‘అబ్బా అబ్బా’ సాంగ్: సుధీర్, దీపిక పిల్లి రొమాన్స్ - రాఘవేంద్రరావు పాటంటే ఆ మాత్రం ఉండాలి
‘వాంటెడ్ పండుగాడ్’ సినిమా నుంచి మరో పాట రిలీజైంది. ఇందులో దీపిక పిల్లి, విష్ణు ప్రియ అందాలు ఆరబోశారు.
సునీల్, అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రల్లో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రం ‘వాంటెడ్ పండుగాడ్’ (Wanted PanduGod). ‘పట్టుకుంటే కోటి’ అనేది ఈ సినిమా ఉపశీర్షిక. దీన్ని బట్టే మీకు ఈ సినిమా కథేంటో అర్థమైపోయి ఉంటుంది. ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న సినిమా మొత్తాన్ని కె.రాఘవేంద్రరావే పర్యవేక్షిస్తున్నారు. శ్రీధర్ సీపాన దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రంలో సుడిగాలి సుధీర్, దీపిక పిల్లి జంటగా నటించారు. వెన్నెల కిశోర్‌కు జోడీగా విష్ణు ప్రియా, సప్తిగిరి సరసన నిత్యశెట్టి, శ్రీనివాస్ రెడ్డికి జంటగా వసంతి నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టీజర్ కూడా విడుదలైంది. చూస్తుంటే.. ఈ చిత్రంలో టైటిల్ పాత్రను సునీల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అతడిని పట్టుకోవడం కోసం ఇతర పాత్రదారులంతా అడవిబాట పడతారు. ఈ చిత్రంలో దాదాపు అంతా కమెడియన్స్, యాంకర్సే ఉన్నారు.
తాజాగా ఈ సినిమా నుంచి ‘‘అబ్బా అబ్బా..’’ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటలో దీపిక పిల్లి, విష్ణు ప్రియ, వసంతి, నిత్యశెట్టిలు అందాలు ఆరబోశారు. ఈ చిత్రానికి పీఆర్ సంగీతం, లిరిక్స్ అందించారు. ఈ పాటను హారిక నారాయణ్, శ్రీకృష్ణ ఆలపించారు. ఈ చిత్రం ఆగస్టు 19న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో ఇంకా ఆమని, తణికెళ్ల భరణి తదితరులు నటిస్తున్నారు. సాయిబాబా కోవెలమూడి, వెంకట్ కోవెలమూడి నిర్మాతలు.
View this post on Instagram
Also Read: ఫ్యాట్ టు ఫిట్, 88 నుంచి 75 కేజీల వరకూ - నందమూరి కళ్యాణ్ రామ్ కష్టం అంతా ఇంతా కాదు
Also Read: హీరో పక్కవాళ్ళ డ్రామా ఎక్కువ, టాలీవుడ్‌లో వివక్ష ఉంది - జయసుధ షాకింగ్ కామెంట్స్