ఎండలను తట్టుకోకపోతే ఈ హిల్ స్టేషన్లకు ట్రిప్ వేయండి ఉత్తర భారతదేశంలో ఆరు హిల్ స్టేషన్లు ఉన్నాయి. ఇవి చల్లని వాతావరణం, సుందరమైన అందాలకు ప్రసిద్ధి. సిమ్లా..ఫేమస్ హిల్ స్టేషన్, ఆహ్లాదకరమైన వాతావరణం, అద్భుతమైన పర్వతాలు చూస్తుంటే మనస్సుకు హాయిగా ఉంటుంది. మే నెలలో ఎండలను తట్టుకోలేకపోతే ఈ హిల్ స్టేషన్లకు ట్రిప్ వేయాల్సిందే. మనాలి...మంచుతో కప్పబడిన పర్వతశిఖరాలు, దట్టమైన లోయలు, సాహసకార్యకలాపాలకు చాలా ఫేమస్. నైనానిటాల్..నైనా పీక్, స్నో వ్యూ పాయింట్ ప్రదేశాల నుంచి బోటింగ్, షాపింగ్ కోసం బెస్ట్ హిల్ స్టేషన్ క్వీన్ ఆఫ్ హిల్స్ అని పిలిచే ముస్సోరి పచ్చదనం, జలపాతాలు, డూన్ వ్యాలీ ఒక్కసారి వెళ్తే మళ్లీ వెళ్లాలనిపిస్తుంది. దలైలామా నివాసంగా ప్రసిద్ధి చెందిన ధర్మశాల చుట్టూ దట్టమైన అడవులు, పర్వతాలు, మఠాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. శ్రీనగర్ వేసవి స్వర్గధామం వంటిది. దాల్ సరస్సు, మొఘల్ పర్వతాలు, హౌస్ బోట్స్ కు ఫేమస్.