VakeelSaab Re Release: 'వకీల్ సాబ్' మళ్లీ వచ్చేస్తున్నాడు - రీరిలీజ్ ఎప్పుడంటే?
VakeelSaab : రీ రిలీజ్ ల మేనియా కొనసాగుతూనే ఉంది. ప్రేక్షకుల నుంచి కూడా ఆదరణ లభిస్తుంది. దీంతో మళ్లీ సినిమాలు రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పుడిక 'వకీల్ సాబ్' మళ్లీ వస్తున్నాడు.
VakeelSaab Re Release In Theaters: ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో అంతా రీ రిలీజ్ ల మేనియా నడుస్తోంది. ఎన్ని కొత్త సినిమాలు వస్తున్నాయో, అన్ని రీ రిలీజ్ లు అవుతున్నాయి. ఇక ప్రేక్షకులు కూడా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ ఆ సినిమాలను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. తమ అభిమాన హీరో వింటేజ్ యాక్టింగ్‌ను, వింటేజ్ లుక్‌ని మరోసారి తెరపై చూసేందుకు ఎగబడుతున్నారు. ఇప్పటికే చాలా సినిమాలు రీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. త్వరలో పవన్ కల్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' సినిమా రీ రిలీజ్ కాబోతోంది.
ఎప్పుడంటే?
2021, ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది 'వకీల్ సాబ్'. పవన్ కల్యాణ్ లాయర్ గా నటించిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. వెంకటేశ్వర్ క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు దీన్ని ప్రొడ్యూస్ చేశారు. ఇక ఇప్పుడు ఈ సినిమాని మరోసారి రిలీజ్ చేయనున్నారు. మే 1న రీ రిలీజ్ చేస్తున్నట్లు వెంకటేశ్వర క్రియేషన్స్ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. "పవన్ కల్యాణ్ అద్భుతమైన నటనను, ఆయన స్వాగ్‌ను మరోసారి థియేటర్ల లో సెలబ్రేట్ చేసుకుందాం" అంటూ ట్వీట్ చేశారు.
Let's celebrate Powerstar @PawanKalyan's unshackled form of action and swag in theatres once again🔥🔥#VakeelSaab Re Release in theatres on May 1st🌟💥#VakeelSaabReRelease #SriramVenu #DilRaju @shrutihaasan @i_nivethathomas @yoursanjali @AnanyaNagalla @MusicThaman… pic.twitter.com/EaJ4PNXwV6
— Sri Venkateswara Creations (@SVC_official) April 27, 2024
'పింక్' రీమేక్..
పవన్ కల్యాణ్, శృతిహాసన్ జంటగా నటించిన సినిమా వకీల్ సాబ్. అనన్య నాగెళ్ల, అంజలి, నివేద థామస్ ప్రధాన పాత్రలు పోషించారు. హిందీలో సూపర్ హిట్ సినిమా 'పింక్' రీమేక్ వకీల్ సాబ్. అయినప్పటికీ మన నేటివిటీకి తగ్గట్లుగా కొన్ని సీన్లు మార్చి తీశారు ఈ సినిమాని. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. తమన్ మ్యూజిక్ అందించారు. అయితే, ఈ సినిమాలో పవన్ కల్యాణ్ ఒక పవర్ ఫుల్ లాయర్ గా నటించిన విషయం తెలిసిందే. సినిమాలో కోర్టు సీన్లు చాలా కీలకం. కోర్టు సీన్ లో పవన్ కల్యాణ్ చెప్తున్న డైలాగులకి థియేటర్లు దద్దరిల్లి పోయాయి. ఇక ఇప్పుడు కూడా ఆ రచ్చే మళ్లీ రిపీట్ అంటున్నారు ఫ్యాన్స్. ఈ మేరకు కామెంట్లు పెడుతున్నారు.
అప్పుడు నో.. ఇప్పుడు ఎస్..
రీ రిలీజ్ అవుతున్న చాలా సినిమాల్లో అప్పుడు సరిగ్గా ఆడనివి ఇప్పుడు రికార్డులు సృష్టిస్తున్నాయి. చాలా సినిమాలను అప్పట్లో రిజక్ట్ చేసిన ప్రేక్షకులు ఇప్పుడు వాటికి బ్రహ్మరథం పడుతున్నారు. 'ఆరెంజ్', 'జాని', 'ఓయ్' లాంటి సినిమాలకి కలెక్షన్లు అనుకోని రీతిలో వచ్చాయి. తెలుగులో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. 'హ్యాపీడేస్' సినిమాని కూడా ఇటీవల రిలీజ్ చేశారు మేకర్స్. దానికి కూడా మంచి స్పందన లభించింది. ఈ మధ్య ఈ రీ రిలీజ్ ల ట్రెండ్ మిగతా భాషల్లో కూడా కొనసాగుతుండగా.. 'ఒక్కడు' తమిళ రీమేక్ 'గిల్లి' సినిమా దాదాపు రూ.10 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. టైటానిక్, అవతార్ తదితర సినిమాల రీ రిలీజ్ రికార్డులను బద్దలు కొట్టింది.
Also Read: కేశవ క్యారెక్టర్ సుహాస్ చేయాల్సింది.. బన్నీ ఎప్పుడూ ఇతడి గురించే చెప్తాడు: డైరెక్టర్ సుకుమార్