానంటూ గుడ్ న్యూస్ కూడా చెప్పేసింది. ఇటీవలే ప్రణీత తన భర్తతో కలిసి బేబీ బంప్ ఫొటో షూట్‌లో పాల్గొంది. తాజాగా ఆమె బాత్ టబ్‌లో బేబీ బంప్‌తో జలకాలాడుతున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ తర్వాత ప్రణీత మరే తెలుగు సినిమాల్లో నటించలేదు. ప్రస్తుతం ‘రమణ అవతార’ అనే కన్నడ సినిమాకు సైన్ చేసింది. ప్రెగ్నెన్సీ వల్ల ప్రణీత షూటింగులకు దూరంగా ఉంది.
Also Read: బాలకృష్ణ మొదటి చిత్రాన్ని అప్పటి ప్రభుత్వం ఎందుకు నిషేదించిందో తెలుసా?
View this post on Instagram
View this post on Instagram
Also Read: ఆది ప్రేమలో వర్షిణీ? నువ్వే నాకు తగినవాడివంటూ ఇన్‌స్టా పోస్ట్!