Kiran Abbavaram: హీరోయిన్‌తో కిరణ్ అబ్బవరం ప్రేమ, పెళ్లి - ఈ నెలలోనే ఎంగేజ్‌మెంట్!
Kiran Abbavaram - Rahasya Gorak: ‘రాజా వారు రాణి గారు’తో ఒకేసారి ఇండస్ట్రీలో హీరో, హీరోయినగా అడుగుపెట్టిన కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ ఎంగేజ్‌మెంట్‌కు సర్వం సిద్ధమయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి.
Kiran Abbavaram - Rahasya Gorak Engagement: చాలామంది హీరో, హీరోయిన్లు తమ మొదటి సినిమా కో స్టార్‌తోనే ప్రేమలో పడతారు. కానీ ఆ రిలేషన్‌షిప్ అనేది కొంతమందికి మాత్రమే వర్కవుట్ అవుతుంది. కొన్ని మాత్రమే పెళ్లి వరకు వెళతాయి. ఇప్పుడు అలా పెళ్లి వరకు రిలేషన్‌షిప్‌లో మరో జంట చేరనుంది. అదే కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ కపుల్. వీరిద్దరి లీడ్ రోల్స్‌లో హీరో, హీరోయిన్‌గా మొదటి సినిమాను కలిసి చేశారు. అప్పటినుండి వీరిద్దరి మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ ఏర్పడింది. అయితే పలుమార్లు వీరిద్దరూ ప్రేమలో పడ్డారని రూమర్స్ వైరల్ అయినా.. దానిని వారు పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా కిరణ్, రహస్య త్వరలోనే ఎంగేజ్‌మెంట్ చేసుకోనున్నారనే వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది.
ఒకే సినిమాతో..
కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్.. ఇద్దరూ నటులుగా తమ కెరీర్లను షార్ట్ ఫిల్మ్స్‌తోనే ప్రారంభించారు. ఆ తర్వాత కిరణ్ కంటే ముందుగా సినిమాల్లోకి ఎంటర్ అయ్యింది రహస్య. ఒకట్రెండు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెరిసింది. వీరిద్దరి కెరీర్లను ‘రాజా వారు రాణి గారు’ చిత్రం ఒక మలుపు తిప్పింది. ఏ అంచనాలు లేకుండా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. యూత్‌ను విపరీతంగా ఆకట్టుకొని సూపర్ హిట్ అయ్యింది. దీంతో హీరోగా కిరణ్ అబ్బవరంకు, హీరోయిన్‌గా రహస్య గోరక్‌కు మంచి గుర్తింపు లభించింది. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని రూమర్స్ కూడా మొదలయ్యాయి. దీనిపై వీరు పెద్దగా స్పందించకపోయినా.. కొన్నిసార్లు కవర్ చేయబోయి దొరికిపోయారు.
రహస్యంగా ట్రిప్స్..
గతేడాది కిరణ్ అబ్బవరం ఒక ట్రిప్‌కు వెళ్లాడు. అదే సమయంలో రహస్య కూడా ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తున్నట్టు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వీరిద్దరి ఫోటోల బ్యాక్‌గ్రౌండ్స్‌ను బట్టి ఒకే ట్రిప్‌కు వెళ్లారని నెటిజన్లు కన్ఫర్మ్ చేసుకున్నారు. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే రూమర్స్ మరింత గట్టిగా వినిపించడం మొదలయ్యింది. ఇదే విషయంపై ఒక ఇంటర్వ్యూలో కిరణ్ అబ్బవరంకు ప్రశ్న ఎదురయ్యింది. తనకు, రహస్యకు మధ్య ఏముంది అనే ప్రశ్నకు ఏది ఉన్నా కలిసే చెప్తామంటూ సమాధానమిచ్చాడు కిరణ్. దీంతో ప్రేక్షకులంతా వీరిద్దరి రిలేషన్‌ను కన్ఫర్మ్ చేసేసుకున్నారు. ఇంతలోనే వీరి ఎంగేజ్‌మెంట్‌పై రూమర్స్ వైరల్ అవ్వడం మొదలయ్యింది.
ఈ నెలలోనే..
ఈ వారం చివర్లో కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ ఎంగేజ్‌మెంట్‌కు సర్వం సిద్ధమయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఎంగేజ్‌మెంట్ తర్వాత పెళ్లి తేదీ బయటికి రానుంది. ఇప్పటికీ ఈ విషయంపై స్పందించడానికి కిరణ్, రహస్య ముందుకు రాలేదు. ‘రాజా వారు రాణి గారు’తో గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం బ్యాక్ టు బ్యాక్ పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలతో పనిచేయడం మొదలుపెట్టాడు. కానీ రహస్య మాత్రం పూర్తిగా సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. టాలీవుడ్‌లో వినిపిస్తున్న కథనాల ప్రకారం కిరణ్ అబ్బవరం సినిమా పనులను చూసుకోవడంలో రహస్య బిజీ అయిపోయిందని తెలుస్తోంది. మరి ఈ వారంలో వీరి ఎంగేజ్‌మెంట్ నిజంగా జరుగుతుందా లేదా చూడాలి.
Also Read: అడల్ట్ లోకంలో రాలిన మరో అందాల తార - 26 ఏళ్లకే సోఫియా లియోన్ మరణం, కారణాలేమిటీ?