ఫ్రెండ్స్ కోసం ప్రభాస్ కీలక నిర్ణయం - యూవీ క్రియేషన్స్‌కు నష్టాల నుంచి ఊరట
స్టార్ హీరో ప్రభాస్ గొప్ప మనసును చాటుకుని వార్తల్లోకెక్కారు. తన ఫ్రెండ్స్ నడిపిస్తోన్నయూవీ క్రియేషన్స్ కు భారీ ఉపశమనాన్ని కలిగించాడు. 'ఆదిపురుష్' థియేట్రికల్ రైట్స్‌ను యూవీ క్రియేషన్స్‌కు ఆఫర్ చేశాడు.
UV Creations : తెలుగు సినిమా అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన UV క్రియేషన్స్ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హీరో ప్రభాస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. 'సాహో', 'రాధే శ్యామ్' సినిమాలు యూవీ క్రియేషన్స్‌కు పెద్ద నష్టమే మిగిల్చాయని సమాచారం. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో కలెక్షన్లను రాబట్టకపోవడంతో నిర్మాతలు ఇబ్బందుల్లో పడ్డారు. ఈ క్రమంలో రెబల్ స్టార్ ప్రభాస్.. తన ఫ్రెండ్స్ బ్యానర్‌ను గట్టెక్కించేందుకు డీల్ సెట్ చేసినట్లు తెలుస్తోంది.
'సాహో', 'రాధేశ్యామ్' చిత్రాల ఫ్లాప్‌తో నిరాశలో కూరుకుపోయిన యూవీ క్రియేషన్స్.. ఇప్పుడు సరైన చిత్రం కోసం ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ తన రాబోయే చిత్రం ‘ఆదిపురుష్’ మూవీ తెలుగు థియేట్రికల్ రైట్స్‌ను రెమ్యునరేషన్ కింద తీసుకున్నాడు. ఈ రైట్స్‌ను యూవీ క్రియేషన్స్‌కు ఆఫర్ చేశాడు. ఫలితంగా వారి నష్టాలను రికవరీ చేసుకోమని డైరెక్టుగానే సూచించాడు. నిజానికి ప్రభాస్ ఈ సినిమాకు సంతకం చేసినప్పుడు వాటి విలువ రూ.80 కోట్లు మాత్రమే. కానీ ఇప్పుడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ‘ఆదిపురుష్’ తెలుగు థియేట్రికల్ హక్కులను రూ. 185 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇది యూవీ క్రియేషన్స్‌కు బిగ్ రిలీఫ్ గా మారనుంది.
అంతేకాకుండా యూవీ క్రియేషన్స్ కు సంబంధించిన ఇతర నష్టాలను కూడా ప్రభాస్ రికవరీ చేసుకునేందుకు ప్లాన్ చేశాడు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించనున్న ‘స్పిరిట్’ మూవీలో తమ వాటాను కూడా యూవీ క్రియేషన్స్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ విక్రయించింది. ఇదంతా ప్రభాస్ సమక్షంలోనే జరిగినట్లు తెలుస్తుండగా.. ఈ డీల్‌తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సైతం ఖచ్చితంగా సేఫ్ అవుతుందని ప్రభాస్ హామీ ఇచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. ఇదే కాకుండా.. ప్రభాస్, మారుతి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘రాజా డీలక్స్’ మూవీని కూడా వీళ్లే నిర్మిస్తుండటం మరో చెప్పుకోదగిన విషయం. మొత్తానికి బిగ్ డీల్‌తో తన ఫ్రెండ్స్ ప్రొడక్షన్ హౌస్ యువీ క్రియేషన్స్‌ను ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించి ప్రభాస్ తన గొప్ప మనసు చాటుకున్నాడని పలువురు ప్రశంసిస్తున్నారు. తమ ఫెవరేట్ హీరో చేస్తోన్న మంచి పనికి ఆయన ఫ్యాన్స్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్నా సరే.. తన ఫ్రెండ్స్ యూవీ క్రియేషన్స్ ను గట్టెక్కించడానికి, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడేయడానికి ప్రభాస్ చేస్తోన్న ఈ పనిని కొనియాడుతున్నారు.
Read Also: చెత్త డైలాగులు, గంటల తరబడి ఎదురుచూపులు - ఆ సినిమా అంటే ఇప్పటికీ అసహ్యం: ప్రియాంక చోప్రా
పలు వివాదాస్పద, కాంట్రవర్శియల్ వివాదాల మధ్య తెరకెక్కిన ప్రభాస్ నెక్స్ట్ చిత్రం ‘ఆదిపురుష్’ మూవీ జూన్ 16న విడుదల కానుంది. ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను... జూన్ 6వ తేదీన తిరుపతిలో నిర్వహించనున్నారు. ఈ గ్రాండ్ ఈవెంట్ కోసం ప్రభాస్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురు చేస్తున్నారు.