(Source: ECI/ABP News/ABP Majha)
Save The Tigers: ఇండియా వైడ్ ట్రెండింగ్ అవుతున్న టైగర్స్ - మూడో సీజన్ వర్క్ షురూ!
Mahi V Raghav's Save The Tigers franchise became a binge watch: దర్శకుడు మహి వి రాఘవ్ షో రన్నర్‌గా చేసిన వెబ్ సిరీస్ 'సేవ్ ది టైగర్స్' రెండు సీజన్లు ఇండియా టాప్ 3 లిస్టులో చేరింది.
Save The Tigers 2 Streaming Records: ఓటీటీల్లో విజయం సాధించాలంటే... వెబ్ సిరీస్‌లకు వ్యూవర్షిప్ రావాలంటే... అడల్ట్ కంటెంట్ తప్పనిసరి ఏమో అని అటు ఇండస్ట్రీ జనాలు, ఇటు సామాన్య ప్రజలు అనుకుంటున్న తరుణంలో ఆ అభిప్రాయం తప్పని నిరూపించిన సిరీస్ 'సేవ్ ది టైగర్స్'. ప్రియదర్శి పులికొండ, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ మెయిన్ లీడ్ రోల్స్ చేసిన ఆ సిరీస్ తెలుగు ప్రేక్షకుల్ని విపరీతంగా నవ్వించింది. మిగతా భాషల్లో అనువదించగా... అక్కడి ప్రేక్షకుల్ని సైతం ఆకట్టుకుంది. దానికి సీక్వెల్ 'సేవ్ ది టైగర్స్ 2' కూడా రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది.
డిస్నీలో సత్తా చాటిన 'సేవ్ ది టైగర్స్'
మార్చి 15న 'సేవ్ ది టైగర్స్ 2' వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో విడుదల అయ్యింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ట్రెండింగ్‌లో ఉంది. ఫస్ట్ సీజన్ అంతా కామెడీ హైలైట్ అయితే... 'సేవ్ ది టైగర్' సీజన్ 2లో కామెడీతో పాటు ఎమోషన్స్ కూడా హైలైట్ అయ్యాయి. ఫస్ట్ సీజన్‌లో కపుల్స్ మధ్య కామెడీని ఎంజాయ్ చేశారంతా! అయితే, ఈ సెకండ్ సీజన్ యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను సైతం మరింత ఆకట్టుకుంటోంది. డిస్నీలో సత్తా చాటిందీ సిరీస్.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో ప్రజెంట్ టాప్ ట్రెండింగ్ అవుతున్న తెలుగు షోస్ చూస్తే... టాప్ 2లో ఉంది. ఇండియా వైడ్ చూస్తే... సేవ్ ది టైగర్స్ & సేవ్ ది టైగర్స్ 2 కలిపి టాప్ 3లో ఉన్నాయి. విడుదలైన మూడు వారాల తర్వాత కూడా 'సేవ్ ది టైగర్స్ 2' ట్రెండింగ్ పొజిషన్‌లో ఉండటం... రెండు సీజన్లు కలిపి ఆల్ ఓవర్ ఇండియాలో ఏ ఓటీటీలో చూసినా టాప్ 3లో నిలవడం విశేషం. మొత్తం మీద ఈ టైగర్స్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ షోగా నిలిచింది.
ఇండియా వ్యాప్తంగా ఉన్న ఓటీటీ వేదికల్లో వచ్చిన రీసెంట్ వెబ్ సిరీస్‌లలో 'సేవ్ ది టైగర్స్' & 'సేవ్ ది టైగర్స్ 2' టాప్ 3 పొజిషన్‌లో నిలబడటంతో షో రన్నర్ మహి వి రాఘవ్ సంతోషం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ... ''సేవ్ ది టైగర్స్'ను దేశ వ్యాప్తంగా ఉన్న వీక్షకులు అందరూ చూసి ఇంత పెద్ద విజయాన్ని అందించటం చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. హిట్ సినిమా లేదా సిరీస్ సీక్వెల్ అంటే చాలా అంచనాలు ఉంటాయి. మా టైగర్స్ అంచనాలు అందుకుంది. అంతే కాదు... రెండు సీజన్స్ ఇంత పెద్ద విజయాన్ని సాధించడం సాధారణమైన విషయం కాదు. వైవాహిక జీవితంలో భార్యాభర్తలు ఎదుర్కొనే పరిస్థితులు, మానవ సంబంధాలను ఆధారంగా చేసుకుని సిరీస్ చేస్తే మంచి విజయం తప్పకుండా వస్తుందని రెండు సీజన్లు ప్రూవ్ చేశాయి. వినోదాత్మక వెబ్ షోలను ప్రేక్షకులు ఆదరిస్తారని, కుటుంబ చిత్రాల తరహాలో భావిస్తారని నమ్మకం కుదిరింది'' అని చెప్పారు. 'సేవ్ ది టైగర్స్'కు ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ఆయన థాంక్స్ చెప్పారు.
'సేవ్ ది టైగర్స్ 3' వర్క్ షురూ!
'సేవ్ ది టైగర్స్', 'సేవ్ ది టైగర్స్ 2'... రెండు సీజన్లు భారీ విజయం సాధించడంతో పాటు వాటికి వచ్చిన స్పందన చూసి మూడో సీజన్ వర్క్ స్టార్ట్ చేశారు. ప్రజెంట్ స్క్రిప్టింగ్ స్టేజిలో ఉంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. జూన్ నుంచి 'సేవ్ ది టైగర్స్' సీజన్ 3 సెట్స్ మీదకు వెళుతుందని తెలిసింది. ఒక వైపు సినిమాలు, మరో వైపు వెబ్ షోలు సక్సెస్ అవుతుండటంతో మహి వి రాఘవ్ ఔత్సాహిక రచయితలు, దర్శకులకు ఆహ్వానం పలికారు. తమకు స్క్రిప్ట్స్, కొత్త ఆలోచనలను పంపాలని త్రీ ఆటమ్ లీవ్స్ నిర్మాణ సంస్థ కోరింది.
Also Read: ఫ్యామిలీ స్టార్ రివ్యూ: విజయ్ దేవరకొండ సినిమా హిట్టా? ఫట్టా?