అన్వేషించండి

Deva Katta: చంద్రబాబు Vs వైఎస్సార్ లైఫ్ స్టోరీ కాదు - 'మయసభ' సిరీస్‌పై డైరెక్టర్ దేవా కట్టాతో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ

Mayasabha Series: ఆది పినిశెట్టి, చైతన్యరావు పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'మయసభ'. ఈ నెల 7 నుంచి స్ట్రీమింగ్ కానుండగా... డైరెక్టర్ దేవాకట్టా ఏబీపీ దేశం ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.

Deva Katta About Mayasabha Series In Abp Desam Exclusive Interview: చంద్రబాబు, వైఎస్సార్ పొలిటికల్ జర్నీ, వారి లైఫ్ స్టోరీ ఆధారంగా 'మయసభ' సిరీస్ రూపొందించారన్న ప్రచారంపై డైరెక్టర్ దేవా కట్టా స్పందించారు. అది నిజం కాదని... పవర్, పాలిటిక్స్, ఎమోషన్, ఇల్యూషన్ అన్నింటికీ రిలేటబుల్‌గా ఈ స్టోరీ ఉంటుందని అన్నారు. ఈ పొలిటికల్ థ్రిల్లర్ సిరీస్‌పై ఏబీపీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

రోల్స్ అలానే చూస్తా...

ఏ మూవీ, సిరీస్ అయినా ఆడియన్స్ చూసే విధానం బట్టి ఆ క్యారెక్టర్ మారిపోతుందని... వారు ఊహించుకున్న రోల్స్‌ పరంగానే వాటిని చూస్తూ కనెక్ట్ అవుతారని దేవా కట్టా తెలిపారు. మయసభ సిరీస్‌లో ఇద్దరు వ్యక్తులు సాధారణ స్థాయి నుంచి పాలిటిక్స్‌లోకి ఎలా వెళ్లారు?, వారిని ఇన్ స్పైర్ చేసిన అంశాలేంటి అనేదే చూపించినట్లు చెప్పారు. 'నాకు వచ్చే ఏ ఇమేజినేషన్ అయినా స్టోరీ అయినా చిన్న పిల్లాడు ప్రపంచాన్ని ఎలా చూస్తాడో అలానే చూస్తా. అవతలి మనిషి పాత్రలో మనల్ని మనం ఊహించడం... ఆ భావాల నుంచే ఈ కథ పుట్టింది.' అని అన్నారు.

ఇది బయోపిక్ కాదు... అంతకు మించి

తనకు బయోపిక్స్ తీయడం ఇష్టం లేదని... 'మయసభ' సిరీస్ ఎవరి బయోపిక్ కాదని స్పష్టం చేశారు దేవా కట్టా. 'ఏదో గట్టిగా కొట్టేయాలి అంటూ బలంగా కూర్చుని నేను ఏ స్క్రిప్ట్ రాయను. క్యారెక్టర్స్ తపనతో రాస్తాను కాబట్టి ఆడియన్స్‌కు అవి బాగా కనెక్ట్ అవుతాయి. హిస్టరీని హిస్టరీగా చెపతే అది డాక్యుమెంటరీ అవుతుంది. ఒకప్పుడు ఐడియాలిజకల్‌గా బాండ్ అయిన ఇద్దరు యంగ్ డైనమిక్ వ్యక్తుల పొలిటికల్ జర్నీని వాళ్ల కళ్లతో చూస్తే ఎలా ఉంటుంది అనేదే ఈ మయసభ కథ. ఇది ఓ ఊహాజనితమైన స్టోరీ. దీనికి హిస్టరీకి ఎలాంటి సంబంధం లేదు.' అని వెల్లడించారు.

Also Read: కాబోయే భర్తతో బిగ్ బాస్ ఫేం ప్రియాంక జైన్ వరలక్ష్మి పూజ - విషెష్‌తో పాటే విమర్శలు కూడా...

'ఇంద్రప్రస్థం' అనుకున్నా...

తొలుత ఈ సిరీస్‌కు 'ఇంద్రప్రస్థం' అనే టైటిల్ అనుకున్నా... పవర్, పాలిటిక్స్, ఎమోషన్, ఇల్యూషన్ అందరికీ కనెక్ట్ అయ్యేలా... పక్కా నేటివిటీ వచ్చేలా 'మయసభ' ఫిక్స్ చేసినట్లు చెప్పారు దేవా కట్టా. 'నేను ఏ లీడర్‌కు ఏ హీరోకు పిచ్చి ఫ్యాన్ కాదు. ఒకవేళ అలా జరిగితే ఆ ఎమోషన్‌కు బానిస అయినట్లే. ఆ బానిసత్వంలో చాలామంది బతికేస్తున్నారు. దాని నుంచి కూడా బయటకు తీసుకురాగలిగే పవర్, ఎమోషన్ మయసభ సిరీస్‌లో ఉందేమో అని నేను బలంగా నమ్ముతా.' అని చెప్పారు.

పొలిటికల్ థ్రిల్లర్... క్యూట్ లవ్ స్టోరీ

కృష్ణమ నాయుడు రోల్‌కు ఓ స్మాల్ క్యూట్ లవ్ స్టోరీ పెట్టడంపై దేవా కట్టా స్పందించారు. 'ప్రతీ మనిషి జీవితంలోనూ లవ్ స్టోరీస్ ఉంటాయి. నేను రాసుకున్న పాత్రలు రాతిబొమ్మల్లా ఉండడం నాకు ఇష్టం లేదు. అందులో పుట్టిన ఓ క్యూట్ లవ్ స్టోరీ, బ్రేకప్, హార్ట్ బ్రేకప్, అక్కడి నుంచి ఆ రోల్ ఏం నేర్చుకుంటుంది. ఆ జర్నీ నుంచే గొప్ప మనుషులు పుడతారు. గొప్పతనం పుడుతుంది. అదే లైఫ్. అందులో ఉన్న ఓ స్మాల్ థింగ్ కృష్ణమనాయుడుకు యంగ్ ఏజ్‌లో ఉన్న లవ్ స్టోరీ.' అని చెప్పారు.

'ప్రస్థానం' మూవీ టైంలో కరుణానిధి ఫ్యామిలీ గురించి తీశారంటూ చాలామంది కామెంట్ చేశారని.. హిందీ డబ్బింగ్ వెర్షన్ చూసినప్పుడు ములాయం సింగ్ యాదవ్ స్టోరీ అంటూ కొంతమంది అన్నారని దేవా కట్టా తెలిపారు. 'ఎవరి వ్యూలో వారు చూసినప్పుడు క్యారెక్టర్స్ అలానే కనిపిస్తాయి. నెగిటివిటీ తీసుకునే వాళ్లు అలానే కామెంట్స్ చేస్తారు.' అని చెప్పారు.

ఇక 'మయసభ' సిరీస్ విషయానికొస్తే... ఆది పినిశెట్టి, చైతన్యరావు ప్రధాన పాత్రలు పోషించగా... డైలాగ్ కింగ్ సాయికుమార్ కీలక పాత్ర పోషించారు. దేవాకట్టా, కిరణ్ జయ్ కుమార్ డైరెక్షన్ లో రూపొందిన పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్... ఈ నెల 7 నుంచి ప్రముఖ ఓటీటీ 'సోనీ లివ్'లోతెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget