అన్వేషించండి

Naga Chaitanya : నాగ చైతన్య నవ్వితే డేటింగ్‌లో ఉన్నట్టేనా? ఆమెతో ప్రేమ నిజమేనా?

Here's Naga Chaitanya's reaction when he questioned about Sobhita Dhulipala : అడివి శేష్ 'గూఢచారి', 'మేజర్' సినిమాల్లో నటించిన శోభితా ధూళిపాళతో నాగ చైతన్య డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

వ్యక్తిగత జీవితం గురించి లో ప్రొఫైల్ మైంటైన్ చేసే కథానాయకులలో అక్కినేని నాగ చైతన్య ఒకరు. సమంతతో వివాహ బంధంలో ఉన్నప్పుడూ... ఆమెతో వేరు పడినప్పుడూ...  ఇప్పుడూ.... ఎప్పుడూ... సినిమా సంగతులు తప్ప, రూమర్స్ మీద స్పందించిన సందర్భాలు తక్కువ. ఫర్ ద ఫస్ట్ టైమ్... 'లాల్ సింగ్ చడ్డా' ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ముంబై మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్న చైతూకు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్నలు ఎదురు అవుతున్నాయి. ఆయన కూడా చాలా హుందాగా సమాధానాలు ఇస్తున్నారు.
 
శోభిత రూమర్ గాళ్ ఫ్రెండేనా? నిజమైన ప్రేమా?
సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత 'గూఢచారి', 'మేజర్' చిత్రాల్లో నటించిన తెలుగు అమ్మాయి శోభితా ధూళిపాళ (Sobhita Dhulipala) తో నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) డేటింగ్ చేస్తున్నారని, ఆమె అతడి గాళ్ ఫ్రెండ్ అని వార్తలు వచ్చాయి. శోభిత గురించి ఆయనకు తొలిసారి ఒక ప్రశ్న ఎదురైంది.
 
''శోభితా ధూళిపాళ పేరు వినగానే మీకు ఏం గుర్తుకు వస్తుంది? మీ మనసులో ఏం అనిపిస్తుంది?'' అని నాగ చైతన్యను ముంబై ఆర్జే ఒకరు అడిగారు. అప్పుడు అక్కినేని యువ హీరో నవ్వేశారు. ''I'm just gonna smile'' (జస్ట్... స్మైల్ ఇస్తా!  /నవ్వుతాను, అంతే) అని సమాధానం ఇచ్చారు.

నాగ చైతన్య నవ్వులో ముంబై మీడియా చాలా అర్థాలు వెతుకుతోంది. ఒక స్మైల్‌తో డేటింగ్ విషయాన్ని కన్ఫర్మ్ చేశారని కొందరు రాస్తే... ప్రేమలో ఉన్నారు కాబట్టి అలా నవ్వారని మరికొందరు రాస్తున్నారు. అదీ సంగతి!

సమంత పుట్టించిన పుకారేనా?
నాగ చైతన్య, శోభితా ధూళిపాళ మధ్య స‌మ్‌థింగ్ స‌మ్‌థింగ్‌ అంటూ వచ్చిన వార్తల వెనుక సమంత ఉన్నారని అప్పట్లో కొందరు రాసుకొచ్చారు. అటువంటి రాతలపై సమంత ఆగ్రహం వ్యక్తం చేశారు.
''ఒక అమ్మాయి మీద పుకార్లు వస్తే... బహుశా నిజమే కావచ్చు. 
ఒక అబ్బాయి మీద పుకార్లు వస్తే... ఒక అమ్మాయి కావాలని చేయించింది.
ఇంకెన్ని రోజులు అలాగే ఉంటారు. జీవితంలో పైకి ఎదగండి. 
ఇద్దరూ దాన్ని మర్చిపోయి జీవితంలో ముందుకు వెళుతున్నారు. మీరూ మర్చిపోండి. మీ పని మీద దృష్టి పెట్టండి. మీ కుటుంబం మీద దృష్టి పెట్టండి'' అని అప్పట్లో సమంత ట్వీట్ చేశారు.

Also Read : స్టార్స్ సెక్స్ లైఫ్ గురించి అడిగితే మీ అమ్మ ఏమీ అనుకోరా? - కరణ్ జోహార్‌ను ఆటాడుకున్న ఆమిర్ ఖాన్

నాగ చైతన్య ముంబైలో... శోభిత స్కాట్లాండ్‌లో!
'లాల్ సింగ్ చడ్డా' ప్రమోషన్స్ కోసం అక్కినేని నాగ చైతన్య ముంబై వెళితే...  మామూలుగా ముంబైలో ఉండే శోభితా ధూళిపాళ ఇప్పుడు స్కాట్లాండ్‌లో ఉన్నారని సమాచారం. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేస్తున్న ఫోటోలు కూడా విదేశాల ఉన్నట్లు తెలియజేస్తున్నాయి. ముంబైలో ఉంటే మళ్ళీ లేనిపోని రూమర్స్ వస్తాయని ముందు జాగ్రత్తగా ఆమె విదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది.

Also Read : ఫొటోగ్రాఫ‌ర్‌గా మారిన మహేష్ కొడుకు - రూ.20 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్!

టాప్ హెడ్ లైన్స్

Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Mahesh Babu : వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
Toxic Trailer : టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్
టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget