అన్వేషించండి

Dune Prophecy: టబుకు హాలీవుడ్ ఆఫర్ - పాపులర్ ఇంగ్లీష్ సిరీస్‌లో ఇండియన్ యాక్ట్రెస్

ఇండియన్ స్టార్ హీరోయిన్ టబు ప్రతిష్టాత్మక వెబ్ సిరీస్ లో కీలక పాత్ర పోషిస్తోంది. అమెరికన్ సిరీస్ ‘డ్యూన్: ప్రొఫెసీ’లో సిస్టర్ ఫ్రాన్సెస్కా గా నటించబోతున్నట్లు ఓ పాపులర్ మ్యాగజైన్ రాసుకొచ్చింది.

Tabu in 'Dune: Prophecy' Series: అందం, అభినయంతో భారతీయ సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటీమణి టబు. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించింది. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. తన అద్భుత నటనకు గాను ఎన్నో అవార్డులు రివార్డులు అందుకుంది. ఐదు పదుల వయసున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పటికీ సినిమా పరిశ్రమలో రాణిస్తోంది. సినిమాలే కాదు, వెబ్ సిరీస్ లలోనూ నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.  

‘డ్యూన్: ప్రొఫెసీ’లో కీలక పాత్ర పోషిస్తున్న టబు

పాపులర్ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ ‘డ్యూన్: ప్రాఫెసీ’లో కీలక పాత్ర పోషించబోతోంది టబు. ఈ విషయాన్ని వెరైటీ మ్యాగజైన్ వెల్లడించింది. టబు ఈ వెబ్ సిరీస్ లో సిస్టర్ ఫ్రాన్సెస్కా గా కనిపించనున్నట్లు రాసుకొచ్చింది. ఈ అమెరికన్ వెబ్ సిరీస్ లో టబు పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నట్లు తెలిపింది. ఒకప్పుడు చక్రవర్తి ప్రియురాలిగా ఉన్న ఆమె, తిరిగి రాజ భవనానికి రావడంతో అక్కడి పరిస్థితులు ఎలా మారాయో ఈ వెబ్ సిరీస్ లో చూపించనున్నట్లు తెలుస్తోంది.    

త్వరలో షూటింగ్ ప్రారంభం

ఇక ఈ వెబ్ సిరీస్ డెనిస్ విల్లెనెయువ్స్ తెరకెక్కించిన ‘డ్యూన్’కి ప్రీక్వెల్ గా రాబోతోంది. ఈ సిరీస్ ను 2019లోనే ‘డూన్: ది సిస్టర్‌ హుడ్’ పేరుతో ప్రకటించారు. ఈ సిరీస్ బ్రియాన్ హెర్బర్ట్, కెవిన్ జే ఆండర్సన్ రచించిన సిస్టర్‌హుడ్ ఆఫ్ డ్యూన్ నవల ఆధారంగా తెరకెక్కుతోంది.  ప్రముఖ రచయిత ఫ్రాంక్ హెర్బర్ట్ క్రియేట్ చేసిన డ్యూన్ వరల్డ్ లోనే ఈ సిరీస్ ను కూడా నిర్మిస్తున్నారు. మనిషి జాతిని నాశనం చేసే శక్తులతో హర్కోనెన్ సిస్టర్స్ ఎలాంటి పోరాటం చేస్తారు? అనేది ‘డ్యూన్: ప్రాఫెసీ’లో చూపించనున్నారు. మాక్స్‌ లో ఈ సిరీస్‌ అందుబాటులోకి రానుంది. త్వరలో చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇందులో ఎమిలీ వాట్సన్, ఒలివియా విలియమ్స్, ట్రావిస్ ఫిమ్మెల్, మార్క్ స్ట్రాంగ్, జేడ్ అనౌకా, క్రిస్ మాసన్, జోధి మే, జోష్ హ్యూస్టన్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘డ్యూన్: ప్రాఫెసీ’లో సిస్టర్ ఫ్రాన్సిస్కా పాత్రలో టబు  కనిపించనుంది.  ఈ సిరీస్ కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

‘డ్యూన్’ యూనివర్స్ నుంచి వచ్చిన రెండు సినిమాలు హిట్

ఇప్పటికే ‘డ్యూన్’ యూనివర్స్ నుంచి ఇప్పటికే సినిమాలు వచ్చాయి. ‘డ్యూన్: పార్ట్ 1’, ‘డ్యూన్: పార్ట్ 2’గా రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ ఏడాది మార్చిలోనే ‘డ్యూన్ 2’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రెండు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు ఇదే యూనివర్స్ నుంచి ‘డ్యూన్: ప్రాఫెసీ’ అనే వెబ్ సిరీస్ రాబోతోంది.  ఇందులో టబు కీలక పాత్ర పోషించడంతో పాటు ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతోంది. అంతేకాదు, కొన్ని ఎపిసోడ్లకు ఆమె దర్శకత్వం వహించినట్లు తెలుస్తోంది.

అటు రీసెంట్ గా విడుదలైన ‘క్రూ’ సినిమాలో టబు కీలక పాత్ర పోషించింది. కరీనా కపూర్, కృతి సనన్ తో కలిసి ఆమె కీలక పాత్ర సోషించింది. ఇందులో ఆమె నటనకు ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వారు.  ప్రస్తుతం అజయ్ దేవగన్ తో కలిసి ‘ఔరో మే కహా దమ్ థా’ అనే సినిమాలో నటిస్తోంది.  

Read Also: పాపం యాంకర్... పొలిటికల్ పబ్లిసిటీకి పోయి కెరీర్ రిస్క్ చేసిందా? ఇప్పుడు ఫీలైతే ఎలా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Southern states: దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
Bumrah Record Alert: బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 85 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 85 మంది మృతి
Pawan Kalyan OG: పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern states: దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
Bumrah Record Alert: బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 85 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 85 మంది మృతి
Pawan Kalyan OG: పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
BRS MLC Kavitha: జైలు నుంచి వచ్చాక తొలిసారి ఇందూరుకు కవిత, గజమాలతో బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం
జైలు నుంచి వచ్చాక తొలిసారి ఇందూరుకు కవిత, గజమాలతో బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం
Telangana Income: కాంగ్రెస్ పాలన తొలి ఏడాదిలోనే ఖజానాకు తగ్గిన ఆదాయం - బీఆర్ఎస్‌ చేతికి మరో అస్త్రం
కాంగ్రెస్ పాలన తొలి ఏడాదిలోనే ఖజానాకు తగ్గిన ఆదాయం - బీఆర్ఎస్‌ చేతికి మరో అస్త్రం
Nitish Family Photo With Kohli: కోహ్లీతో సెల్ఫీ దొరకలేదనే కసితో మొదలై.. తన ఫ్యామిలీతోనే విరాట్ ఫొటో దిగేలా ఎదిగిన నితీశ్.. వాట్ ఏ జర్నీ
కోహ్లీతో సెల్ఫీ దొరకలేదనే కసితో మొదలై.. తన ఫ్యామిలీతోనే విరాట్ ఫొటో దిగేలా ఎదిగిన నితీశ్.. వాట్ ఏ జర్నీ
Venkatesh: వెంకటేష్ వారసుడు వస్తున్నాడోచ్... సినిమాల్లోకి వచ్చేందుకు అర్జున్ దగ్గుబాటి రెడీ
వెంకటేష్ వారసుడు వస్తున్నాడోచ్... సినిమాల్లోకి వచ్చేందుకు అర్జున్ దగ్గుబాటి రెడీ
Embed widget