ఓటీటీలో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోన్న రణ్ వీర్, అలియా భట్ రీసెంట్ హిట్ - ఎక్కడంటే?
రణవీర్ సింగ్, ఆలియా భట్ జంటగా నటించిన రీసెంట్ సూపర్ హిట్ మూవీ 'రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని' తాజాగా ఓటీటీ ల్లోకి వచ్చేసింది. శుక్రవారం నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది.
బాలీవుడ్ స్టార్స్ రణవీర్ సింగ్ కపూర్, ఆలియా భట్ జంటగా ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ'(Rocky Aur Rani Ki Pream Kahaani) మూవీ ఇటీవల థియేటర్స్ లో విడుదలై బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ కలెక్షన్స్ అందుకున్న విషయం తెలిసిందే. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహార్, అపూర్వ మెహతా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. రొమాంటిక్ లవ్, కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీ జూలై 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదలై మిశ్రమ స్పందనను అందుకుంది. రివ్యూలు కూడా నెగిటివ్ గానే వచ్చాయి. కానీ సినిమాలో రణవీర్, ఆలియా కెమిస్ట్రీకి ఆడియన్స్ ఫిదా అయిపోయారు.
దీంతో టాక్ తో ఎటువంటి సంబంధం లేకుండా కలెక్షన్స్ పరంగా మాత్రం సూపర్ హిట్ అందుకుంది. బాక్సాఫీస్ వద్ద ఫుల్ రన్ లో ఈ చిత్రానికి సుమారు రూ 200కోట్లకు కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చాలా గ్యాప్ తర్వాత నిర్మాత కరణ్ జోహార్ దర్శకుడిగా ఈ సినిమాను తెరకెక్కించడం విశేషం. దర్శకుడిగా కరణ్ జోహార్ తెరకెక్కించిన చివరి చిత్రం 'ఏ దిల్ హై ముష్కిల్' 2016 లో విడుదలైంది. మళ్లీ ఏడేళ్ల గ్యాప్ తర్వాత మెగా ఫోన్ పట్టి 'రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ దర్శకుడు. ఇక తాజాగా ఈ మూవీ సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని' స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ ను ఆమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ముందుగా సెప్టెంబర్ 9న ప్రైమ్ వీడియోలో రెంటల్ విధానంలో ఓటీటీ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి తెచ్చారు. రూ.349 రూపాయలు చెల్లించి ఈ సినిమాని చూడాలని ప్రైమ్ వీడియో కండిషన్ పెట్టింది. కానీ ఇప్పుడు ఫ్రీగా ప్రైమ్ మీడియాలో కేవలం హిందీ భాషలో మాత్రమే ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. మరో విశేషం ఏంటంటే ఈ సినిమాలోని కొన్ని డిలీటెడ్ సీన్స్ ని జోడించి మరి ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నారు.
దీంతో 'రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని' మూవీ రన్ టైం పది నిమిషాలు పెరిగినట్లు తెలుస్తోంది. 'గల్లీ బాయ్' సినిమా తర్వాత రణవీర్ - ఆలియా కలిసి నటించిన ఈ చిత్రంలో ధర్మేంద్ర, జయ బచ్చన్, షబానా అజ్మీ, తోట రాయ్ చౌదరి, అమీర్ బషీర్, చుర్నీ గంగూలీ, అంజలి ఆనంద్ కీలకపాత్రలు పోషించగా ప్రీతన్ చక్రవర్తి సంగీతం అందించారు. ఈ మూవీతో మంచి సక్సెస్ అందుకున్న రణవీర్, ఆలియా బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం రణ్ వీర్ 'డాన్ 3' లో నటిస్తుండగా, ఆలియా భట్ 'జీలే జరా', సినిమాతో పాటు సల్మాన్ ఖాన్ తో మరో సినిమా చేస్తున్నట్లు సమాచారం.
Also Read : సైలెంట్‌గా ఓటీటీ లోకి వచ్చేసిన 'బెదురులంక 2012' - స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial