అన్వేషించండి

అది గతం, ఆలోచిస్తూ కూర్చోకూడదు - ‘రానా నాయుడు’ విమర్శలపై స్పందించిన వెంకటేష్

వెంకటేష్, రానా కలిసి నటించిన 'రానా నాయుడు' ఎంత హిట్ అయిందో, అదే స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి. ఈ విమర్శలపై తాజాగా స్పందించిన వెంకటేష్.. ఫస్ట్ సీజన్ కొందరిపై ప్రభావం చూపింది నిజమేనని చెప్పారు.

Venkatesh: దగ్గుబాటి హీరోలు వెంకటేష్, రానా కలిసి నటించిన సిరీస్ 'రానా నాయుడు'. హాలీవుడ్ సిరీస్ 'రే డొనోవన్' కి అఫీషియల్ అడాప్షన్ గా తెరకెక్కిన ఈ సిరీస్.. యాక్షన్ క్రైమ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సిరీస్ పూర్తి అడల్ట్ కంటెంట్ తో అలరించింది. ఇక ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న విక్టరీ వెంకటేష్ ను ఈ సిరీస్ లో ప్రేక్షకులు అలా చూడలేకపోయారు. దీంతో ఆయన పలు విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ విమర్శలపై తాజాగా ఆయన స్పందించారు. 

'రానా నాయుడు' సిరీస్ పై వచ్చిన నెగెటివ్ కామెంట్స్ పై వెంకటేష్ స్పందించారు. ఇటీవల అభిరామ్ నటించిన అహింసా ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొన్న వెంకటేష్... 'రానా నాయుడు’కు అభిమానుల నుంచి చాలా ఫీడ్‌బ్యాక్స్ వచ్చాయన్నారు. నెట్‌ఫ్లిక్స్ షో పట్ల చాలా సంతోషంగా ఉందని చెప్పారు. "రానా నాయుడుకి వచ్చిన రెస్పాన్స్ కి నెట్‌ఫ్లిక్స్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. అయితే మీరన్న ఫీడ్ బ్యాక్ మా వరకు వచ్చింది. అది గతం, అయిపోయింది. దాని గురించి ఆలోచిస్తూ కూర్చోవడం కన్నా ముందుకు సాగడమే మంచిదని నేను నమ్ముతాను. నెక్స్ట్ సీజన్ అందరికీ నచ్చేలా తెరకెక్కిస్తాం. అయినా అందరూ ఎళ్లవేళలా ఇతరుల్ని మెప్పించలేరు కదా. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. కొన్ని సిరీస్ లు ఒక్కొక్కరిపై ఒక్కోలా ప్రభావం చూపిస్తాయి. అలాగే ఫస్ట్ సీజన్ తో పోలిస్తే కొన్ని సన్నివేశాలు, వాటిని తీసిన విధానం ప్రభావం చూపిన మాట వాస్తవమే. కానీ మొదటి సీజన్ తో పోలిస్తే రెండో సీజన్ ను ప్రేక్షకులు కచ్చితంగా ఇష్టపడతారు, ఆదరిస్తారు. అందుకే ఇప్పుడు సెకండ్ సీజన్ లో మళ్ళీ అటువంటి ఫీడ్ బ్యాక్ రాకుండా సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. ఈసారి ప్రతి ఒక్క ఆడియన్స్ కి ఈ సిరీస్ నచ్చుతుంది’’ అని వెంకీ భావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు.

నంది అవార్డులపై..

గత కొన్ని రోజులుగా కొంత మంది సినీ ప్రముఖులు నంది అవార్డులపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా వెంకటేష్ కూడా నంది అవార్డులు ఇవ్వాలా, వద్దా అన్న అంశంపై స్పందించారు. అవార్డుల గురించి తాను ఎక్కువగా ఆలోచించనని ఆయన చెప్పారు. కానీ అవార్డులు ఇస్తే మాత్రం ప్రతీ నటుడికీ ప్రోత్సాహంగా ఉంటుందని వెంకటేష్ అభిప్రాయపడ్డారు.

