By: ABP Desam | Updated at : 06 Feb 2022 04:09 PM (IST)
(Image credit: Instagram)
ప్రముఖ హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లతా మంగేష్కర్ మరణం పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. అందులో పవన్ కళ్యాణ్ గానకోకిల తుది శ్వాస విడిచారననే వార్త తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని తెలిపారు. ఆమె మరణం భారతీయ సినీ సంగీతానికి తీరని లోటుగా అభివర్ణించారు. అనారోగ్యం నుంచి కోలుకుని ఇంటి వెళ్లారని విని స్వస్థత చేకూరిందని అనుకున్నానని తెలిపారు. కానీ ఇలా విషాద వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని అన్నారు. లతాజీ పాటలు భాషతో సంబంధం లేకుండా విన్న వారిందరినీ మంత్రముగ్ధులను చేస్తాయని అన్నారు. తెలుగులో ఆమె పాడిన పాటలు చాలా తక్కువే అయినా మరిచిపోలేనివని కొనియాడారు పవన్ కళ్యాణ్. 70 ఏళ్లుగా సాగుతున్న ఆమె పాటల ప్రయాణం, బాల్యం నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఆమె నిలిచిన తీరు స్పూర్దిదాయకమని అన్నారు. లతాజీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు పవన్ కళ్యాణ్.
లతా మంగేష్కర్ వయసు ఇప్పుడు 92 ఏళ్లు. ఆమె 1929లో ఇండోర్లో జన్మించారు. ఆమె అసలు హేమ మంగేష్కర్. అయిదుగురి పిల్లల్లో పెద్దకూతురు. ఆమెకు ముగ్గురు చెల్లెళ్లు. ఒక తమ్ముడు. 13 ఏళ్లకే తండ్రి గుండె పోటుతో మరణించడంతో చాలా కష్టాలు పడింది లతా కుటుంబం. అందుకే చిన్న వయసులోనే సినిమాల్లో నటించడం, పాడడం మొదలుపెట్టారు లతా. 1942లో మొదలుపెట్టిన ఆమె కళా ప్రయాణం ఇప్పటి వరకు సజీవంగా సాగుతూనే ఉంది. ఇప్పుడు లతాజీ భౌతికంగా మరణించినా, ఆమె పాటల రూపంలో అభిమానుల చెవుల్లో వినిపిస్తూనే ఉంటారు.
Also read: లతా మంగేష్కర్ పెళ్లి ఎందుకు చేసుకోలేదు? ఆ క్రికెటర్‌తో ప్రేమే కారణమా?
ఇప్పటి వరకు 980 సినిమాల్లో లతా పాటలు పాడారు. దాదాపు ఆ పాటల సంఖ్య 50 వేలకు పైనే ఉంటాయి. చెల్లెలు ఆశా భోంస్లేను కూడా తన దారిలోనే నడిచించారు లతాజీ. వీరి కుటుంబం సినీ సంగీత ప్రపంచానికి చేసిన మేలు ఎంతో. 2001లోనే భారతరత్న అందుకున్నారు. పద్మ భూషణ్, పద్మ విభూషణ్ కూడా గతంలోనే అందుకున్నారు. ఇక ఫ్రాన్స్ ప్రభుత్వం ద లీజియన్ ఆఫ్ హానర్ పురస్కారంతోనూ సత్కరించింది. ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కూడా అందుకున్నారు.
పవన్ కల్యాణ్‌తో పాటు ఎంతోమంది ప్రముఖులు కూడా లతా మంగేష్కర్‌కు నివాళులు అర్పించారు.
Koo App”It is often the biggest smile hiding the saddest heart!” I could feel #Asha Ji’s sense of loss of her beloved sister through her sad smile! For me too it was thereputic to talk to her about #LataDidi. We shared some smiles and some tears. 🙏💔😍 #Sisters #LataMangeshkar #AshaBhonsle #Legends #Music - Anupam Kher (@anupampkher) 6 Feb 2022
Also read: ఒకరిది కోయిల గానం, మరొకరిది తేనెలొలికే తియ్యదనం, రెండూ కలిస్తే!
Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్
Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?
Chiranjeevi Cancer : నేనూ క్యాన్సర్ బారిన పడ్డాను - మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు
Guppedanta Manasu Rishi Re-Entry: జైల్లోంచి విడుదలైన రిషి - మూడేళ్లలో ఏం జరిగింది - మరింత ఇంట్రెస్టింగ్ గా 'గుప్పెడంతమనసు'
ఒడిశా రైలు ప్రమాదంపై టాలీవుడ్ సినీ ప్రముఖుల దిగ్భ్రాంతి - రక్తదానం చేయాలని అభిమానులకు చిరు పిలుపు
Chandrababu Delhi Tour: ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాతో ముగిసిన చంద్రబాబు భేటీ - పొత్తు కుదురుతుందా?
Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!
PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ
ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!
Whatsapp: వాట్సాప్ ఛాటింగ్ ఇంతకు ముందులా ఉండదు - ఎందులో మార్పులు జరుగుతున్నాయో తెలుసా?