Aavesham movie OTT: సడెన్‌గా ఓటీటీకి వచ్చేసిన ఫహాద్ ఫాజిల్ 'ఆవేశం'- స్ట్రీమింగ్ ఎక్కడంటే!
Aavesham Movie OTT: 'పుష్ప' విలన్ ఫహాద్ ఫాజిల్ నటించిన లేటెస్ట్ మూవీ ఆవేశం తెలుగు వెర్షన్ ఓటీటీకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాంలో ప్రస్తుతం ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది.
Fahadh Faasil Aavesham movie Now Streaming on OTT: మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటించిన లేటెస్ట్ మూవీ 'ఆవేశం'. ఇటీవల థియేటర్లో విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. జీతు మాధవన్ తెరకెక్కిస్తున్న ఈస ఇనిమా ఏప్రిల్ 14న థియేటర్లోకి వచ్చి ఊహించని విజయం సాధించింది. విడుదలైన రెండు వారాల్లోనే రూ. 150 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. ఈ ఏడాది మాలీవుడ్‌లో మలయాళంలో హైయ్యేస్ట్ గ్రాస్ వసూళ్లు చేసిన నాలుగో సినిమాగా నిలిచింది.
థియేటర్లో విడుదలైన మూడు వారాలకే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీకి వచ్చేసింది. దిగ్గజ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైంలో ఈ మూవీ సడెన్‌గా ప్రీమియర్‌కు వచ్చేసింది. మలయాళ థియేటర్లో ఇప్పటికీ సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతున్న ఈ మూవీ తెలుగు వెర్షన్ ఇప్పుడు ఓటీటీకి వచ్చేసింది. ఈ మూవీ ఓటీటీకి వస్తున్నట్టు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. అయితే రిలీజ్ డేట్‌పై క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు సడెన్‌గా ఈరోజు(మే 9న) నుంచి సైలెంట్‌గా అమెజాన్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. కాగా క్రైమ్ కామెడీ యాక్షన్ మూవీగా వచ్చిన ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్ గ్యాంగ్‌స్టర్ రంగా అనే పాత్రలో నటించాడు. ఇందులో గ్యాంగ్‌స్టర్ ఫహాద్ ఫాజిల్ తన యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు.
ఇక మూవీ క్లైమాక్స్ వరకు అసలు ఫైటే చేయని ఈ ఫన్నీ గ్యాంగ్‌స్టర్‌ను చూసి థియేటర్లో ఆడియన్స్ అంతా ఫుల్ ఎంజాయ్ చేశారు. ఫలితంగా ఈ సినిమా ఫస్ట్ షో నుంచి పాజిటివ్ రివ్యూతో బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఒకేసారి మలయాళ, తెలుగులో రిలీజ్ అయినా ఈ సినిమా మాలీవుడ్‌లో బాక్సాఫీసు వద్ద సక్సెస్‌పుల్‌గా దూసుకుపోతుంది. అయితే ప్రస్తుతం ఓటీటీలో ఒక్క తెలుగు వెర్షన్ మాత్రమే అందుబాటులోకి వచ్చింది. కాగా ఫహాద్ ఫాజిల్ ప్రస్తుతం 'పుష్ప 2' సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భన్వర్‌సింగ్ షెకవత్‌గా పోలీసు పాత్రలో నటించనున్నారు. తొలి పార్ట్‌లో కనిపించింది కాసేపైన తనదైన యాక్టింగ్స్ స్కిల్స్‌తో ఆకట్టుకున్నాడు. దీంతో పార్ట్ 2లో ఆయన క్యారెక్టరైషన్, యాక్టింగ్ ఎలివేషన్ ఎలా రేంజ్‌లో ఉండనుందా? చూసేందుకు ఆడియన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ మూవీ కథ విషయానికి వస్తే
అజు (హిప్జ్‌స్టర్), బీబీ (మిథున్ జై శంకర్), శాంతన్ (రోషన్ షానవాజ్) కేరళ నుంచి ఇంజనీరింగ్ చదవడం కోసం బెంగళూరుకు వస్తారు. అయితే కాలేజీలో ర్యాగింగ్ ఎక్కువగా ఉంటుంది. సీనియర్లు ఎప్పటి నుంచో కాలేజీలో ఉంటున్నారు కాబట్టి వారిలో ఐకమత్యం ఎక్కువ అని, జూనియర్లు కూడా అలాగే ఉంటే ర్యాగింగ్ ఉండదని అజు జూనియర్లను మోటివేట్ చేస్తాడు. 22 మందితో ఒక గ్యాంగ్ ఏర్పాటు చేసి సీనియర్లను లెక్క చేయకుండా ప్రవర్తిస్తాడు. ఒకరోజు వీళ్లు ముగ్గురూ సీనియర్లలో మోస్ట్ డేంజరస్ అయిన కుట్టితో (మిథుట్టీ) వాళ్లకు తెలియకుండానే పెట్టుకుంటారు. దీంతో కుట్టి అదే రోజు రాత్రి పెద్ద గ్యాంగ్‌తో వచ్చి వీళ్లు ముగ్గురినీ బట్టలు ఊడదీయించి సిటీ అంతా కార్లో తిప్పి తమ ప్లేస్‌కు తీసుకువెళ్తారు. అక్కడ మూడు రోజుల పాటు వీళ్లని కొడతారు.