News
News
X

Aamir Khan On Karan Johar : స్టార్స్ సెక్స్ లైఫ్ గురించి అడిగితే మీ అమ్మ ఏమీ అనుకోరా? - కరణ్ జోహార్‌ను ఆటాడుకున్న ఆమిర్ ఖాన్

'కాఫీ విత్ కరణ్' కార్యక్రమంలో సెలబ్రిటీలకు కరణ్ జోహార్ చాలా క్లిష్టమైన ప్రశ్నలు వేస్తారు. అటువంటి ఆయనను ఆమిర్ ఖాన్ ఒక ఆట ఆడుకున్నారని లేటెస్టుగా విడుదలైన ప్రోమో చూస్తే తెలుస్తోంది. 

FOLLOW US: 

'కాఫీ విత్ కరణ్' అంటే సెక్స్ లైఫ్ గురించి కరణ్ జోహార్ తప్పకుండా ఒక్క ప్రశ్న అయినా సరే అడుగుతారని ప్రేక్షకులు, పరిశ్రమ ప్రముఖులు ఒక అభిప్రాయానికి వచ్చారని చెప్పవచ్చు. లేటెస్ట్ సీజన్‌లో విజయ్ దేవరకొండ కారులో, బోటులో సెక్స్ చేశానని చెప్పడం వైరల్ అయ్యింది. ఇంతకు ముందు 'కాఫీ విత్ కరణ్' సీజన్లలో కూడా సెలబ్రిటీలను సెక్స్ లైఫ్ గురించి కరణ్ జోహార్ ప్రశ్నించారు. ఇప్పుడు  ఆయనకు ఆమిర్ ఖాన్ అటువంటి ప్రశ్న వేశారు. ఒక ఆట ఆదుకున్నారు. 

కాఫీ ప్రోగ్రామ్‌లో 'లాల్ సింగ్ చడ్డా' జోడీ 
బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ జంటగా నటించిన సినిమా 'లాల్ సింగ్ చడ్డా' (Laal Singh Chaddha). ఇందులో అక్కినేని నాగ చైతన్య కీలక పాత్ర చేశారు. ఆగస్టు 11న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా 'కాఫీ విత్ కరణ్' షోలో 'లాల్ సింగ్ చడ్డా' జోడీ ఆమిర్, కరీనా సందడి చేశారు. వాళ్ళిద్దరూ వచ్చిన ఎపిసోడ్ ఆగస్టు 4న 12 గంటలకు విడుదల కానుంది. లేటెస్టుగా ప్రోమో విడుదల చేశారు (Koffee With Karan Latest Episode Promo Featuring Laal Singh Chaddha Lead Pair Aamir Khan and Kareena Kapoor Khan Out Now).

పిల్లలు పుట్టిన తర్వాత సెక్స్...
కరీనా కపూర్ ఖాన్‌కు పెళ్ళైన సంగతి తెలిసిందే. సైఫ్ అలీ ఖాన్‌తో ఆమె సంసార జీవితం సాఫీగా, సంతోషంగా సాగుతోంది. అంతే కాదు... సైఫ్, కరీనా దంపతులకు ఇద్దరు పిల్లలు. పిల్లలు జన్మించిన తర్వాత సెక్స్ లైఫ్ గురించి కరీనాను కరణ్ జోహార్ ప్రశ్నించారు. 
''పిల్లలు పుట్టిన తర్వాత క్వాలిటీ సెక్స్ అనేదా అపోహా? నిజమా?'' అని కరీనాను కరణ్ ప్రశ్నించారు. అందుకు బదులుగా ఆమె ''నీకు తెలియదు'' అని సమాధానం ఇస్తారు. ''మా అమ్మ కూడా ఈ షో చూస్తుంది. నువ్వు నా సెక్స్ లైఫ్ గురించి బ్యాడ్ గా మాట్లాడుతున్నావ్'' అని కరణ్ అంటే... వెంటనే ఆమిర్ ఖాన్ ''ఇతరుల సెక్స్ లైఫ్ గురించి మాట్లాడితే మీ అమ్మ ఏమీ అనుకోరా?'' అని ప్రశ్నించారు. కరీనాతో ఎటువంటి ప్రశ్నలు అడుగుతున్నారని వ్యంగ్యంగా అన్నారు.
 
కరణ్‌ను ఒక ఆట ఆడుకున్న ఆమిర్
కేవలం ఆ ఒక్క విషయంలోనే కాదు... ''మీ షో చేస్తే ఎవరో ఒకరికి అవమానం తప్పదు. ఎవరో ఒకరు తప్పకుండా ఏడుస్తారు. నువ్వు అందరి నిజాలు బయట పెడతావ్'' అని కరణ్ జోహార్ మీద ఆమిర్ ఖాన్ పంచ్‌ల‌ వర్షం కురిపించారు.

Also Read : బాయ్‌కాట్ 'లాల్ సింగ్ చ‌డ్డా' - ఖాన్స్ సినిమాపై నెటిజన్స్ ఫైర్

ప్రోమో చూస్తే... ఆమిర్, కరీనా ఎపిసోడ్ చాలా సరదాగా సాగినట్టు ఉంది. అయితే... ఆమిర్ వచ్చే ముందు కరీనాతో బోరింగ్‌గా ఉంటుందేమోనని కరణ్ జోహార్ అన్నట్టు ఉన్నారు. లేదంటే... 'నువ్వు ఆమిర్ బోరింగ్ అనుకున్నావ్' అని కరీనా అనరు కదా! అదీ సంగతి!

Also Read : నా సినిమాను బాయ్‌కాట్‌ చేయొద్దు ప్లీజ్ - ఆమిర్ ఖాన్ ఆవేదన

View this post on Instagram
 
A post shared by Disney+ Hotstar (@disneyplushotstar)

Published at : 02 Aug 2022 01:16 PM (IST) Tags: Aamir Khan Kareena Kapoor karan johar Koffee With Karan Latest Promo Aamir Roast Karan Johar

సంబంధిత కథనాలు

Dobaaraa: తాప్సీ సినిమాకి షాక్ - ఆడియన్స్ లేక షోస్ క్యాన్సిల్!

Dobaaraa: తాప్సీ సినిమాకి షాక్ - ఆడియన్స్ లేక షోస్ క్యాన్సిల్!

Ranveer Deepika's New House : కొత్తింట్లో అడుగుపెట్టిన ర‌ణ్‌వీర్ - దీపిక దంపతులు, ఎంత పద్దతిగా పూజలు చేశారో చూశారా?

Ranveer Deepika's New House : కొత్తింట్లో అడుగుపెట్టిన ర‌ణ్‌వీర్ - దీపిక దంపతులు, ఎంత పద్దతిగా పూజలు చేశారో చూశారా?

Anasuya: 'నా మాటలను రాజకీయం చేయొద్దు' - నెటిజన్లకు అనసూయ రిక్వెస్ట్!

Anasuya: 'నా మాటలను రాజకీయం చేయొద్దు' - నెటిజన్లకు అనసూయ రిక్వెస్ట్!

Tees Maar Khan Movie Review - తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?

Tees Maar Khan Movie Review - తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?

Wanted PanduGod Review: వాంటెడ్ పండుగాడ్ రివ్యూ: సుధీర్, అనసూయ, సునీల్‌ల పండుగాడు మెప్పించాడా?

Wanted PanduGod Review: వాంటెడ్ పండుగాడ్ రివ్యూ: సుధీర్, అనసూయ, సునీల్‌ల పండుగాడు మెప్పించాడా?

టాప్ స్టోరీస్

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

Ram Charan: రామ్ చరణ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్న ఉపాసన - ఫొటో వైరల్

Ram Charan: రామ్ చరణ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్న ఉపాసన - ఫొటో వైరల్

Google Maps: మీకు కావాల్సిన వాళ్లు ఎక్కడున్నారో తెలుసుకోవాలా? జస్ట్ ఇలా చేస్తే సరిపోతుంది..

Google Maps: మీకు కావాల్సిన వాళ్లు ఎక్కడున్నారో తెలుసుకోవాలా? జస్ట్ ఇలా చేస్తే సరిపోతుంది..

Raashii Khanna: అమ్మ బ్రహ్మ దేవుడో ఎంత గొప్ప సొగసురో- హాట్ ఫోజుల్లో హీట్ పెంచేస్తున్న రాశీ ఖన్నా

Raashii Khanna: అమ్మ బ్రహ్మ దేవుడో ఎంత గొప్ప సొగసురో- హాట్ ఫోజుల్లో హీట్  పెంచేస్తున్న రాశీ ఖన్నా