Sukumar About Suhas: కేశవ క్యారెక్టర్ సుహాస్ చేయాల్సింది.. బన్నీ ఎప్పుడూ ఇతడి గురించే చెప్తాడు: డైరెక్టర్ సుకుమార్
Sukumar About Suhas: 'పుష్ప' సినిమాలో కేశవ క్యారెక్టర్.. ఎంత ఫేమస్ అయ్యిందో మనకు తెలుసు. అయితే, ఆ క్యారెక్టర్ చేయాల్సింది హీరో సుహాస్ అట. ఈ విషయాన్ని డైరెక్టర్ సుకుమార్ స్వయంగా చెప్పారు.
Sukumar About Suhas At Prasanna Vadanam Trailer Launch Event :'పుష్ప' సినిమాలో కేశవ క్యారెక్టర్ అందరికీ బాగా కనెక్ట్ అయ్యింది. హీరో పక్కనే ఉంటూ కామెడీ చేసే ఫుల్ లెంత్ క్యారెక్టర్ అది. అంతేకాకుండా కొన్ని సీన్లలో ఆ క్యారెక్టరే కీలకం కూడా. ఇక ఆ క్యారెక్టర్ లో జగదీశ్ నటించిన విషయం తెలిసిందే. అయితే, ముందు జగదీశ్ కి బదులుగా హీరో సుహాస్ ని ఆ క్యారెక్టర్ కోసం అనుకున్నారట డైరెక్టర్ సుకుమార్. సుహాస్ నటించిన 'ప్రసన్న వదనం' ట్రైలర్ లాంచ్ కి ముఖ్య అతిథిగా వచ్చిన డైరెక్టర్ సుకుమార్ సుహాస్ గురించి ఈ విషయాలు చెప్పారు. సుహాస్ అంటే తనకు చాలా ఇష్టం అని, నేచురల్ గా నటిస్తాడని కొనియాడారు.
మట్టినటుడు సుహాస్..
ట్రైలర్ లాంచ్ లో మాట్లాడిన సుకుమార్ సుహాస్ గురించి చాలా గొప్పగా చెప్పారు. "సుహాస్ అంటే నాకు చాలా ఇష్టం. నిజానికి బన్నీ నీ గురించి ఎక్కువగా చెప్తుంటాడు. అందుకే, నిన్ను పుష్పలో కేశవ క్యారెక్టర్ కి తీసుకోవాలి అనుకున్నాం. కానీ, అప్పటికే నువ్వు హీరోగా చేస్తున్నావు. హీరోగా చేస్తున్నప్పుడు నిన్ను డిస్ట్రబ్ చేయడం ఎందుకు అని అడగలేదు. నాని అంటే నాకు చాలా ఇష్టం. నాని లానే అనిపిస్తాడు సుహాస్ నాకు. నాని గ్రాఫ్ ఎలా పెరుగుతూ వచ్చిందో సుహాస్ కూడా అలా సక్సెస్ అవుతాడు. సహజ నటుడు నానీ అయితే, సుహాస్ ని మట్టి నటుడు అనాలేమో. అంత ఆర్గానిక్ గా ఉంటుంది నటన. యాక్టింగ్ చూశాం కదా చాలా సింపుల్ గా, నేచురల్ గా క్యారెక్టర్స్ లో ఇమిడిపోతాడు" అని సుహాస్ గురించి చెప్పారు సుకుమార్.
అర్జున్ దీ బెస్ట్..
ఈ సందర్భాంగా 'ప్రసన్న వదనం' సినిమా డైరెక్టర్ అర్జున్ గురించి మాట్లాడారు సుకుమార్. "ముందుగా అర్జున్ కి ఛాన్స్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇక అర్జున్ గురించిచెప్పాలంటే.. నేను 'జగడం' షూట్ చేసినప్పుడు బెంగళూరు నుంచి ఒక అబ్బాయి వచ్చాడు. చాలా బక్కగా ఉన్నాడు. "చూశాను సార్ ఆర్య చాలా ఇష్టం నాకు. థియేటర్స్ చేశాను. మీ దగ్గర జాయిన్ అవ్వవాలి అనుకుంటున్నాను" అన్నాడు. నేను రమేశ్ గారికి టెస్ట్ చేయమన్నాను. కుర్రాడు భలే టాలెంటెడ్ గా ఉన్నాడు అని అన్నాడు. జగడం ఫ్లాప్ తర్వాత వీళ్లే నాతో ఉన్నారు. కేవలం అర్జున్, తోట శ్రీనుతో 'ఆర్య - 2', '100 % లవ్', 'వన్ నేను ఒక్కడినే', 'నాన్నకు ప్రేమతో', 'రంగస్థలం' ప్రతి సినిమాకి వీళ్లు కామన్. మిగతా వాళ్లంతా నా దగ్గర తర్వాత వచ్చిచేరిన వాళ్లే అని చెప్పారు సుకుమార్.
ఆకట్టుకున్న ట్రైలర్..
హీరో సుహాస్.. ఎప్పుడూ డిఫరెంట్ డిఫరెంట్ కథలు ఎంచుకుంటాడు. ఆయన స్టోరీ సెలక్షన్ చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఈసారి కూడా సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు సుహాస్. అదే 'ప్రసన్న వదనం'. 'ప్రసన్న వదనం' ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఫేస్ బ్లైండ్‌నెస్ అనే కొత్త కాన్సెప్ట్ కావడంతో అందరూ ఆసక్తిగా సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో రాశి సింగ్ హీరోయిన్ కాగా.. సినిమాని అర్జున్ వైకే డైరెక్ట్ చేస్తున్నాడు. మే 3న సినిమా రిలీజ్ కానుంది.
Also Read: మరోసారి పెళ్లి ఫొటోలు షేర్ చేసిన మేఘ ఆకాశ్.. అసలు పెళ్లి ఎవరిదంటే?