News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Bedurulanka 2012 OTT: సైలెంట్‌గా ఓటీటీ లోకి వచ్చేసిన 'బెదురులంక 2012' - స్ట్రీమింగ్ ఎక్కడంటే?

రీసెంట్ గా థియేటర్స్ లో మంచి కమర్షియల్ సక్సెస్ అందుకున్న కార్తికేయ 'బెదురులంక 2012' మూవీ తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

FOLLOW US: 
Share:

'ఆర్ఎక్స్ 100' హీరో కార్తికేయ రీసెంట్ గా నటించిన 'బెదురులంక 2012' సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ఓటీటీ రిలీజ్ కు సంబంధించి మూవీ టీం ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా,  ప్రమోషన్స్ కూడా చేయకుండా సినిమాని ఓటీటీ లోకి వదిలారు. ఈ మేరకు శుక్రవారం రోజున ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ మీడియాలో 'బెదురులంక 2012' స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చేసింది. ఫన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాతో క్లాక్స్ టాలీవుడ్ కి కరెక్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఆగస్టు 25న థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ మూవీ కమర్షియల్ గా మంచి సక్సెస్ అందుకుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమాలో కార్తికేయ సరసన నేహా శెట్టి కథానాయికగా నటించగా.. అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్య ప్రధాన పాత్రలు పోషించారు.

లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రవీంద్ర బెనర్జీ ముప్ప నేని ఈ చిత్రాన్ని నిర్మించగా, మణిశర్మ సంగీతం అందించారు. సినిమాలో కామెడీ, ఫ్రెష్ కంటెంట్ కి ప్రేక్షకులు ఎంతగానో కనెక్ట్ అయ్యారు. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. కేవలం నాలుగు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో థియేటర్స్ లో రిలీజ్ అయిన 'బెదురులంక 2012' బాక్స్ ఆఫీస్ వద్ద రూ.7 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి నిర్మాతలకు లాభాల్ని అందించింది. చాలాకాలం తర్వాత కార్తికేయ ఈ సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్నాడు. అయితే థియేటర్స్ లో విడుదలై నెల రోజులు కాకముందే 'బెదురులంక 2012' ఓటీటీ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రావడం గమనార్హం.

ఎందుకంటే ఈమధ్య థియేటర్లో కమర్షియల్ గా సక్సెస్ అయిన మూవీస్ ని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో కాస్త ఆలస్యంగా రిలీజ్ చేస్తున్నారు. కానీ థియేటర్లో కమర్షియల్ గా సక్సెస్ అయిన 'బెదురంక 2012' మాత్రం ముందుగానే ఓటీటీలోకి వచ్చేసింది. దీని వెనక కారణం ఏంటో తెలియకపోయినా ఈ చిత్రం త్వరగా ఓటీటీలోకి వచ్చిందనే విషయం తెలిసి.. ప్రేక్షకులు పండగ చేసుకుంటున్నారు. 'బెదురులంక 2012’ మూవీని థియేటర్లో ఎవరైనా మిస్ అయి ఉంటే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి.

ఇక 'బెదురులంక 2012' కథ విషయానికొస్తే.. 2012లో యుగాంతం పుకార్ల కారణంగా బెదురులంక అనే ఊరి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతూ ఉంటారు. ఆ ఊరి ప్రజల్లోని భయం, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని భూషణం (అజయ్ ఘోష్) అనే లీడర్ ఊరిని దోచుకోవాలని ప్లాన్ చేస్తాడు. అతని పన్నాగాన్ని శివ (కార్తికేయ) ఎలా ఎదిరించాడు? ఈ క్రమంలో అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఊరి ప్రెసిడెంట్ కూతురు చిత్ర తో (నేహా శెట్టి) శివ ప్రేమాయణం ఎలా మొదలైంది? అన్నదే 'బెదురులంక 2012' మూవీ కథ. సినిమాలో కామెడీ తో పాటు అంతర్లీనంగా ఆడియన్స్ కి ఓ చిన్న మెసేజ్ ను ఇస్తూ డైరెక్టర్ క్లాస్ ఈ సినిమాని చాలా బాగా తెరకెక్కించారు.

