(Source: ECI/ABP News/ABP Majha)
HanuMan OTT: ‘హనుమాన్’ ఓటీటీ రిలీజ్ అప్డేట్ - ఫైనల్‌గా నోరువిప్పిన ప్రశాంత్ వర్మ
Prasanth Varma: ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘హనుమాన్’ మూవీ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. దీంతో వారిని హ్యాపీ చేయడానికి దర్శకుడే అప్డేట్‌తో ముందుకొచ్చాడు.
Prasanth Varma about HanuMan OTT Release: ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘హనుమాన్’.. జనవరి 12న థియేటర్లలో విడుదలయ్యింది. అంటే ఇప్పటికే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి రెండు నెలలు అయ్యింది. అయినా దీని ఓటీటీ రిలీజ్‌పై ఎలాంటి అప్డేట్ లేదు. జీ5.. ఈ సినిమా ఓటీటీ హక్కులను కొనుగోలు చేసిందని, మార్చి 8న ‘హనుమాన్’ స్ట్రీమింగ్ ప్రారంభమవుతుందని.. ఇలా చాలా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా.. అవన్నీ రూమర్స్‌గానే మిగిలిపోయాయి. ఇక ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు అప్డేట్ ఇవ్వడానికి దర్శకుడు ప్రశాంత్ వర్మ ముందుకొచ్చాడు.
ప్రశాంత్ వర్మ ట్వీట్..
మార్చి 8న ‘హనుమాన్’ జీ5 స్ట్రీమ్ అవ్వడం కన్ఫర్మ్ అని మూవీ లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ జీ5 మాత్రం తమకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదని తేల్చి చెప్పింది. దీంతో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. అసలు మూవీ ఓటీటీ రిలీజ్‌కు ఎందుకు ఇంత ఆలస్యం అవుతుందని నిరాశ వ్యక్తం చేశారు కూడా. కానీ దర్శకుడు ప్రశాంత్ వర్మ తాజాగా చేసిన ట్వీట్‌తో ఫ్యాన్స్ కాస్త కుదుటపడ్డారు. ‘హనుమాన్ ఓటీటీ స్ట్రీమంగ్ డేట్ అనౌన్స్‌మెంట్ వచ్చేస్తోంది’ అని ప్రశాంత్ వర్మ తన ట్విటర్ ద్వారా తెలిపాడు. దీంతో ఫ్యాన్స్ సంతోషానికి హద్దులు లేవు. ‘హనుమాన్’ను థియేటర్లలో మిస్ అయినవారు మాత్రమే కాదు.. థియేటర్లలో చూసి ఎంజాయ్ చేసినవారు కూడా దీని ఓటీటీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
#HanuMan OTT streaming date announcement is coming! 😊👍🏼
— Prasanth Varma (@PrasanthVarma) March 11, 2024
వారికి మాత్రమే అప్డేట్..
‘హనుమాన్’ సినిమాతో యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ టాలెంట్ ఏంటో అందరికీ తెలిసింది. అందుకే తన సినిమాటిక్ యూనివర్స్‌లో తెరకెక్కుతున్న తరువాతి సినిమాలపై అందరికీ ఆసక్తి పెరిగింది. ముందుగా ‘హనుమాన్’కు సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్. ఇప్పటికే ‘జై హనుమాన్’ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నాడు. కానీ ‘హనుమాన్’ ఓటీటీ రిలీజ్ విషయంలోనే ప్రశాంత్ వర్మపై నిరాశతో ఉన్నారు ఫ్యాన్స్. ఇప్పుడు దానిపై కూడా అప్డేట్ ఇచ్చి వారిని మరింత ఖుషీ చేశాడు. ‘హనుమాన్’ను ఓటీటీలో తెలుగులో చూడాలి అనుకుంటున్న ప్రేక్షకులకు ఎలాంటి అప్డేట్ లేకపోయినా.. హిందీ వర్షన్ కోసం ఎదురుచూస్తున్న వారికి మాత్రం హ్యాపీ న్యూస్ ఎదురయ్యింది.
హిందీ వెర్షన్ రెడీ..
‘హనుమాన్’ తెలుగు వర్షన్‌ను జీ5 కొనుగోలు చేయగా.. హిందీ వెర్షన్ రైట్స్ జియో సినిమా చేతికి వెళ్లింది. మార్చి 16న ఈ సినిమా హిందీ వర్షన్ జియో సినిమాలో స్ట్రీమింగ్ ప్రారంభించుకోనుంది. ఈ మూవీ తెలుగులో ఎంత బ్లాక్‌బస్టర్ అయ్యిందో.. హిందీ వర్షన్ కూడా అదే రేంజ్‌లో హిట్ అయ్యింది. కేవలం హిందీలో మాత్రమే ‘హనుమాన్’కు రూ.50 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. దీనిని మళ్లీ మళ్లీ థియేటర్లలో చూడడానికి తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు.. హిందీ ఆడియన్స్ కూడా ఆసక్తి చూపించారు. ‘హనుమాన్’ విడుదలయ్యి 50 రోజులు అయినా కూడా ఇంకా 150 థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూ అందరినీ ఆశ్చర్యపరిచింది.
Also Read: హీరోయిన్‌తో కిరణ్ అబ్బవరం ప్రేమ, పెళ్లి - ఈ నెలలోనే ఎంగేజ్‌మెంట్!