News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

మరో సర్వైవల్ మిస్టరీ థ్రిల్లర్ తో రాబోతున్న త్రిష - తల్లి పాత్రలో అదరగొట్టిందిగా, 'ది రోడ్' ట్రైలర్ చూశారా?

కోలీవుడ్ హీరోయిన్ త్రిష నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ది రోడ్' ట్రైలర్ ని గురువారం మేకర్స్ విడుదల చేశారు. సర్వైవల్ మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్ర ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

FOLLOW US: 
Share:

చెన్నై బ్యూటీ త్రిష తన సెకండ్ ఇన్నింగ్స్ లో తెగ బిజీగా ఉంది. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. తమిళ, మలయాళ భాషల్లో కలిపి ఈ అమ్మడి చేతిలో అరడజనుకు పైగా ప్రాజెక్టులు ఉన్నాయి. ఇటీవల 'పొన్నియన్ సెల్వం'తో మంచి సక్సెస్ అందుకుంది త్రిష. విజువల్ వండర్ గా తెరకెక్కిన మణిరత్నం డ్రీం ప్రాజెక్టులో చోళ యువరాణి కుందవై పాత్రలో తన అందంతోపాటు నటనతోనూ ఆకట్టుకుంది. ప్రస్తుతం తమిళంలో అగ్ర హీరోల సరసన నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే దళపతి విజయ్ సరసన 'లియో' వంటి మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.

'లియో' కంటే ముందే త్రిష 'ది రోడ్'(The Road) అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సర్వైవల్ మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ ట్రైలర్ గురువారం రిలీజ్ కాగా సస్పెన్స్, థ్రిల్లింగ్ మూమెంట్స్ తో ఆకట్టుకునేలా ట్రైలర్ ఉంది. ట్రైలర్ ని గమనిస్తే.. ఏం జరిగింది ఎందుకు జరిగింది అంటూ త్రిష డైలాగ్ చెప్పడంతో టైలర్ ఆసక్తికరంగా మొదలైంది. ఆ తర్వాత ఓ దారుణమైన ఆక్సిడెంట్ ను ట్రైలర్ లో చూపించారు. ఎన్ హెచ్ 44లో పర్టికులర్ జోన్ లోనే యాక్సిడెంట్స్ తరచుగా జరుగుతున్నాయని త్రిష చెప్పడం ట్రైలర్లో మరింత ఎంగేజింగ్ గా ఉంది. ఆ మిస్టరీ ని సాల్వ్ చేయడం కోసం త్రిష సాగించిన పోరాటం నేపథ్యంలో 'ది రోడ్' మూవీ ఉండనున్నట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతుంది.

ట్రైలర్ చివర్లో త్రిషపై తెరకెక్కించిన యాక్షన్ సీక్వెన్స్ కూడా అదిరిపోయింది. అంతేకాదు ఈ మూవీలో త్రిష తల్లి పాత్రలో కనిపించబోతున్నట్లు ట్రైలర్ చివరలో చూపించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ట్రైలర్ ని చూసిన ఫ్యాన్స్ ఈ మూవీతో త్రిష కి మరో హిట్ గ్యారెంటీ అని కామెంట్స్ చేస్తున్నారు. అక్టోబర్ 6న తమిళం తో పాటు తెలుగు, కన్నడ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. అరుణ్ వశీగరణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మొదటిసారి త్రిష తల్లి పాత్ర పోషిస్తుండడంతో ఈ సర్వైవల్ థ్రిల్లర్ పై ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెరిగింది. త్రిష తో పాటు సంతోష్ ప్రతాప్, షబ్బీర్, కల్లారక్కాల్ ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్నారు.

