Mehreen Pirzadaa: ‘లస్ట్ స్టోరీ 2’లో మెహ్రీన్? ఆ ఫొటో చూసి, ‘నువ్వు కూడా ఉన్నావా హనీ’ అంటున్న నెటిజన్స్!
జూన్ 29 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది ‘లస్ట్ స్టోరీస్ 2’ సిరీస్. ఇప్పుడు ఈ సిరీస్ గురించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో సర్క్యులేట్ అవుతోంది. అదేంటంటే..
Mehreen Pirzadaa: బాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ సిరీస్ ‘లస్ట్ స్టోరీస్ 2’ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 2018లో వచ్చిన ‘లస్ట్ స్టోరీస్’కు ఇది సీక్వెల్. ఇందులో తమన్నా, మృణాల్ ఠాకూర్, కాజోల్, నీనా గుప్తా, అమృత సుభాష్, అంగద్ బేడీ, విజయ్ వర్మ లు కనిపించనున్నారు. ఈ సిరీస్ ను అమిత్ రవీంద్రనాథ్ శర్మ, కొంకణా సేన్ శర్మ, ఆర్ బాల్కి, సుజోయ్ ఘోష్ లు దర్శకత్వం వహించారు. అయితే ఈ సిరీస్ నుంచి లేటెస్ట్ వార్త ఒకటి ఫిల్మ్ వర్గాల్లో వైరల్ అవుతోంది. ఈ సిరీస్ లో టాలీవుడ్ బ్యూటీ మెహ్రీన్ కూడా నటిస్తుందని తెలుస్తోంది. ఆమె ఇటీవల తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన ఫోటో ఈ వార్తను కన్‌ఫర్మ్ చేస్తోంది. ఇప్పుడు మోహ్రీన్ షేర్ చేసి ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.
‘లస్ట్ స్టోరీస్ 2’ లో మెహ్రీన్ పిర్జాదా కూడా ఉందా?
‘లస్ట్ స్టోరీస్ 2’ నుంచి ఇప్పటికే విడుదల అయిన ప్రచార చిత్రాలు, ట్రైలర్ లు ఆకట్టుకున్నాయి. ఈ సీజన్ కూడా మొత్తం కామం (లస్ట్) చుట్టూనే కథ నడుస్తుందని తెలుస్తోంది. నాలుగు పాత్రలు, వాళ్ల తీరని కోరికలు, దానికోసం వారు చేసే ప్రయత్నాలు ఇలా అంతా అడల్ట్ కంటెంటే. ఇక రియల్ లైఫ్ లవర్స్ తమన్నా, విజయ్ వర్మ లు రీల్ లైఫ్ లోనూ రొమాన్స్ చేస్తూ కనిపించారు. అలాగే బాలీవుడ్ లో సీనియర్ యాక్టర్స్ అయిన నీనా గుప్తా, కాజోల్ వంటి వాళ్ళు కూడా ఈ సిరీస్ లో కనిపిస్తున్నారు. ఇప్పుడు వీరితో పాటు టాలీవుడ్ బ్యూటీ మెహ్రీన్ కూడా ఇందులో భాగం అయినట్టు తెలుస్తోంది. రీసెంట్ గా మెహ్రీన్ షేర్ చేసిన ఫోటో ఈ విషయాన్ని కంఫర్మ్ చేసింది. అయితే ఇప్పటి వరకూ వచ్చిన ప్రచార చిత్రాల్లో మెహ్రీన్ ఎక్కడా కనిపించలేదు. మేకర్స్ కూడా ఆమె ఇందులో ఉందని ప్రకటించలేదు. ఇప్పుడు మెహ్రీన్ కూడా ఇందులో ఉందని తెలియడంతో ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇందులో మోహ్రీన్ ఎలాంటి పాత్రలో కనిపిస్తుంది. ఆమె పాత్ర కూడా బోల్డ్ గా ఉంటుందా లేదా ప్రత్యేకమైన పాత్ర ఏమైనా పోషిస్తుందా అనేది తెలియాలి అంటే సిరీస్ రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
నెట్ ఫ్లిక్స్ లో ‘లస్ట్ స్టోరీస్ 2’ స్ట్రీమింగ్
ఈ ‘లస్ట్ స్టోరీస్’ అనేది ఓ భిన్నమైన పాత్రల ఆంధాలజీ. తొలి పార్ట్ లాగానే రెండో పార్ట్ ను కూడా తీర్చిదిద్దారు మేకర్స్. 2018లో మొదటి సీజన్ వచ్చినపుడు ఓటీటీలు అంటే అంతగా ఎవరికీ తెలియదు. ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రతీ ఒక్కరూ ఓటీటీలు చూస్తున్నారు. దీంతో ఈ ‘లస్ట్ స్టోరీస్ 2’పై ఆసక్తి మొదలైంది. అందులోనూ ఇప్పుడు మెహ్రీన్ కూడా ఉండనుందని తెలియడంతో సిరీస్ లో ఆమె పాత్రపై ఉత్కంఠ మొదలైంది. ‘లస్ట్ స్టోరీస్ 2’ను నెట్ ఫ్లిక్స్ లో జూన్ 29 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు.
Also Read: 'గాంఢీవ ధారి అర్జున' రిలీజ్ డేట్ ఫిక్స్ - ఈసారైనా మెగా హీరోకి హిట్ దక్కేనా!
View this post on Instagram