Manjummel Boys: 'మంజుమ్మెల్ బాయ్స్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడు, ఎక్కడంటే?
Manjummel Boys: 2024 మలయాళం సినిమాకి మహర్దశ అనే చెప్పాలి. ఈ ఏడాది రిలీజైన సినిమాలు దాదాపు అన్ని హిట్ కొట్టాయి. దాంట్లో ఒకటే 'మంజుమ్మెల్ బాయ్స్'. తెలుగులో కూడా రిలీజైంది ఈ సినిమా.
Manjummel Boys Streaming In Disney + Hot star: మలయాళం సినిమా ఇండస్ట్రీకి 2024 కలిసొచ్చిందనే చెప్పాలి. ఈ ఏడాదిలో రిలీజైన దాదాపు అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. రికార్డు కలెక్షన్లు కూడా సాధించాయి చాలా సినిమాలు. వాటిల్లో ఒకటే 'మంజుమ్మెల్ బాయ్స్' సినిమా. ఈ సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేశారు. ఇక మలయాళం, తెలుగులో సినిమాకి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. చాలామంది ఈ సినిమా ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడిక సినిమా ఓటీటీ డేట్ వచ్చింది.
స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ ?
'మంజుమ్మెల్ బాయ్స్' తెలుగు వర్షన్ మే 5న డిస్నీ + హాట్ స్టార్ లో కానుంది. ఈ విషయాన్ని డిస్నీ + హాట్ స్టార్ అధికారికంగా ప్రకటించింది. తన ఇన్ స్టాలో ట్రైలర్ ని పోస్ట్ చేసింది. మంజుమ్మెల్ యాక్షన్‌ను మిస్ అవ్వొద్దు అంటూ క్యాప్షన్ రాశారు. ఇక ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
స్టోరీ ఏంటంటే?
నిజ జీవిత సంఘటన ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో దీన్ని తీశారు. కేరళకు చెందిన కొంతమంది ఫ్రెండ్స్ ట్రిప్‌కు వెళ్తారు. కొడైకెనాల్ లో కొన్ని గుహలను చూసేందుకు బయలుదేరతారు వాళ్లంతా. వాటినే గుణ గుహలు అంటారు. కమల్ హాసన్ నటించిన ‘గుణ’ సినిమాలో కనిపించిన గుహలే అవి. అయితే, ఆ ట్రిప్ కి వెళ్లిన వాళ్లలో ఒక వ్యక్తి మిస్ అవుతాడు. గుహలో పడిపోతాడు. అతని కోసం మిగతా వాళ్లంతా వెతుకుతారు. అయితే, అవి చాలా ప్రమాదకర గుహలు అని అక్కడి వాళ్లంతా చెప్తారు. అక్కడ పడిన వాళ్లు ఎవ్వరూ బయటికి రాలేదు. అయినప్పటీకీ ఫ్రెండ్ కోసం సాహసం చేస్తారు మిగతావాళ్లు. మరి వాళ్ల ప్రయత్నం ఫలించిందా? పడిన వ్యక్తి బతికి బయటికి వచ్చాడా? లేడా అనేది సినిమా. ఈ సినిమాకి ఫ్రెండ్స్ బాగా కనెక్ట్ అవుతారు. ఫ్రెండ్ షిప్ గురించే ఈ సినిమా అంతా అని తెలుస్తుంది.
తక్కువ బడ్జెట్ తో ఎక్కువ లాభాలు..
'మంజుమ్మెల్ బాయ్స్' తక్కువ బడ్జెట్ తో తీసిన సినిమా. అయితే, ఈ సినిమాకి కలెక్షన్స్ మాత్రం ఓ రేంజ్ లో వచ్చాయి. తెలుగులో కూడా ఈ సినిమాకి బాగానే కలెక్షన్స్ వచ్చాయి. రూ.5 కోట్లు ఖర్చు చేస్తే రూ.200 కోట్ల గ్రాస్ దాటింది ఈ సినిమా. దీంతో మైత్రీ మూవీ మేకర్స్.. సినిమాని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఏప్రిల్ 6న తెలుగులో థియేటర్లలో రిలీజ్ అయ్యింది ఈ సినిమా. చిదంబర్ పి పొందువేల్ ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. సౌబిన్ షశీర్, శ్రీనాథ్ భాసీ, బాలు వర్గీస్, గణపతి, లాల్, దీపక్ ప్రమబోల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇక మలయాళంలో ఈ ఏడాది రిలీజై సంచలనం సృష్టించిన 'ప్రేమలు'. అది ఇప్పటికే ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే.
Also Read: బాల్యంలో విలాసవంతమైన జీవితం గడపలేదు, రోజూ 6 గంటలే నిద్ర: సమంత