వీరితోపాటు మియా జార్జ్, ఎంఎస్ భాస్కర్, వివేక్ ప్రసన్న, వేల్ రామమూర్తి, లక్ష్మీ ప్రియ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. సామ్ CS సంగీతమందిస్తున్నారు. ఈ సినిమాతో పాటు తమిళంలో అజిత్ తో 'విదా మయార్చి', మలయాళం లో మోహన్ లాల్ తో 'రామ్' వంటి సినిమాల్ల్ నటిస్తోంది త్రిష. ఇక దళపతి విజయ్ తో నటిస్తున్న 'లియో' దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల కాబోతోంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంజయ్ దత్, అర్జున్ సర్జ, మన్సూర్ అలీ ఖాన్ వంటి అగ్ర నటీనటులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత విజయ్ కి జోడిగా త్రిష నటిస్తుండడంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read : పిచ్చికుక్కలా అరిచిన యావర్- పవర్ అస్త్ర కోసం ఫిటింగ్ పెట్టిన బిగ్ బాస్

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 22 Sep 2023 01:32 PM (IST) Tags: Thrisha Acctress Thrisha ‘The Road’ Trailer ‘The Road’ Movie Thrisha's ‘The Road’ Trailer

ఇవి కూడా చూడండి

Lokesh Kanagaraj Fight Club : ఫైట్​క్లబ్​తో వస్తున్న లోకేశ్ కనగరాజ్.. డైరక్టర్​గా మాత్రం కాదు

Lokesh Kanagaraj Fight Club : ఫైట్​క్లబ్​తో వస్తున్న లోకేశ్ కనగరాజ్.. డైరక్టర్​గా మాత్రం కాదు

Sandeep Reddy Vanga : ‘స్పిరిట్’ విడుదల తేదీని రివీల్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా!

Sandeep Reddy Vanga : ‘స్పిరిట్’ విడుదల తేదీని రివీల్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా!

Ram Charan: ‘ఓటు’ కోసం షూటింగ్ ఆపేసిన చరణ్, ఇంటికి తిరుగు ప్రయాణం

Ram Charan: ‘ఓటు’ కోసం షూటింగ్ ఆపేసిన చరణ్, ఇంటికి తిరుగు ప్రయాణం

Mahesh Babu Animal Trailer: ‘యానిమల్’లో రణబీర్‌కు బదులు మహేష్ నటిస్తే, ఇదిగో ఇలా ఉంటుందట, డీప్ ఫేక్ వీడియో వైరల్

Mahesh Babu Animal Trailer: ‘యానిమల్’లో రణబీర్‌కు బదులు మహేష్ నటిస్తే, ఇదిగో ఇలా ఉంటుందట, డీప్ ఫేక్ వీడియో వైరల్

Rules Ranjann: ‘రూల్స్ రంజన్’ ఓటీటీ అప్డేట్ - ఎప్పుడు, ఎక్కడ రిలీజ్ అంటే?

Rules Ranjann: ‘రూల్స్ రంజన్’ ఓటీటీ అప్డేట్ - ఎప్పుడు, ఎక్కడ రిలీజ్ అంటే?

టాప్ స్టోరీస్

Telangana Election Polling Updates: తెలంగాణలో ఓట్ల జాతర- 7 గంటలకే పోలింగ్ కేంద్రాల వద్ద బార్లు

Telangana Election Polling Updates: తెలంగాణలో ఓట్ల జాతర- 7 గంటలకే పోలింగ్ కేంద్రాల వద్ద బార్లు

Telangana Assembly Election 2023: వెల్లివిరిసిన ఓటుస్వామ్యం- ఒటెత్తిన ప్రజానీకం

Telangana Assembly Election 2023: వెల్లివిరిసిన ఓటుస్వామ్యం- ఒటెత్తిన ప్రజానీకం

Hyderabad Poll Queue Status: హైదరాబాద్ ఓటర్లకు గుడ్ న్యూస్, క్యూ లైన్లో ఎందరున్నారో ఇలా చెక్ చేసుకోండి

Hyderabad Poll Queue Status: హైదరాబాద్ ఓటర్లకు గుడ్ న్యూస్, క్యూ లైన్లో ఎందరున్నారో ఇలా చెక్ చేసుకోండి

Telangana Elections: హైదరాబాద్ లో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం, ముగ్గురు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు!

Telangana Elections: హైదరాబాద్ లో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం, ముగ్గురు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు!