Project K: మీకు టైమ్ సెన్స్ లేదా? వైజయంతి మూవీస్‌పై ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం
‘ప్రాజెక్ట్ కె’ నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయడానికి టైమ్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. అయితే అనుకున్న సమాయానికి అప్డేట్ రాలేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ మేకర్స్ పై మండిపడుతున్నారు.
ప్రస్తుతం ఇండియాలో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ లలో ‘ప్రాజెక్ట్’ కె ఒకటి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ మూవీకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. దీపికా పదుకోణ్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీ పై దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన ప్రచార చిత్రాలు మూవీపై హైప్ ను క్రియేట్ చేశాయి. అయితే మూవీ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ మూవీ అప్డేట్ లను ఇవ్వడంలో కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే మాట ఇప్పుడు ఎక్కువగా వినిపిపస్తుంది. అనౌన్స్మెంట్ లు డేట్, టైమ్ ఇచ్చి సమయానికి అప్డేట్ లు ఇవ్వకుండా అభిమానుల ఆగ్రహానికి గురవుతుందీ సంస్థ.
‘మీకు టైమ్ సెన్స్ లేదా’ అని మండిపడుతోన్న ఫ్యాన్స్..
‘ప్రాజెక్ట్ కె’ మూవీను ఎనౌన్స్ చేసినప్పటి నుంచీ మూవీ అప్డేట్ ల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు ప్రభాస్ అభిమానులు. జులై 19 న మూవీలో ప్రభాస్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తామని ప్రకటించారు మేకర్స్. అందుకోసం ప్రత్యేకంగా టైమ్ ను కేటాయించారు. జులై 19 మధ్యాహ్నం 01.23.45.67 PM అంటూ మిల్లి సెకన్లతో సహా టైమ్ ను ఫిక్స్ చేశారు. తీరా ఆ సమయంల వచ్చేసరికి ‘కొంచెం టైమ్ పడుతుంది డార్లింగ్స్’ అంటూ మళ్లీ ఓ పోస్ట్ ను షేర్ చేసింది మూవీ టీమ్. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కు చిర్రెత్తుకొచ్చింది. సోషల్ మీడియాలో వైజయంతి మూవీస్ ను ఓ రేంజ్ ట్రోల్ చేస్తున్నారు. ‘ఈ మాత్రం దానికి మిల్లి సెకన్ల తోపాటు టైమ్ ను చెప్పడం ఎందుకు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇటీవలే హీరోయిన్ దీపికా పదుకోణ్ ఫస్ట్ లుక్ ను కూడా ఇలాగే లేట్ చేశారు. ఇప్పుడు ప్రబాస్ ఫస్ట్ లుక్ ను కూడా లేట్ చేయడంతో ‘మీకు టైమ్ సెన్స్ లేదా వైజయంతి మూవీస్’ అంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జులై 20 న ‘ప్రాజెక్ట్ కె’ ఫస్ట్ గ్లింప్స్..
‘ప్రాజెక్ట్ కె’ మూవీ నుంచి అప్డేట్ ల కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా మూవీ స్టోరీ ఎంటీ అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. ఇది సైన్స్ ఫిక్షన్ మూవీ అని ముందు నుంచీ చెబుతున్నా దాన్ని ఎలా తీసుకున్నారు, ఏంటా కథ అనే దానిపై ఆసక్తి నెలకొంది. అందుకే మూవీ గ్లింప్స్, టీజర్, ట్రైలర్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే మూవీకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ను అమెరికాలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు మేకర్స్. జులై 20 న అమెరికాలోని డల్లాస్ లో శాన్ డియాగో కామిక్ కాన్ లో ఈ వేడుక జరగనుంది. ఇక జులై 21 న ఇండియా గ్లింప్స్ రాబోతోంది. ఇప్పటికే మూవీ టీమ్ ప్రభాస్, కమలహాసన్, దీపికా పదుకొణే, నాగ్ అశ్విన్, చిత్ర నిర్మాతలు అమెరికా బయలుదేరారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి కూడా. ఇక ఈ మూవీను హాలీవుడ్ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
'K'oncham late avtundi darlings 😍 all good things take time. #ProjectK
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 19, 2023
Also Read: నిర్మాతగా 'బాహుబలి' సేతుపతి - ఈసారి కొత్త హీరో హీరోయిన్లతో!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial