News
News
X

Aamir Khan: నా సినిమాను బాయ్‌కాట్‌ చేయొద్దు ప్లీజ్ - ఆమిర్ ఖాన్ ఆవేదన

తన సినిమాపై జరుగుతోన్న నెగెటివ్ ప్రచారంపై ఆమిర్ ఖాన్ స్పందించారు.

FOLLOW US: 

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ జంటగా.. నాగచైతన్య కీలకపాత్రలో తెరకెక్కిన సినిమా 'లాల్ సింగ్ చద్దా'. అద్వైత్ చందన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆగస్టు 11న విడుదల కానుంది. ఈ సినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాను జోరుగా ప్రమోట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాను బాయ్‌కాట్‌ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ మేరకు సోషల్ మీడియాలో వరుసగా పోస్ట్ లు పెడుతున్నారు. 

తన సినిమాపై జరుగుతోన్న నెగెటివ్ ప్రచారంపై ఆమిర్ ఖాన్ స్పందించారు. తన సినిమాను ఎవరూ బ్యాన్ చేయొద్దని కోరారు. తనపై, తన సినిమాపై వ్యతిరేకంగా ప్రచారం జరుగుతున్నందుకు బాధగా ఉండాలి అన్నారు. తనకు భారతదేశం అంటే ఇష్టం లేదని కొంతమంది మనస్సులో గట్టిగా నాటుకుపోయిందని అన్నారు. ఈ విషయం తనను వేదనకు గురి చేస్తుందని అన్నారు. తనకు ఇండియాపై గౌరవం లేదనే విషయంలో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పారు. తనపై ఇలాంటి ప్రచారాలు జరగడం దురదృష్టకరమని.. దయచేసి తన సినిమాను బ్యాన్ చేయొద్దని ఆమిర్ ఖాన్ కోరారు. 

ఇక ఈ సినిమా టామ్ హాంక్స్ నటించిన 1994 హాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'ఫారెస్ట్ గంప్‌'కి రీమేక్. ఇంతకుముందు అమీర్‌తో కలిసి 'సీక్రెట్ సూపర్‌స్టార్‌' (2017) తీసిన అద్వైత్‌ చందన్‌ ఈ హిందీ వెర్షన్‌ ను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా అమీర్‌ ఖాన్ ప్రొడక్షన్స్‌లో బ్యానర్‌లో రానుంది. ఇందులో కరీనా కపూర్ హీరోయిన్ గా కనిపించనుంది. 'లాల్‌ సింగ్‌ చద్దా' సినిమాకు ఎరిక్‌ రోత్‌, రచయిత అతుల్‌ కులకర్ణి స్క్రీన్‌ప్లే అందించారు.

Also Read: ‘అబ్బా అబ్బా’ సాంగ్.. సుధీర్, దీపిక పిల్లి రొమాన్స్ - రాఘవేంద్రరావు పాటంటే ఆ మాత్రం ఉండాలి

Also Read: హీరో పక్కవాళ్ళ డ్రామా ఎక్కువ, టాలీవుడ్‌లో వివక్ష ఉంది - జయసుధ షాకింగ్ కామెంట్స్

Published at : 01 Aug 2022 07:31 PM (IST) Tags: Aamir Khan Laal Singh Chaddha Boycott Laal Singh Chaddha boycott Bollywood

సంబంధిత కథనాలు

Liger Movie: 'లైగర్' కోసం ఐదు షోలు - క్యాష్ చేసుకోగలరా?

Liger Movie: 'లైగర్' కోసం ఐదు షోలు - క్యాష్ చేసుకోగలరా?

Bhale Manchi Roju: సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర ఆ చానల్‌లోకి రీ-ఎంట్రీ? ఇదిగో ప్రూఫ్!

Bhale Manchi Roju: సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర ఆ చానల్‌లోకి రీ-ఎంట్రీ? ఇదిగో ప్రూఫ్!

Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు 

Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు 

ఆస్కారం ఉందా? మొన్న RRR, నిన్న ‘శ్యామ్ సింగరాయ్’, ఆస్కార్ బరిలో ఇండియన్ మూవీస్, నిజమెంత?

ఆస్కారం ఉందా? మొన్న RRR, నిన్న ‘శ్యామ్ సింగరాయ్’, ఆస్కార్ బరిలో ఇండియన్ మూవీస్, నిజమెంత?

Bimbisara Collections: 'బింబిసార' 13డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - బాక్సాఫీస్ షేక్!

Bimbisara Collections: 'బింబిసార' 13డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - బాక్సాఫీస్ షేక్!

టాప్ స్టోరీస్

iPhone 14: ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ తేదీ లీక్ - నెల కూడా లేదుగా!

iPhone 14: ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ తేదీ లీక్ - నెల కూడా లేదుగా!

Harish Rao : అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ? - షెకావత్‌కు హరీష్ కౌంటర్ !

Harish Rao :  అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ?  -  షెకావత్‌కు హరీష్ కౌంటర్ !

WhatsApp New Feature: వాట్సాప్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను మళ్లీ చూడొచ్చు.. ఎలాగో తెలుసా?

WhatsApp New Feature: వాట్సాప్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను మళ్లీ చూడొచ్చు.. ఎలాగో తెలుసా?

Tirumala Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, ఈ నెల 22న సెప్టెంబర్ కోటా టికెట్లు విడుదల

Tirumala Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, ఈ నెల 22న సెప్టెంబర్ కోటా టికెట్లు విడుదల