Also Read : మరో సర్వైవల్ మిస్టరీ థ్రిల్లర్ తో రాబోతున్న త్రిష - తల్లి పాత్రలో అదరగొట్టిందిగా, 'ది రోడ్' ట్రైలర్ చూశారా?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 22 Sep 2023 03:04 PM (IST) Tags: Karthikeya Neha Shetty Bedurulanka 2012 Movie Bedurulanka 2012 Bedurulanka 2012 OTT Realese

ఇవి కూడా చూడండి

Aishwarya Abhishek Bachchan: అభిషేక్, ఐశ్వర్య విడాకులు తీసుకోనున్నారా? అమితాబ్ బచ్చన్ పోస్ట్‌కు అర్థం ఏమిటీ?

Aishwarya Abhishek Bachchan: అభిషేక్, ఐశ్వర్య విడాకులు తీసుకోనున్నారా? అమితాబ్ బచ్చన్ పోస్ట్‌కు అర్థం ఏమిటీ?

Tripti Dimri: నా తల్లిదండ్రులు అలా అన్నారు - ‘యానిమల్’లోని ఇంటిమేట్ సీన్స్‌కు పేరెంట్స్ రియాక్షన్ బయటపెట్టిన తృప్తి

Tripti Dimri: నా తల్లిదండ్రులు అలా అన్నారు - ‘యానిమల్’లోని ఇంటిమేట్ సీన్స్‌కు పేరెంట్స్ రియాక్షన్ బయటపెట్టిన తృప్తి

Naga Chaitanya: మా తాత మాట నిజమయ్యింది, నా చిన్నప్పుడే అలా చెప్పేశారు: నాగ చైతన్య

Naga Chaitanya: మా తాత మాట నిజమయ్యింది, నా చిన్నప్పుడే అలా చెప్పేశారు: నాగ చైతన్య

Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!

Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!

Devil Movie: ‘డెవిల్’ కోసం కళ్యాణ్‌రామ్‌కు 90 స్పెషల్ కాస్ట్యూమ్స్‌ - ఇటలీ నుంచి తెప్పిన మోహైర్ ఊల్‌తో!

Devil Movie: ‘డెవిల్’ కోసం కళ్యాణ్‌రామ్‌కు 90 స్పెషల్ కాస్ట్యూమ్స్‌ - ఇటలీ నుంచి తెప్పిన మోహైర్ ఊల్‌తో!

టాప్ స్టోరీస్

Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం

Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం

MCRHRD Become CM Camp Office: సీఎం క్యాంప్‌ ఆఫీసు మార్చే యోచనలో రేవంత్ రెడ్డి- మర్రి చెన్నారెడ్డి భవనంలోకి వెళ్తారా!

MCRHRD Become CM Camp Office: సీఎం క్యాంప్‌ ఆఫీసు మార్చే యోచనలో రేవంత్ రెడ్డి-  మర్రి చెన్నారెడ్డి భవనంలోకి వెళ్తారా!

మూడు వేల కిలోమీటర్ల మైలురాయి చేరిన లోకేష్ పాదయాత్ర- 20న భోగాపురంలో ముగింపు సభ

మూడు వేల కిలోమీటర్ల మైలురాయి చేరిన లోకేష్ పాదయాత్ర- 20న భోగాపురంలో ముగింపు సభ

Jharkhand CM: జార్ఖండ్ సీఎంకు ఈడీ నోటీసులు - ఆరోసారి సమన్లు పంపిన అధికారులు

Jharkhand CM: జార్ఖండ్ సీఎంకు ఈడీ నోటీసులు - ఆరోసారి సమన్లు పంపిన అధికారులు