Samantha: బాల్యంలో విలాసవంతమైన జీవితం గడపలేదు, రోజూ 6 గంటలే నిద్ర: సమంత
Samantha: ప్రస్తుతం మూవీస్ కి బ్రేక్ ఇచ్చిన సమంత.. తన అభిమానులతో మాత్రం టచ్ లోనే ఉంటున్నారు. యూట్యూబ్ లో పాడ్ కాస్ట్ సిరీస్ నిర్వహిస్తున్నారు. దాంట్లో భాగంగా ఆమె కొన్ని విషయాలు పంచుకున్నారు.
Samantha About Childhood in Her Podcast: మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సమంత కొన్ని రోజులు సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. అయితే, అభిమానులతో మాత్రం ఆమె టచ్ లోనే ఉంటున్నారు. సోషల్ మీడియా ద్వారా ఆమె అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నారు. ఇక దాంట్లో భాగంగానే ఈ మధ్యే ఆమె యూట్యూబ్ వేదికగా ఒక పాడ్ కాస్ట్ ప్రారంభించారు. దాంట్లో తనకు సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటున్నారు సమంత. అయితే, ఇటీవల రిలీజ్ చేసిన 20వ పాడ్ కాస్ట్ లో సమంత తన చిన్నతనం గురించి మాట్లాడారు. చిన్నతనంలో లగ్జరీగా బతకలేదని అన్నారు. ఇంకా చాలా విషయాలు చెప్పారు.
13 ఏళ్లు అవిశ్రాంతంగా పనిచేశాను..
ఈ ఎపిసోడ్ లో సమంత.. ఒక సిచ్యుయేషన్ లో హ్యూమన్ బాడీ ఫైట్ చేస్తుందా లేదా ఫ్లైట్ చేస్తుందా అనే దాని గురించి వెల్ నెస్ కోచ్ తో కలిసి మాట్లాడారు. "అలసట, విశ్రాంతి అవసరం అనేది బలహీనతకు సంకేతంగా నేను నమ్ముతాను. నేను కేవలం ఆరు గంటలే నిద్రపోతాను. రోజంతా కష్టపడతాను. అలా చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. అలసిపోయినట్లు అనిపించినప్పటికీ.. నేను దానిని అంగీకరించను. ఎందుకంటే 13 ఏళ్లుగా నేను విరామం లేకుండా అవిశ్రాంతంగా పనిచేస్తున్నాను’’ అని తెలిపింది.
విలాసవంతమైన జీవితం గడపలేదు..
"చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడూ విలాసవంతమైన జీవితం గడపలేదు. బాల్యం నుంచి నా దృష్టి విజయమే. జీవితంలో దేన్నైనా సాధించానే తపనతో చాలా ఒత్తిడిని అనుభవించాను. ఇది నాకు సరిపోదు ఇంకా సక్సెస్ కావాలి అనే భావనతో తపించాను. అదే నా సక్సెస్‌కు ప్రేరణగా మారింది. గ్లామరస్‌గా నటిస్తే జనాలు తొందరగా యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటారు అందరూ. నేను ‘పుష్ప’లో ఐటమ్ సాంగ్ చేసినప్పుడు అదే అనుకున్నారు అందరూ. కానీ, అది అవాస్తవం. అలా చేయడం శ్రమంతో కూడుకున్నది. ఒత్తిడితో కూడుకున్నది. ప్రత్యేకించి నిరంతం ప్రజల దృష్టిలో, స్పాట్ లైట్ లో ఉండేవాళ్లకి అది చాలా కష్టం. నేను సినీ పరిశ్రమకి కేవలం 22 - 23 ఏళ్ల మధ్యలో వచ్చాను. కొంతమంది ఇంకా చిన్న వయసులో వస్తారు. అయితే, ఇక్కడికి వచ్చేముందు ప్రతీది తెలుసుకుని రండి. మనల్ని జడ్జ్ చేసేందుకు ఇతరులను అనుమతిస్తాము ఇక్కడ. నా కెరీర్ లో నేను విజయం సాధించినప్పుడు నేను దాన్ని కోల్పోతానేమో అని భయపడ్డాను. అందుకే, తర్వాత సక్సెస్ కోసం వెతుకున్నాను. కాబట్టి నేను ఫైట్ లేదా ఫ్లైట్ మోడ్ లో ఉన్నానని నమ్ముతాను" అని తన గురించి తాను చెప్పుకున్నారు సమంత.
చివరిగా 'ఖుషి'లో
అనారోగ్యం కారణాల వల్ల ప్రస్తుతానికి బ్రేక్ ఇచ్చారు సమంత. చివరిగా విజయ్ దేవరకొండతో కలిసి 'ఖుషి' లో నటించారు. ఇక ప్రస్తుతానికి ఆమె వరుణ్ ధావన్ తో కలిసి ఆమె నటించిన వెబ్ సిరీస్ 'సిటడెల్' పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఆ సిరీస్ రిలీజ్ కానుంది.
Also Read : 'వకీల్ సాబ్' మళ్లీ వచ్చేస్తున్నాడు - రీరిలీజ్ ఎప్పుడంటే?