వెంకటేష్, తన మేనల్లుడు రానా దగ్గుబాటి మొదటి స్ర్కీన్ స్పేస్ ను పంచుకుని తీసిన రానా నాయుడు OTTలో అరంగేట్రం చేసింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో ఈ క్రైమ్ డ్రామా, సిరీస్ విడుదలైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎనలేని ప్రశంసలు పొందిన గ్యాంగ్‌స్టర్ డ్రామా మీర్జాపూర్ దర్శకులు సుపర్ణ్ వర్మ, కరణ్ అన్షుమాన్ లు ఈ రానా నాయుడు సిరీస్ స్క్రిప్ట్ ను సృష్టించారు. ఈ సిరీస్ లో వెంకటేష్, రానాలతో పాటు సుర్వీన్ చావ్లా,  సుచిత్రా పిళ్లై కూడా కీలక పాత్రల్లో కనిపించారు.

Read Also : ఫ్రెండ్స్ కోసం ప్రభాస్ కీలక నిర్ణయం - యూవీ క్రియేషన్స్‌‌కు నష్టాల నుంచి ఊరట

టాప్ హెడ్ లైన్స్

Mayasabha Series : పొలిటికల్ థ్రిల్లర్ 'మయసభ' న్యూ రికార్డ్ - ఇండియాలోనే ఫస్ట్ తెలుగు సిరీస్...
పొలిటికల్ థ్రిల్లర్ 'మయసభ' న్యూ రికార్డ్ - ఇండియాలోనే ఫస్ట్ తెలుగు సిరీస్...
The Odyssey OTT : రెండు ఓటీటీల్లో న్యూ వరల్డ్ 'ది ఒడిస్సీ' – 16 వేల కోట్ల రికార్డ్ మూవీ తెలుగులోనూ చూడొచ్చు
రెండు ఓటీటీల్లో న్యూ వరల్డ్ 'ది ఒడిస్సీ' – 16 వేల కోట్ల రికార్డ్ మూవీ తెలుగులోనూ చూడొచ్చు
Aadarsha Kutumbam OTT : ఆదర్శ కుటుంబం ఓటీటీ రిలీజ్ డేట్ - వెంకీ త్రివిక్రమ్ మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఆదర్శ కుటుంబం ఓటీటీ రిలీజ్ డేట్ - వెంకీ త్రివిక్రమ్ మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Romantic Drama OTT : ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ సడన్ స్ట్రీమింగ్ - 3 కోట్లు పెడితే 150 కోట్లు వచ్చాయ్... తెలుగులోనూ చూడొచ్చు
ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ సడన్ స్ట్రీమింగ్ - 3 కోట్లు పెడితే 150 కోట్లు వచ్చాయ్... తెలుగులోనూ చూడొచ్చు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cyclone Akvan Update: దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
US Military Aircraft Attack: గొడ్డలితో రూ.560 కోట్ల అమెరికా సైనిక విమానం ధ్వంసం.. ఐర్లాండ్‌ ఎయిర్‌పోర్టులో కలకలం!
గొడ్డలితో రూ.560 కోట్ల అమెరికా సైనిక విమానం ధ్వంసం.. ఐర్లాండ్‌ ఎయిర్‌పోర్టులో కలకలం!
LeT Commander Encounter: వీడియో కాల్ చేసినా వినలేదు.. మసీదులో దాక్కున్న లష్కరే టెర్రరిస్ట్ లతీఫ్ భట్ హతం
వీడియో కాల్ చేసినా వినలేదు.. మసీదులో దాక్కున్న లష్కరే టెర్రరిస్ట్ లతీఫ్ భట్ హతం
Indiramma Kutumba Jeevitha Bima: కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
Siddipet Politics: సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
FIVA Award: భారత్‌లో కార్ల విప్లవానికి నాంది పలికిన Maruti 800.. గ్లోబల్ అవార్డు అందుకున్న తొలి భారతీయ కారు!
కామన్‌మ్యాన్‌ తొలి కారు మారుతి 800 గుర్తుందిగా.. ఇప్పుడు ఈ కారుకు ప్రతిష్టాత్మక గ్లోబల్‌ అవార్డ్‌
Morne Morkel Comments: తొలి టెస్ట్ తుది జట్టులో సిరాజ్ చోటుపై సస్పెన్స్.. తుది నిర్ణయం కెప్టెన్  గిల్ చేతిలోనే ఉందన్న బౌలింగ్ కోచ్ 
తొలి టెస్ట్ తుది జట్టులో సిరాజ్ చోటుపై సస్పెన్స్.. తుది నిర్ణయం కెప్టెన్  గిల్ చేతిలోనే ఉందన్న బౌలింగ్ కోచ్ 
కార్తీకమాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకు ఆచరించాలి?
కార్తీకమాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకు ఆచరించాలి?
Embed widget