Prabhas: 'ఇంట్లో పూజ గది ఉందని గుడికి వెళ్లడం మానేస్తామా..?' - ప్రభాస్ కామెంట్స్!
హైదరాబాద్ లో 'సీతారామం' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. దీనికి ప్రభాస్ ముఖ్య అతిథిగా వచ్చారు.
దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రూపొందుతున్న సినిమా 'సీతారామం'. ఆగస్టు 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటివరకు విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రాలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ లో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ''ఫ్యాషనేట్ గా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయడం ఈజీ కాదు. ఇది కేవలం లవ్ స్టోరీ మాత్రమే కాదు. చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. రష్యాలో షూట్ చేసిన ఫస్ట్ తెలుగు సినిమా ఇది. దర్శకుడు హను రాఘవపూడి ఈ సినిమాను పోయెట్రీలా తీశారు. మనకున్న ఫైనెస్ట్ డైరెక్టర్స్ లో ఆయనొకరు. అశ్వనీదత్ గారు నిర్మాతగా తన 50 ఏళ్ల కెరీర్ లో ఎన్నో మంచి సినిమాలు తీశారు. కొన్ని సినిమాలు థియేటర్లోనే చూడాలి. ఇది థియేటర్ లోనే చూసే సినిమా. మన ఇంట్లో పూజ గది ఉందని గుడికి వెళ్లడం మానేస్తామా..? మా సినిమా ఫీల్డ్ కి థియేటరే గుడి'' అంటూ చెప్పుకొచ్చారు.
''ప్రభాస్ సాధారణంగా బయటకు రారు.. ఒకటి మాకోసం వచ్చారు రెండు సినిమాని బతికిద్దామని వచ్చారు. జనాన్ని థియేటర్ కు రప్పించడానికి ఇక్కడకు వచ్చారు'' అంటూ నిర్మాతల్లో ఒకరైన స్వప్న అన్నారు.
ఈ సినిమాలో రష్మికా మందన్న (Rashmika Mandanna) కీలక పాత్రలో కనిపించనున్నారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్, ప్రియాంక దత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్. సుమంత్, గౌతమ్ మీనన్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Also Read: మళ్ళీ నిఖిల్‌ను వెనక్కి పంపారు - ఆగస్టు 12న కాదు, తర్వాత రోజున 'కార్తికేయ 2'
Also Read: నాగ చైతన్య నవ్వితే డేటింగ్‌లో ఉన్నట్టేనా? ఆమెతో ప్రేమ నిజమేనా?
View this post on Instagram
View this post on Instagram