అన్వేషించండి

Lee Sun Kyun: ఆస్కార్ విన్నింగ్ ‘పారాసైట్’ మూవీ నటుడు అనుమానాస్ప‌ద మృతి, కారులో డెడ్ బాడీ లభ్యం

Lee Sun Kyun: ప్రముఖ సౌత్ కొరియన్ నటుడు లీ సున్ కున్ అనుమానాస్ప‌ద రీతిలో చనిపోయాడు. అతడి మృతదేహాన్ని పోలీసులు ఓ కారులో గుర్తించారు.

Parasite Actor Lee Sun Kyun Found Dead: పలు విభాగాల్లో ఆస్కార్ అవార్డులు అందుకున్న కొరియన్ మూవీ ‘పారాసైట్’. ఈ మూవీలో నటించిన యాక్టర్ లీ సున్ కున్ చనిపోయారు. 48 ఏళ్ల వయసున్న ఆయన అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెందారు. సెంట్ర‌ల్ సియోల్‌ లో ఓ పార్క్ దగ్గర ఉన్న కారులో ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అయితే, ఆయన ఆత్మహత్య చేసుకున్నారా? లేదంటే ఎవరైనా హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

డ్రగ్స్ కేసు విచారణ ఎదుర్కొంటున్న లీ

వాస్తవానికి నటుడు లీ సున్‌ డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు. ఓ బార్ ఉద్యోగితో కలిసి ఆయన డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు, తను ఇంటి దగ్గర కూడా చాలా సార్లు డ్రగ్స్ తీసుకున్నట్లు ఓ మహిళ పోలీసులుకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అక్టోబ‌ర్ నుంచి డ్ర‌గ్ కేసులో విచార‌ణ జ‌రుగుతోంది. ఈ వార్తలను లీ పలుమార్లు తోసిపుచ్చారు. తాను ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని వెల్లడించారు. అవసరం అయితే, డ్రగ్స్ పరీక్షలు కూడా చేసుకోవచ్చని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో నార్కోటిక్స్ నిపుణులు ఆయనకు డ్రగ్స్ టెస్ట్ నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆయనకు నెగెటివ్ అని తేలింది.

గత కొంత కాలంగా డిప్రెషన్ లో లీ

అటు లీ డ్రగ్స్ తీసుకున్నాడనే ఆరోపణలు రావడంతో ఆయన కెరీర్ కు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆయన నటిస్తున్న పలు టీవీ షోల నుంచి కూడా తొలగించారు. ఈ నేపథ్యంలోనే  గత కొంత కాలంగా ఆయన డిప్రెషన్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. చేయని తప్పుకు దోషిగా చూస్తున్నారనే అనుమానంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు పలువురు భావిస్తున్నారు. పోలీసు విచారణలో అసలు వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. సౌత్ కొరియాలో డ్రగ్స్ తీసుకోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తారు. ఎవరైనా విదేశాలకు వెళ్లి డ్రగ్స్ తీసుకుని వచ్చినా, సౌత్ కొరియాకు రాగానే విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది.  ఒకే వేళ నేరం రుజువు అయితే, సుమారు 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ప్రేమ వివాహం, ఇద్దరు పిల్లలు

నటుడు హీరో లీ కున్ కు వివాహం అయ్యింది.  న‌టి జియోన్ హై జిన్‌ను ఆయన ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. 2001లో ‘లవర్స్‌’ అనే టీవీ షో ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. దాదాపు రెండు ద‌శాబ్ధాల నుంచి లీ కున్ యాక్టింగ్ కేరీర్‌లో కొన‌సాగుతున్నారు. ఎన్నో సినిమాలు, టీవీ షోలలో అతడు నటించారు.. 2010  తర్వాత ఆయన బాగా పాపులర్ అయ్యారు. ఆయన 2019లో నటించిన ‘పారాసైట్‌’ చిత్రం దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు పొందింది. అంతేకాదు, ఈ సినిమా ఉత్తమ విదేశీ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సినిమా, ఉత్తమ స్క్రీన్‌ప్లే విభాగాల్లో ఆస్కార్‌ అవార్డులను అందుకుంది. లీ చివరగా ఈ ఏడాది ‘స్లీప్‌’ అనే సినిమాలో నటించారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Fact Check: రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
Chennai rape Case: చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
Embed widget